E-Paper
Advertisement

42 ఏళ్ల వయసులో తొలిసారి తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ!

42 ఏళ్ల వయసులో తొలిసారి తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ!
Advertisement

Film industry:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఆలస్యంగా వివాహం చేసుకొని.. కెరియర్ పై దృష్టి పెట్టి మరింత ఆలస్యంగా పిల్లల్ని కంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. లేటు వయసులో పిల్లలు పుట్టడం వల్ల ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుత కాలంలో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత తల్లులవుతున్న సెలబ్రిటీలు సంఖ్య కూడా పెరుగుతోంది. అందులో భాగంగానే కత్రినా కైఫ్ 40 ఏళ్ల వయసు దాటిన తర్వాత ప్రెగ్నెన్సీని ప్రకటించింది.

గర్భం దాల్చిన కరిష్మా.. పోస్ట్ వైరల్

అలాగే దివ్యాంక త్రిపాఠి కూడా ఈ ఏడాది మార్చిలో తాను గర్భం దాల్చినట్లు తెలిపింది . అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ నటి కరిష్మా తన్నా (Karishma Tanna) కూడా చేరిపోయింది. ప్రస్తుతం ఈమె వయసు 42 సంవత్సరాలు.. ఈ వయసులో తాను తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించింది. తన భర్త వరుణ్ బంగేరా తో కలసి చేసిన ఒక మధురమైన ఫోటోషూట్ ను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ.. “ఒక చిన్న అద్భుతం.. మా గొప్ప బహుమతి.. ఆగస్టు 2026” అంటూ క్యాప్షన్ జోడించింది. ఇక ఈ వార్త అభిమానులను సంతోషానికి గురిచేస్తోంది. మొత్తానికైతే ఆగస్టులో పండంటి బిడ్డకు ఈ జంట ఆహ్వానం పలుకుతోందని చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసి పలువురు ప్రముఖులు , సినీ సెలబ్రిటీలు, శ్రేయోభిలాషులు , అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికి అయితే తామిద్దరం తల్లిదండ్రులం కాబోతున్నాం అంటూ ఈ జంట షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

కరిష్మా తన్నా కెరియర్..

Advertisement

కరిష్మా తన్నా కెరియర్ విషయానికి వస్తే.. 1983 డిసెంబర్ 21న మహారాష్ట్రలో జన్మించిన ఈమె.. మోడల్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత యాంకర్ గా పనిచేసిన ఈమె ప్రస్తుతం నటిగా కొనసాగుతోంది. 2001లో వచ్చిన క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ అనే సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన ఈమెకు నాగిన్ 3, ఖయామత్ కీ రాత్ సీరియల్స్ లో తన పాత్రలకు మంచి పేరు లభించింది. అంతేకాదు 2014లో బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షోలో పాల్గొని మొదటి రన్నరప్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.

ALSO READ:అయ్య బాబోయ్.. లీకైన సిలిండర్ ను గాల్లోకి విసిరేసిన సీరియల్ హీరోయిన్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు భయ్యా!

కరిష్మా తన్నా వ్యక్తిగత జీవితం..

Advertisement

ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే.. 2014 బిగ్ బాస్ సీజన్ 8 హిందీలో పార్టిసిపేట్ చేసినప్పుడు ప్రముఖ నటుడు ఉపేన్ పటేల్ తో కరిష్మా తన్నా డేటింగ్ చేసింది. ఆ తర్వాత అతనితో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ 2016లో విడిపోయారు.ఇక 2021లో ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వరుణ్ బంగేరా తో డేటింగ్ ప్రారంభించిన ఈమె.. అదే సంవత్సరం నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. 2022 ఫిబ్రవరి 5న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక వివాహం తర్వాత నాలుగేళ్లకు ఈమె గర్భం దాల్చింది.. ఇక ఈ మధురమైన ఘట్టాన్ని అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×