E-Paper
Advertisement

Chinni Serial : వసుధార ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. సీరియల్ కు శుభం కార్డు..?

Chinni Serial : వసుధార ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. సీరియల్ కు శుభం కార్డు..?
Advertisement

Chinni Serial : ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ ఒక్కోసారి సడన్గా శుభం కార్డు వేసుకుంటున్నాయి. అందుకు కారణాలు అనేకం ఉంటున్నాయి. ముఖ్యంగా సీరియల్ స్టోరీలో మార్పులు లేకపోవడం, లేదంటే హీరో హీరోయిన్లు సీరియల్ కి గుడ్ బై చెప్పడం వంటివి ఉండడంతో ఆ సీరియల్ ని త్వరగా ముగించేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సీరియల్స్ ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా శుభం కార్డు వేసుకున్నాయి.. ఇప్పుడు మరో సీరియల్ త్వరలోనే ఎండు కార్డు వేయబోతుంది అని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఇంతకీ ఆ సీరియల్ ఏంటి? ఏ ఛానల్ లో ప్రసారం కాబోతుంది..? ఎందుకు ఇప్పుడు సీరియల్కు శుభం కార్డు పడబోతుంది అన్న వివరాలను కాస్త తెలుసుకుందాం..

చిన్ని సీరియల్ కు శుభం..

ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో చిన్ని సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. గతంలో ఈ సీరియల్ లో కన్నడ ముద్దుగుమ్మ కావ్య శ్రీ హీరోయిన్గా నటించారు. కానీ ఇప్పుడు ఆమె తప్పుకోవడంతో గుప్పెడంత మనసు హీరోయిన్ వసుధార ఇటీవలే ఈ సీరియల్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎంట్రీ తర్వాత రేటింగ్ విషయంలో కాస్త పెరిగినా కూడా ప్రస్తుతం స్టోరీ ఇంకా పెంచే అవకాశాలు కనిపించకపోవడంతో ఈ సీరియల్కు శుభం కార్డు పడబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈమె ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకి సీరియల్ అయిపోతుందన్న వార్త ఆమె ఫాన్స్ కి మింగుడు పడడం లేదు. ఇక ఈ సీరియల్ వచ్చే వారంలో ఎండ్అయ్యి దీని స్థానంలోకి కొత్త సీరియల్ రాబోతుందని సమాచారం..

Advertisement

Also Read :ఒక్కరూపాయి తీసుకోకుండా సినిమాలో నటించిన హీరోయిన్లు.. ఏ మూవీలో చేశారంటే..?

వసుధార కొత్త సీరియల్..

కన్నడ ముద్దుగుమ్మ వసుధారా అలియాస్ రక్షా గౌడ కన్నడలో అనేక సీరియస్లలో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంది. ఒకవైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు మోడలింగ్ కూడా చేసి మంచి క్రేజ్ ని అందుకుంది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన గుప్పెడంత మనసు సీరియల్ మంచి సక్సెస్ అందుకోవడంతో స్టార్ ఇమేజ్ దక్కింది.. ఇక ఇప్పుడు రెండో సీరియల్ గా వచ్చిన చిన్ని సీరియల్ అప్పుడే అయిపోవడంతో ఆమె ఫ్యాన్సు ఫీల్ అయిపోతున్నారు. నిజానికి ఈ ముద్దుగుమ్మ మరో కొత్త సీరియల్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కొత్త సీరియల్ గురించి ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈసారి ఎలాంటి క్యూట్ స్టోరీ తో రాబోతుందో చూడాలి.. తెలుగులో కన్నడ అమ్మాయిలకి డిమాండ్ ఎలా ఉంటుందో చెప్పానక్కర్లేదు. ప్రస్తుతం సీరియల్స్ లలో లీడ్ రోల్ లో వీళ్లే ఉంటున్నారు. ఇక తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. ఈ రక్ష గౌడ కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×