E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: నగల దొంగ కోసం ప్లాన్.. నిజం తెలుసుకున్న బాలు.. ఫకీర్ గా బాలు..

Gundeninda GudiGantalu Today episode: నగల దొంగ కోసం ప్లాన్.. నిజం తెలుసుకున్న బాలు.. ఫకీర్ గా బాలు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. కార్తీక పౌర్ణమి సందర్బంగా అందరూ కలిసి కార్తీకదీపం నదిలో వదులుతారు. తర్వాత ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తారు.. వాళ్ళ ఎవరో ఒకరు ముత్తయిదుకి వాయినం ఇయ్యాలని అనుకున్నాం కానీ అది మా ఇంటి బిడ్డకే చెందుతుందని అనుకోలేదు అని ప్రభావతి అంటుంది. మీనా వెళ్లి మౌనికకు వాయినం తీసుకుని వస్తుంది.. ప్రభావతి కోడళ్ళు అందరూ కలిసి మౌనికకు వాయనం ఇవ్వబోతుంటే సంజయ్ వచ్చి ఆ ప్లేట్ ని ఈ విసిరి కొట్టేస్తాడు. ఏంటే ఏం చేస్తున్నావ్ ఇక్కడ గుడికి అని చెప్పి మీ వాళ్ళని కలవడానికి వచ్చావా అని సంజు అంటాడు. లేదండి ఇక్కడే వీళ్ళు కలిశారు అని మౌనిక అంటుంది. మౌనిక పుట్టింటి వాళ్లను కలిసిందని సంజయ్ గుడిలో పెద్ద రచ్చ చేస్తాడు. దాంతో బాలు సీరియస్ అయ్యి కొడతాడు. మౌనిక బాలును కొడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్యం మౌనిక ఎలా ఉందొ అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ప్రభావతి ఒకసారి మౌనికకి ఫోన్ చేయమని చెప్తుంది. సంజయ్ మౌనికకు ఫోన్ రావడం చూసి నువ్వు ఎప్పుడూ ఫోన్ కూడా మాట్లాడకూడదు అని కండిషన్ పెడతాడు. అప్పుడే వాళ్ళ నాన్న ఫోన్ చేయడంతో ఆ ఫోన్ కట్ చేయకండి నేను మాట్లాడుతాను అని కూల్ గా మాట్లాడుతుంది… బాలు కోసం మీనా కిందకు దిగి వస్తుంది. పైనా పక్కేసి పెట్టాను కానీ మీరు ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతుంది.. నేను నిజంగానే తప్పు చేసానా మీనా అని అడుగుతాడు..మౌనికను అలా మాట్లాడే లోపల నాకు చాలా కోపం వచ్చింది..

Advertisement

నేను సహించలేకపోయాను అందుకే కొట్టాను అని బాలు అంటాడు.. కోపం వెనుక అర్థం ఉందని నాకు తెలుసండి. వాడు నా మీద కోపంతో మౌనికని ఏం చేస్తాడు అని భయంగా ఉంది అని బాలు అంటాడు. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. మావయ్య గారు ఇందాకే మౌనికకు ఫోన్ చేసి ఎలా ఉందో కనుక్కున్నారు. వాడికి మీ మీద మాత్రమే కోపమంట మౌనిక మీద కోపం లేదని చెప్పిందని మీనా అంటుంది. అది సరేగాని మీరు మీ అన్నయ్య నగలు తీశారని తెలుసుకోవడానికి మీకు తెలిసిన వ్యక్తితో ఎవరితోనో నాటకం ఆడించారు. కానీ అది మధ్యలోనే ఫెయిల్ అయిపోయింది.

నగల్ని తీసుకునేది ఎవరు అని కనిపెట్టడం ఎలాగండి అని మీనా అంటుంది.. పూజలు వ్రతాలు చేయిస్తే ఏమైనా తిరిగి వస్తాయేమో అని అంటుంది.. అసలు దొంగ ఎవరో తెలియాలంటే మనము నువ్వు చెప్పిన దారిలోనే వెళ్లాలి అని బాలు అంటాడు. మీ అన్నయ్యకి పార్కులోని ఫ్రెండ్ డబ్బులు ఇచ్చాడు అన్నారు కదా.. మరి ఇంకెందుకు అయితే నగలను మీ అన్నయ్య తీయలేదని అనిపిస్తుంది అని మీనా అంటుంది. లక్షలు మింగినోడు అందరినీ మోసం చేసినోడు..పార్కులో పడుకున్నాడు.. నీకు మంచోడి లాగా ఎలా కనిపిస్తాడు అనేసి బాలు అంటాడు. కచ్చితంగా వాడే ఈ నగలను తీశాడు నాకు నమ్మకం కలుగుతుంది.

Advertisement

మా అమ్మ అప్పు చేసావే అని హింట్ ఇవ్వడంతో వాడు ఆ పేరు చెప్పాడు మా అమ్మను మనోజు ఇద్దరు కలిసి ఆ నగలను తీసారని నాకు అనిపిస్తుంది. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని బాలు అంటాడు.. ఇక బాలు మనోజ్ పార్కులో ఫ్రెండ్ ని కలవడానికి బయటకు వెళ్తాడు. నువ్వు మా అన్నయ్యకి నాలుగు లక్షలు ఇచ్చావు కదా నేను కొత్త కారు కొనుక్కొని దాన్ని లీజుకి ఇవ్వాలని అనుకుంటున్నాను నాకు కూడా కాస్త డబ్బులు ఇయ్యవా అనేసి అడుగుతాడు. మీ అన్నయ్యకి 10,000 ఇచ్చినందుకే నేను ముప్పు తిప్పలు పడి రాబట్టుకున్నాను. అది కూడా మీ వదిన ఇచ్చింది.

Also Read : రేపు థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. డోంట్ మిస్..

మీ అన్నయ్యకి డబ్బులు ఇస్తే అవి మళ్ళీ తిరిగి వస్తాయో లేదో నమ్మకం లేదు అలాంటిది మీ అన్నయ్యకి నేను నాలుగు లక్షలు ఇచ్చాను ఊరుకో బాలు మన దగ్గర అంత డబ్బులు ఎక్కడ ఉన్నవి అని అంటాడు. మా అన్నయ్యకు నువ్వే డబ్బులు ఇచ్చావని అందరితో చెప్పుకుంటున్నాడు. సరే నీకు 10,000, 20,000 కావాలంటే చెప్పు నేను ఇస్తాను అని మణికంఠ అంటాడు. బాలు మీనా కి విషయాన్నీ చెప్తాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు అని నేను అడుగుతుంది. కానీ బాలు మాత్రం నేను ఒక ప్లాన్ చేస్తున్నాను దాని ప్రకారం చేస్తే ఖచ్చితంగా అసలు దొంగ ఎవరో బయటకి వస్తారని అంటాడు. ఏంటండీ ఆ ప్లాను అని నేను అడుగుతుంది. ఇక పకీరు దగ్గరికి వెళ్లి పూజించిన నిమ్మకాయ అన్నట్లుగా అంతా మేనేజ్ చేసుకుని బాలు లోపలికి తీసుకొని వస్తాడు. ఈ సీరియల్ ఎపిసోడ్ కి ఇదే హైలెట్.. ఆ నిమ్మకాయని ఎవరు నగలను దొంగతనం చేసారో వాళ్ళ కాళ్లు చేతులు పడిపోయేలా చేస్తుంది అని ఇంట్లోని వాళ్ళందరిని నమ్మిస్తాడు. మనోజ్ ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×