E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: అయ్యో.. ప్రభావతి, మనోజ్ నిమ్మకాయ భయం.. మరొక దొంగతనం.. బయటపడతారా?

Gundeninda GudiGantalu Today episode: అయ్యో.. ప్రభావతి, మనోజ్ నిమ్మకాయ భయం.. మరొక దొంగతనం.. బయటపడతారా?
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా వంటగదిలో ఉంటే బాలు అక్కడికి వెళ్లి నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు.. ఇంతకీ ఏ స్వామీజీ దగ్గరకి మీరు వెళ్లారు అని మీనా అడుగుతుంది.. బాలానంద స్వామి అని అంటాడు. ఈ బాలనంద స్వామి ఎవరు ఎక్కడ ఉంటారు అని మీనా అడుగుతుంది.. నీ ఎదురుగానే ఉన్నాడు కదా అతనే ఆ స్వామి అని అంటాడు.. ఏం మాట్లాడుతున్నారండి మీరు మాట్లాడేది మీకన్నా అర్థమవుతుందా అని మీనా అడుగుతుంది. ఏ స్వామీజీ లేడు ఆ మనోజ్ గాడు భయపడి ఇప్పటికే తడిసిపోతూ ఉంటాడు. అందుకే నేనే అలా చేశాను అని మీనాకు బాలు నిజం చెప్తాడు.. మనోజ్, ప్రభావతి ఇద్దరూ చూసుకుంటూ భయపడిపోతూ ఉంటారు.

ఇంట్లోకి నిమ్మకాయ తెచ్చిపెట్టాడు కచ్చితంగా వాడు చెప్పినట్టు జరుగుతుందేమో.. మనమే ఆ నగలని దొంగలించామని బయటపడుతుందేమో అని ఇద్దరు టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే ఒకరికొకరు ముఖంలో మార్పులు రావడం గమనించి కంగారు పడతారు. రోహిణి ఎంతగా ధైర్యం చెప్పినా సరే మనోజ్, ప్రభావతిలు టెన్షన్ పడుతూనే ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. శృతి నగలు దొంగతనం జరగడం నేను తట్టుకోలేక పోతున్నాను. పాపం మీనాకు ఎటు సుఖం లేకుండాపోయింది. అని అనుకుంటారు. ఎదురుగా మీనా వస్తుంది. అన్నయ్య చెప్పినట్లు ఆ నిమ్మకాయ చాలా పవర్ఫుల్ అనుకుంటాను కచ్చితంగా దొంగ ఎవరో దొరుకుతారు అనేసి రవి అంటాడు.. నిజంగానే ఆ స్వామీజీ అంత పవర్ఫుల్ అమ్మినా అని శృతి అడుగుతుంది.. అయితే మీనా అసలు నిజాన్ని చెప్పేస్తుంది.. అవును ఇంట్రెస్టింగ్ అని శృతి అంటుంది. ఈ నగలు దొరికితే బాగుండు అని అంటారు. ఇకపోతే మనోజ్ తనకు ఏదో జరిగిపోతుందని రోహిణి లేపుతాడు. రోహిణి అంతా నీ భ్రమే అని చివాట్లు పెడుతుంది.. తమకు నిజంగానే ఏదో ఒకటి జరుగుతుందని మనోజ్ ప్రభావతీయులు టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ నిమ్మకాయ ఎలా ఉందో చూడాలని కిందకి వస్తారు.

అలా ఇద్దరు అనుకోకుండా గుద్దుకుంటారు. ఒకరిపై మరొకరు నిజాలు చెప్పేసుకుంటారు… అమ్మ ఏం మాట్లాడుతున్నావు నేను అమ్మ మనోజ్ ని అని అంటాడు. నాకు భయంకరమైన కల వచ్చింది అని అనగానే.. ప్రభావతి నాకు కూడా అతి భయంకరమైన కళ వచ్చింది రా అని తమ ఫ్లాష్ బ్యాక్ కళలను గుర్తు చేసుకొని భయపడతారు. ఈ నిమ్మకాయ కనక ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందోనని భయంతో నేనే నిజం చెప్పేసేలా ఉన్నాను ఆ నిమ్మకాయని తీసి బయటపడేద్దామని అంటాడు  మనోజ్.. కానీ ప్రభావతి ముట్టుకుంటే ఏదైనా జరుగుతుందేమోరా అనేసి అనుకుంటుంది.

Advertisement

వీటికి ఒక పరిష్కారం కావాలంటే కామాక్షి కి ఫోన్ చేసి నిజాన్ని కనుక్కోవాలి అని ప్రభావతి అంటుంది. కామాక్షి కి ఫోన్ చేయ్యగానే కాస్త వెటకారంగా మాట్లాడుతుంది. చివరికి రేపు ఉదయం మీరు బతికుంటే చూసుకుందాంలే అని అంటుంది దాంతో ఇద్దరు ఇంకాస్త టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా తెల్లవారు ఎంతవరకు నిద్రపోకుండా ఆ నిమ్మకాయ గురించి ఆలోచిస్తూ చూస్తూ ఉంటారు.. ఇక లాభం లేదమ్మా మీరందరూ వచ్చేలాగా మనకి ఏమి జరగకుండా ఉండాలంటే ఆ నిమ్మకాయలు తీసి బయట పడేయాలి అని మనోజ్ అంటాడు.

Also Read :తనూజకు నాగార్జున సపోర్ట్..అంతా మోసం..బిగ్ బాస్ పై శేఖర్ బాషా షాకింగ్ కామెంట్స్..

వాళ్ళిద్దరూ దొంగ చాటుగా నిమ్మకాయలను తీసుకొని వెళ్లడం ఇంట్లోని వాళ్ళందరూ చూసేస్తారు. అక్కడ ఉండాల్సిన నిమ్మకాయలు మీ చేతిలో ఎలా ఉన్నాయని సత్యం అడుగుతాడు. ఇక ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా తప్పించుకోలేక అసలు అన్ని బయట పెడతారు. నువ్వు చేతగాని వెధవ మళ్ళీ తప్పు చేసావా నువ్వు ఇక మారవా అని సత్యం మనోజ్ నీ కొడతాడు. మధ్యలో అడ్డుగా వచ్చిన ప్రభావతిని కూడా కొడతాడు.. నీవల్లే వీడిలా చెడిపోయాడు. ఇప్పుడు మీనా నగలు ఎలా తీసుకొస్తావో తీసుకురా అనేసి సత్యం వార్నింగ్ ఇస్తాడు. ప్రభావతి ఎంత చెప్తున్నా కూడా సత్యం మాత్రం మాట వినకుండా మనోజ్ ని కొట్టి అసలు నిజాన్ని రాబడతాడు అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×