E-Paper
Advertisement

Instamart Refund Fraud: ఇన్‌స్టామార్ట్‌ని మోసం చేసిన కస్టమర్.. ఏఐ ఫోటో చూపించి దోపిడీ

Instamart Refund Fraud: ఇన్‌స్టామార్ట్‌ని మోసం చేసిన కస్టమర్.. ఏఐ ఫోటో చూపించి దోపిడీ
Advertisement

Instamart Refund Fraud| ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. కొందరు కస్టమర్లు AI సాయంతో నకిలీ ఫోటోలు తయారు చేసి రిఫండ్ కొట్టేస్తున్నారు. ఇలా చేస్తే కంపెనీకి నష్టం జరగడేకాకుండా, నిజంగానే రీఫండ్ కోరుకునే కొనుగోలుదారులకు అన్యాయం జరుగుతోంది.

కోడిగుడ్ల ఫొటో చూపించి రీఫండ్

ఒక వ్యక్తి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి గుడ్ల ట్రే ఆర్డర్ చేశాడు. డెలివరీలో కేవలం ఒక్క గుడ్డు మాత్రమే పగిలింది. కానీ ఆ కస్టమర్ ఎక్కువ రీఫండ్ కావాలనే దురాశతో ఏఐ టెక్నాలజీని ఉపయోగించాడు ముందుగా కోడి గుడ్ల ట్రేని ఫొటో తీశాడు. ఆ తరువాత గూగుల్ యొక్క Gemini Nano AI సాయంతో ఆ కోడి గుడ్ల ఫోటోను ఎడిట్ చేశాడు. ఒక్క గుడ్డు పగిలిన రియల్ ఫోటో చూపించి మిగతా అన్ని గుడ్లనూ పగలగొట్టినట్టు కొత్త ఏఐ ఫొటో సృష్టించాడు. దీంతో మొత్తం గుడ్ల ట్రే డ్యామేజ్ అయినట్లు నమ్మేవిధంగా ఫోటో తయారైంది.

రిఫండ్ ఎలా వచ్చింది?

Advertisement

కస్టమర్ ఆ నకిలీ ఫోటోను ఇన్‌స్టామార్ట్‌ కస్టమర్ కేర్‌కి పంపాడు. ఇన్‌స్టామార్ట్ వాళ్లు ఫోటో చూసి నమ్మేశారు. ప్రస్తుతం వాళ్ల దగ్గర AI ఎడిట్ చేసిన ఫోటోని గుర్తించే టెక్నాలజీ లేదు. కాబట్టి సపోర్ట్ ఏజెంట్ తొందరగా సమస్య పరిష్కరించాలని పూర్తి ఆర్డర్ మొత్తాన్ని రిఫండ్ చేసేశాడు. అలా కంపెనీ మొత్తం డబ్బు నష్టపోయింది.

పెద్ద సమస్యగా మారిన ఏఐ మోసాలు?

AIతో ఫోటోలు ఎంత రియల్‌గా ఎడిట్ చేయొచ్చో ఇప్పుడు అందరికీ తెలుసు. కానీ కంపెనీల దగ్గర ఆ ఫోటోలు నిజమో కాదో చెక్ చేసే సాఫ్ట్‌వేర్ లేదు. ఒక్కొక్క రిఫండ్ చిన్న మొత్తమే అయినా… అధిక సంఖ్యలో కస్టమర్లు ఇలా చేస్తే కంపెనీకి కోట్ల రూపాయల నష్టం వస్తుంది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, బ్లింక్ ఇట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. అన్ని ఈ కామర్స్, క్విక్ కామర్స్ కంపెనీలు ఈ సమస్య ఎదుర్కొంటున్నాయి.

AI టెక్నాలజీ దుర్వినియోగం

Advertisement

AI అనేది ఒక అద్భుతమైన టెక్నాలజీ. చాలా పనులు దీని వల్ల సులభతరం అవుతాయి. కానీ దీన్ని మోసాలకు ఉపయోగిస్తే.. క్విక్ కామర్స్ కంపెనీలు, ఆన్‌లైన్ షాపింగ్ సైట్లకు నష్టాలు తప్పవు. అందుకే కంపెనీలు కొత్త టెక్నాలజీని అప్డేట్ చేసుకోవాలి. AI ఫోటోలని గుర్తించే సిస్టమ్, వీడియో ధృవీకరణ లేదా డెలివరీ ఏజెంట్ చెక్ వంటివి చర్యలు ఇప్పుడు అత్యఅవసరంగా మారాయి.

సోషల్ మీడియాలో చర్చ

ఈ కోడిగుడ్ల ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది “ఇది చాలా తప్పు, నీచమైన పని” అని కామెంట్ చేశారు. నిజాయితీగా వ్యాపారం చేసే కంపెనీకి నష్టం కలిగించడం అనైతికమని అందరూ అంటున్నారు. ఈ ఒక్క కేసు చూసి భవిష్యత్తులో ఇంకా ఎంతమంది ఇలా చేస్తారోనని చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: గూగుల్ కొత్త టివి రిమోట్.. బ్యాటరీలు అవసరం లేదు, జీవితకాలం చార్జింగ్‌లోనే ఉంటుంది

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×