E-Paper
Advertisement

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!
Advertisement

Egg Prices: హైదరాబాద్ వాసులకు గుడ్డు ధర గట్టి షాకే ఇస్తోంది. సాధారణంగా వేసవి కాలంలో డిమాండ్ పెరిగి ధరలు మండుతుంటాయి. కానీ, ఈసారి వర్షాకాలం, బోనాల సీజన్ నడుస్తున్నా గుడ్డు ధర ఏమాత్రం తగ్గడం లేదు సరే కదా, మునుపెన్నడూ లేనంతగా ఆకాశాన్ని తాకుతోంది. ప్రస్తుతం నగరంలో ఒక్కో కోడిగుడ్డు ధర ఏకంగా రూ. 8 నుంచి రూ. 10 కి చేరడంతో సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతోంది.

మాంసం ప్రియులకు ఊరట.. గుడ్డు మాత్రం మంట!
బోనాల పండగ సీజన్ అంటే భాగ్యనగరంలో మాంసం విక్రయాలు భారీగా సాగుతాయి. ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయని అందరూ భావించారు. అయితే, మార్కెట్ సమీకరణాల వల్ల చికెన్, మటన్ ధరలు ఊహించని విధంగా రూ. 350 నుంచి రూ. 300 కి దిగివచ్చి మాంసం ప్రియులకు కాస్త ఊరటనిచ్చాయి. కానీ, ఇదే సమయంలో అందరికీ అందుబాటులో ఉండే గుడ్డు మాత్రం సైలెంట్‌గా రేట్లు పెంచుకుంటూ పోయి సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. హోల్‌సేల్ మార్కెట్‌లోనే 30 గుడ్ల ట్రే ధర రూ. 230 నుంచి రూ. 240 పలుకుతుండటం గమనార్హం.

Advertisement

ధర ఎక్కువ.. సైజు తక్కువ
ప్రస్తుతం వినియోగదారులను వేధిస్తున్న మరో ప్రధాన సమస్య గుడ్డు సైజు. సాధారణంగా మార్కెట్లో దొరికే ఒక కోడిగుడ్డు బరువు కనీసం 60 గ్రాములు ఉండాలి. కానీ, ఇప్పుడు రేట్లు అంతకంతకూ పెరుగుతున్నా, గుడ్డు సైజు మాత్రం నానాటికీ చిన్నదైపోతోంది. కనీసం 40 గ్రాముల బరువు కూడా ఉండని చిన్న గుడ్లను సైతం వ్యాపారులు గరిష్ట ధరలకు విక్రయిస్తుండటంతో జనం లబోదిబోమంటున్నారు. డబ్బులు ఎక్కువ పెట్టినా సరైన పోషకాలు అందడం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

పెరిగిన ఉత్పత్తి వ్యయమే కారణమా?
ఈ అమాంతం పెరిగిన ధరల వెనుక కోళ్ల ఫారాల నిర్వహణ ఖర్చులు, మేత ధరలు పెరగడమే ప్రధాన కారణమని ట్రేడర్స్ చెబుతున్నారు. రవాణా ఛార్జీల భారం కూడా దీనికి తోడైంది. నిత్యం ప్రోటీన్ కోసం గుడ్డుపైనే ఆధారపడే మధ్యతరగతి, పేద వర్గాలకు ఈ ధరల పెరుగుదల పెద్ద భారంగా మారింది. మరి రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరుగుతాయా లేక దిగివస్తాయా అనేది చూడాలి.

Advertisement

Also Read: ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×