// // Gundeninda GudiGantalu Today episode: పూజ కోసం గుడికి వెళ్లిన సత్యం -->
E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: పూజ కోసం గుడికి వెళ్లిన సత్యం ఫ్యామిలీ..మనోజ్ కు షాక్.. మౌనికకు కొట్టిన సంజయ్..

Gundeninda GudiGantalu Today episode: పూజ కోసం గుడికి వెళ్లిన సత్యం ఫ్యామిలీ..మనోజ్ కు షాక్.. మౌనికకు కొట్టిన సంజయ్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి బాలు మాట విని షాక్ అవుతుంది. వీడి లాంటి చేతకాని వాడే కాబట్టి మోసపోయాడు అని బాలు అంటాడు. ఆ బాలు గాడు మనల్ని ఎక్కడ చంపేస్తాడు అని చాలా కంగారుపడ్డాను. కానీ ఏదో ఒకటి చేసి తప్పించుకున్నామని ప్రభావతి అంటుంది.. నీకు ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు నువ్వు వెళ్లి ఆ నగల ప్లేస్ లో కొత్త నగలను తీసుకొచ్చి పెట్టాలి లేదంటే మాత్రం కచ్చితంగా మీతో పాటు నన్ను కూడా ఇంట్లోంచి బయట గెంటేస్తారు అని ప్రభావతి మనోజ్ కి వార్నింగ్ ఇస్తుంది. రోహిణి మనోజ్ ని రూమ్ లోకి తీసుకెళ్లి కలిపేసి నిజం ఏంటో కనుక్కోవాలని అడుగుతుంది. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని రోహిణి అడుగుతుంది. మనోజ్ నగల విషయం ఎక్కడ బయటపడుతుందో అని టెన్షన్ పడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే..కార్తీక పౌర్ణమి సందర్బంగా పూజలు చెయ్యాలని ప్రభావతి అనుకుంటుంది. ఇక పూజల కోసం అందరూ గుడికి వెళ్లాలని రెడీ అవుతుంటారు… ప్రభావతిని చూసి సత్యం మురిసిపోతూ ఉంటాడు. సత్యం చాలా అందంగా రెడీ అయ్యాడు అని ప్రభావతి మురిసిపోతూ ఉంటుంది. మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోడల్ని చూసి సత్యం ప్రశంసలు కురిపిస్తాడు. ఇక అందరూ రాగానే తమ భర్తలు చాలా అందంగా ఉన్నారంటూ ముగ్గురు కోడలు కూడా మెచ్చుకుంటూ ఉంటారు. అందరూ కలిసి గుడికి వెళ్తారు.. అయితే అక్కడ ఒక వ్యక్తి ఒక వంద రూపాయలు ఇస్తారని అడుక్కుంటూ కనిపిస్తాడు. ఆ వ్యక్తి బాలు దగ్గరికి వచ్చి100 ఇవ్వన్నా నువ్వు మందు తాతవి అని అడుగుతాడు. బాలు నీకు వంద కాదు 1000 ఇస్తాను ఒక పని చేయాలి అనేసి అంటాడు.

Advertisement

మనోజ్ ఆకలిగా ఉంది అని వాళ్ళ అమ్మను అడిగి తినాలని అనుకుంటాడు. గుడిలో పూజలు చేసిన తర్వాతే తినాలని ప్రభావతి అంటుంది కానీ మనోజ్ మాత్రం నాకు ఆకలేస్తుంది ఏదో ఒకటి తినాలి అని అనుకుంటాడు. అక్కడికి ఒక వ్యక్తి పోతురాజు లాగా కనిపిస్తాడు. బాలు ఇదే కరెక్ట్ ప్లాను మనోజ్ చేత నిజం కక్కించాలి అని అనుకుంటాడు. ఆ వ్యక్తితో మాట్లాడి నేను ఒక పేరు చెప్తాను వాడి చేతే అసలు నిజాన్ని బయటపెట్టించాలి అని అంటాడు. అతని ఎవరో చెప్పండి మిగతా విషయాలని నేను చూసుకుంటాను అని బాలుకి ఆ వ్యక్తి సపోర్ట్ గా నిలుస్తాడు. మనోజు గుడిలోకి రాగానే ఈ వ్యక్తి దేవుడి ముందు నిజాలు చెప్పాలి. అబద్దం చెప్పావో ఛస్తావ్ అని అంటాడు. మనోజ్ భయపడి పోయి నిజం చెప్తాను అని అరుస్తాడు..

