E-Paper
Advertisement

Illu illaalu pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ టీఆర్పీ రేటింగ్.. ఏప్రిల్ హైలెట్ ఎపిసోడ్స్..

Illu illaalu pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ టీఆర్పీ రేటింగ్.. ఏప్రిల్ హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Illu Illaalu Pillalu TRP Rating : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి టిఆర్పి రేటింగ్ ని నమోదు చేసుకుంటున్నాయి. ఈమధ్య కొన్ని సీరియల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. అలాంటి సీరియల్స్లలో కుటుంబ కథతో వచ్చిన కొన్ని సీరియల్స్ జనాలని ఎంతగా ఆకట్టుకుంటున్నయో తెలిసిందే. ఆ సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి. లేచిపోయి పెళ్లి చేసుకొని తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్న ఓ అనాధ అయిన రామరాజు కథ ఈ స్టోరీ. ఎవరు లేని ఒంటరిగా వచ్చిన అతనికి ఇప్పుడు ఒక కుటుంబం ఉంటుంది.. తన కుటుంబాన్ని విడిపోనివ్వకుండా తనతోనే ఉంచుకోవాలి అని ఆశతో బతికే ఒక మధ్యతరగతి తండ్రి. తండ్రి కొడుకులు మధ్య బంధాన్ని గుర్తుచేస్తున్న ఈ సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ వస్తుంది. గత నెలతో పోలిస్తే ఈనెల ఈ సీరియల్ కి టీఆర్పీ రేటింగ్ ఓ రేంజ్ లో పెరిగింది. అంతేకాదు ఏప్రిల్ నెలలో హైలెట్ ఎపిసోడ్స్ ఏవో ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం..

ఏప్రిల్ నెలలోని హైలెట్ ఎపిసోడ్స్..

గత నెలతో పోలిస్తే ఈనెల ఈ సీరియల్ లోని కొన్ని ఎపిసోడ్లు జనాలని బాగా ఆకట్టుకున్నాయి. అందులో ముఖ్యంగా అమూల్యకు విశ్వక్ మధ్య ప్రేమ రాయబారం నడిపింది వల్లి అన్న సంగతి బయటపడుతుంది. ఆ తర్వాత నుంచి ఈ సీరియల్ స్టోరీ రోజుకో మలుపు తిరుగుతూ వచ్చింది. ముందుగా వేదవతికి ఆ నిజం తెలియడంతో వల్లిని ఒక ఆట ఆడుకుంటుంది. ఆ తర్వాత చందు కి కూడా ఈ విషయం తెలియడంతో వల్లిని అసహ్యించుకుంటాడు. నువ్వు నా తల్లిదండ్రులను మోసం చేశావు అని కోపంతో రగిలిపోయిన చందు తనని పుట్టింటిలో వదిలి పెట్టేసి వస్తాడు. ఆ తర్వాత వల్లి తన భర్తకు దగ్గర అవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ చివరకు ఆమెను చందు దగ్గరికి రానివ్వడు. వల్లి తల్లి భాగ్యం చందు కి యాక్సిడెంట్ చేయించి భార్యని దగ్గర చేయాలని ప్లాన్ చేస్తుంది.. కానీ ఆ ప్లాన్ ప్రకారం ఏది జరగదు. చందు ని కాపాడబోయి ప్రేమకు యాక్సిడెంట్ అవుతుంది. అమూల్య జీవితాన్ని నాశనం చేసింది వల్లి అని తెలుసుకున్న ధీరజ్ ప్రేమకు మళ్ళీ దగ్గరవుతాడు. ప్రస్తుతం వల్లి ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని భాగ్యం డాక్టర్ తో అబద్ధం చెప్పిస్తుంది. ఇప్పటి వరకైతే వల్లి అత్తగారింట్లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తుంది. కానీ తన కడుపు విషయం బయటపడితే ఆ తర్వాత ఆ ఇంటికి నో ఎంట్రీ ఉంటుందా? లేదంటే చందు క్షమించి భార్యగా స్వీకరిస్తాడా? అన్నది ముందు ముందు ఎపిసోడ్లలో చూడాలి..

Advertisement

Also Read : సీరియల్స్ లో నటించి సినిమాల్లో బిజీ అయిన స్టార్ట్స్ ఎవరంటే..?

ప్రస్తుతం స్టోరీ ఏంటంటే..?

తన కూతురి కాపురాన్ని నిలబెట్టేందుకు తల్లి భాగ్యం శ్రీవల్లికి కడుపు వచ్చింది అని అబద్ధం చెప్పి ఆ ఇంటికి మళ్ళీ దగ్గర చేస్తుంది. తన ఇంట్లో వారసుడు రాబోతున్నాడు అని ఆ కుటుంబం పెద్ద రామరాజు చాలా సంతోషంగా ఈ విషయాన్ని ఊరంతా చెప్పాలని గ్రాండ్ గా ఫంక్షన్ ఏర్పాటు చేస్తాడు. కానీ ఆనందరావుకి అసలు నిజం తెలియడంతో ఎలాగైనా సరే దీని బయట పెట్టాలి అని అనుకుంటాడు. ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా తన అక్క భర్త అయినా భాస్కర్ తో షూరిటీ సంతకం చేయించుకుంటాడు. అది బయట పెట్టాలని అనుకున్న భాగ్యం ఆ విషయాన్ని మొత్తానికి బయట పెట్టేస్తుంది. సాగర్ కు వాళ్ళ మామ ఆస్తి పంపకాల గురించి మాట్లాడతాడు. మరి సాగర్ ఆస్తి కోసం తండ్రితో గొడవ పడతాడా? లేదంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతాడా అన్నది ఇకముందు ఎపిసోడ్లలో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×