E-Paper
Advertisement

తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు.. సీఎం రేవంత్-కేసీఆర్ భారీ సభలు, మాటలయుద్ధం తప్పదా?

తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు.. సీఎం రేవంత్-కేసీఆర్ భారీ సభలు, మాటలయుద్ధం తప్పదా?
Advertisement

Telangana politics: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రానుండడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఒకేరోజు అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ పార్టీలు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేశాయి. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు

Advertisement

తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. ఈ జాబితాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే మిగిలివున్నాయి.  దీనికి సంబంధించి తెరవెనుక పనులు జరుగుతున్నాయి. రేపోమాపో నోటిఫికేషన్ రావచ్చని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ పార్టీల దృష్టి ప్రజలపై పడింది. సోమవారం ఒక్కరోజు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశాయి. సోమవారం సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి రైతు భరోసా నిధులను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేయనున్నారు.

Advertisement

అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలు

అక్కడి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు శ్రీకారం చుడతారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జగిత్యాలలో భారీ సభను నిర్వహిస్తోంది బీఆర్ఎస్. ఆ సభలో జీవన్‌రెడ్డి కారు పార్టీ కండువాను కప్పుకోనున్నారు. ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరువుతున్నాయి. దీంతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే అవకాశముందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఈ సభతో ఉత్తర తెలంగాణకు పూర్వవైభవం తేవాలని బీఆర్ఎస్ ఆశపడుతోంది. ఎందుకంటే మే లేకుంటే జూన్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సభకు తమకు అనుకూలంగా మారుతుందని ఆ పార్టీ నేతలు బలంగా చెబుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ హవా తగ్గిందని పలువురు నేతలు పదేపదే చెబుతున్నారు.

ALSO READ: మట్టిలో కలిసిన రైతన్న బంగారం.. రాళ్ల వానకు రాలిపోయిన గింజలు

అదే సమయంలో బీజేపీ అక్కడ పుంజుకుంటోంది.  జీవన్‌రెడ్డి రాకతో ఆ ప్రాంతానికి పూర్వవైభవం రావడం ఖాయమని కారు పార్టీ నేతల ధీమా.  ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్ సభలను నిశితంగా పరిశీలిస్తోంది  తెలంగాణ బీజేపీ.  సందర్భాన్ని బట్టి భారీ సభకు కమలనాధులు ప్లాన్ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దమయ్యాయనే చెప్పవచ్చు.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×