కానీ అప్పుడే ఆ వ్యక్తి భార్య వచ్చి నువ్వు ఇక్కడ మందు కోసం నాటకాలు ఆడుతున్నావా అయితే రా నీకు నేను సినిమాను చూపిస్తాను అని అంటుంది.. బాలు మీనా మన ప్లాన్ వర్క్ అవుట్ అవ్వలేదు నిజం చెప్పే టైం లో ఆవిడ వచ్చింది అనేసి అంటాడు. మౌనిక నేను గుడికి వెళ్తాను మీరు వస్తారా అని అడుగుతుంది. సంజయ్ నాకు అంత ఓపిక లేదు టైం లేదు. నువ్వు వెళ్లాలనుకుంటే వెళ్లిపో అనేసి అంటాడు.. సువర్ణ తన కొడుకుకి క్లాస్ పీకుతున్న టైం లో నీలకంఠం వస్తాడు.. కొడుకుని ఎలా పెంచాలో నేను చిన్నప్పుడు నుంచి నేర్పిస్తూనే ఉన్నాను నువ్వేమీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు.

Advertisement

నిజంగా మీ ఆవిడ గుడికి వెళ్లిందా మరి ఇదేంటి అనేసి ఒక ఫోటోని చూపిస్తాడు.. ఆ ఫోటోలో మౌనిక వల్ల నానమ్మ పుట్టినరోజు లో దిగిన దిగా కనిపిస్తుంది. మీ ఆవిడ గుడికి అని చెప్పేసి ఇవాళ పుట్టింటికి వెళ్తుంది ఇదిగో ఇది చూడు అనేసి సంజయ్ కి నీలకంఠం చూపిస్తాడు. ముందు నీ ఆవిడ ఎక్కడికి వెళ్లిందో కనుక్కో అనేసి సంజయ్ అనగానే సంజయ్ చాలా సీరియస్గా వాళ్ళ అమ్మని అడుగుతాడు. ఆరోజు మేము గుడికి వెళ్ళాం రా కానీ వాళ్ళ చిన్నన్నయ్య వచ్చి బామ్మ పుట్టినరోజు అని అడిగితే కాదని లేకపోయాను అని అంటుంది. ఇంకా విషయం తెలుసుకున్న పని సంజయ్ కోపంతో రగిలిపోతూ గుడికి వెళ్లాలని అనుకుంటాడు..

అందరూ దీపాలు పెట్టాలని అనుకుంటారు అప్పుడే ఎదురుగా మౌనిక రావడం చూసి చాలా సంతోషపడతారు. మౌనికని చూసి నువ్విలా సడన్గా వస్తావని అస్సలు అనుకోలేదు అని అంటారు. మౌనిక కూడా ఒంటరిగా వచ్చినందుకు బాధపడ్డాను కానీ మీరందరు కనిపించడంతో నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది.. ముందుగా వెళ్లి నదిలో దీపాలు వదులుదామని అంటారు.. అందరూ కలిసి కార్తీకదీపం నదిలో వదులుతారు. తర్వాత ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తారు.. వాళ్ళ ఎవరో ఒకరు ముత్తయిదుకి వాయినం ఇయ్యాలని అనుకున్నాం కానీ అది మా ఇంటి బిడ్డకే చెందుతుందని అనుకోలేదు అని ప్రభావతి అంటుంది.

Also Read :బిగ్ బాస్ లోకి గుండెనిండా గుడిగంటలు బాలు.. ఇదేం ట్విస్ట్ బాసూ..

మీనా వెళ్లి మౌనికకు వాయినం తీసుకుని వస్తుంది.. ప్రభావతి కోడళ్ళు అందరూ కలిసి మౌనికకు వాయనం ఇవ్వబోతుంటే సంజయ్ వచ్చి ఆ ప్లేట్ ని ఈ విసిరి కొట్టేస్తాడు. అది చూసినా మౌనికతో పాటు అందరూ షాక్ అవుతారు. ఏంటే ఏం చేస్తున్నావ్ ఇక్కడ గుడికి అని చెప్పి మీ వాళ్ళని కలవడానికి వచ్చావా అని సంజు అంటాడు. లేదండి ఇక్కడే వీళ్ళు కలిశారు అని మౌనిక అంటుంది. నీకు మీ ఇంట్లో వాళ్ళని కలవద్దని చెప్పాను కదా అయినా కూడా నువ్వు కలుస్తున్నావు అంటే నీకు కొంచెం కూడా భయం లేదు అనేసి సంజు అంటాడు. మౌనిక ఏంటో చెబుతున్నా కూడా వినకుండా తనని ఇంకా బాధ పెట్టేలా మాట్లాడుతాడు. ఇక సంజయ్ మీ అమ్మాయి రోజు గుడికి నొస్తుంది. మిమ్మల్ని కలవడానికి వస్తుందా ఇంకెవడినైనా కలవడానికి వస్తుందా అనేసి అంటాడు. ఆ మాట వినగానే బాలు కోపంతో సంజయ్ ని కొడతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×