E-Paper
Advertisement

OTT Movie : తాగిన మత్తులో భర్తకి షాకిచ్చే భార్య … ప్రియుడితోనే బాగుందంటూ … మొత్తం అలాంటి సీన్లే

OTT Movie : తాగిన మత్తులో భర్తకి షాకిచ్చే భార్య … ప్రియుడితోనే బాగుందంటూ … మొత్తం అలాంటి సీన్లే
Advertisement

OTT Movie : టామ్ క్రూజ్ పాతిక సంవత్సరాల క్రితం నటించిన సినిమా ‘ఐస్ వైడ్ షట్’. ఇప్పటికి టాప్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలలో ఒకటిగా చెప్పుకుంటారు. ఈ సినిమాని చూసిన వాళ్లు రోజుల తరబడి ఆలోచిస్తారు. కంటెంట్ అంతలా మనసుని టచ్ చేస్తుంది. పెళ్లి అయిన తర్వాత కూడా మన మనసులో ఎన్ని సీక్రెట్స్ ఉంటాయి… ఎన్ని డార్క్ ఫాంటసీలు దాక్కుని ఉంటాయో చూపిస్తూ గల్లీల్లోకి తీసుకెళ్లి గుండెలు గుభేల్ మనిపిస్తుంది ఈ సినిమా. ఇది 400 రోజులు కంటిన్యుగా షూటింగ్ జరుపుకుని, గిన్నిస్ బుక్ లో కూడా చోటు సంపాదించింది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ….

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

స్టాన్లీ కుబ్రిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఐస్ వైడ్ షట్’ (Eyes Wide Shut). ఈ దర్శకుడి చివరి సినిమా కూడా ఇదే. ఈ సినిమా రిలీజ్ కి ముందే ఇతను మరణించడం జరిగింది. ఇందులో రియల్ లైఫ్ భార్యాభర్తలు టామ్ క్రూజ్, నికోల్ కిడ్‌మన్ ఇద్దరూ యాక్ట్ చేశారు. 159 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 7.5/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

డాక్టర్ బిల్ న్యూయార్క్‌లో ఒక పెద్ద డాక్టర్. హ్యాండ్‌సమ్ గా కూడా ఉంటాడు. అతనికి వక అందమైన ఆలిస్ అనే భార్య కూడా ఉంటుంది. ఇద్దరికీ ఒక చిన్న పాప, బయట నుంచి చూస్తే పర్ఫెక్ట్ ఫ్యామిలీలా కనిపిస్తుంది. కానీ లోపల ఏదో వెలితి ఉంటుంది. ఒక రోజు క్రిస్మస్ సీజన్‌లో బిల్ ని తన పేషెంట్ పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. అక్కడికి బిల్ తన భార్య ఆలిస్ ని కూడా తీసుకెళ్తాడు. ఆక్కడ ఆమె ఒక హంగేరియన్ అందగాడితో డ్యాన్స్ చేస్తూ ఫ్లర్ట్ చేస్తుంది. బిల్ కూడా మోడల్స్‌తో ఫ్లర్ట్ అవుతాడు. ఇంటికి వచ్చాక ఇద్దరూ ఫుల్ డ్రింక్ లో ఉంటారు. అప్పుడు ఆలిస్ మత్తులో ఒక బాంబ్ పేలుస్తుంది. గత సంవత్సరం వెకేషన్‌లో ఒక నేవీ ఆఫీసర్‌ని చూశానని, వాడి కళ్లు నా మీద పడగానే నాకు ఒక్కసారిగా ఫుల్ ఫైర్ అయిందని చెప్తుంది. ఒక్క రాత్రి వాడితో పడుకోవడానికైనా నిన్ను, పాపని, మన లైఫ్‌ని అంతా వదిలేసేదాన్నని చెప్తుంది. అంతే కాకుండా నేను నీతో పెళ్లి చేసుకున్నా కూడా నా మనసు వేరే వాడితో ఉందని ఒక బాంబ్ పేలుస్తుంది.

Read Also : అమ్మాయిల వరుస హత్యలు… ఆఫీసర్లకు దొరకని క్లూ… ఓటీటీలోకి మలయాళ హారర్ థ్రిల్లర్‌

Advertisement

దీంతో బిల్ గుండె పగిలిపోతుంది. నా భార్య నన్ను ఇంత ఈజీగా మోసం చేయగలదా?” అని మైండ్ రొటేట్ అవుతుంది. అదే రాత్రి ఒక పేషెంట్ చనిపోయిందని ఫోన్ వస్తుంది. బిల్ బయటకు వెళ్లి న్యూయార్క్ గల్లీల్లో తిరగడం మొదలెడతాడు. ఒక ప్రాస్టిట్యూట్ అతన్ని ఇంటికి పిలుస్తుంది. అటునుంచి స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ రాత్రి అతను ఎన్నో విచిత్రాలు చూస్తాడు. చివరికి బిల్ ఇంటికి వచ్చి ఆలిస్ పక్కన పడుకుంటాడు. ఇప్పుడు ఆలిస్ నిద్రలో ఏడుస్తూ నన్ను క్షమించు… నేను నిన్ను మోసం చేశాను అని అంటుంది. దీంతో మరో సారి బిల్ హృదయం బరువెక్కుతుంది. చివరికి ఈ పరిస్థితిని బిల్ ఎలా ఎదుర్కొంటాడు ? వీళ్ళు మళ్ళీ ఇంతకు ముందులా ప్రేమగా ఉంటారా ? ఈ కథ ఎండింగ్ ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×