E-Paper
Advertisement

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..
Advertisement

Indraja : ఒకప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నా సీనియర్ హీరోయిన్లందరూ కూడా ఇప్పుడు బుల్లితెరపై ప్రత్యక్షమవుతున్నారు. కొంతమంది ఈ సీరియల్స్లలో కీలకపాత్రలో నటిస్తే.. మరి కొంతమంది బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలలో సందడి చేస్తున్నారు.. ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ఎక్కువగా సీనియర్ హీరోయిన్ ఇంద్రజా కనిపిస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా ఎంతో మంది హీరోలతో నటించిన ఈమె.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సినిమాలలో కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ ని అందుకోవడంతో వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. ఒకవైపు బుల్లితెరపై పలు స్పెషల్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తుంది. మరి ఈమె ఒక్క రోజుకి ఒక షోకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది? నెలకు ఎంత సంపాదిస్తుంది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

ఇంద్రజ ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంత..?

సీనియర్ హీరోయిన్ ఇంద్రజ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఆమధ్య కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. హీరోయిన్లకు తల్లి పాత్రలో చేస్తూ జనాలని తన నటనతో మెప్పిస్తుంది. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తున్న సరే.. మరోవైపు మాత్రం బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ తనదైన స్టైల్ లో అందరిని ఆకట్టుకుంటుంది.. ఈమె ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో తో పాటుగా శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇంద్రజ ఒక్క రోజుకి రెమ్యూనరేషన్ఎం త తీసుకుంటుంది అన్నది ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మరి ఇంద్రజ ఒక్క రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందంటే..సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. 3 లక్షలు ఒక్క ఎపిసోడ్ కు తీసుకుంటుంది. ఇక నెలకు నాలుగు ఎపిసోడ్లు ఉండడంతో ఈమె దాదాపు 12, 13 లక్షలు వరకు సంపాదిస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ అక్కడ కూడా సేమ్ ఇంతే తీసుకుంటుంది అని సమాచారం. ఏది ఏమైనా కూడా ఈమె నెలకి కేవలం షోల ద్వారా మాత్రమే లక్షలు సంపాదిస్తుంది అంటే ఇక సినిమాల వల్ల ఎంత సంపాదిస్తుందో అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

ఇంద్రజ సినిమాల విషయానికొస్తే…

Advertisement

అతి చిన్న వయసులోని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సినీనటి ఇంద్రజ అప్పట్లో హీరోయిన్గా ఒక ఊపు వేసింది. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరూ సరసన నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో టాప్ హీరోలతో కలిసి పనిచేశారు. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో అడపా దడపా సినిమాలు చేస్తుంది. ఆమె తన సాఫ్ట్ కార్నర్ తో అందరికీ చాలా సాఫ్ట్ గా జడ్జిమెంట్ ఇస్తూ జనాలని కూడా ఆకట్టుకుంది. దాంతో వరుసగా షోలు చేస్తూ బిజీగా మారింది. మరోవైపు వెండితెరపై వస్తున్న అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటూ వస్తుంది. పలు సినిమాలలో కీలక పాత్రలో నటిస్తూ జనాలని ఆకట్టుకుంటూ వస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ ప్రాజెక్టులు రెండు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ సినిమాల గురించి అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×