E-Paper
Advertisement

OTT Movie : దేవుడి విగ్రహాలపై రాక్షసుడి కన్ను… శాపంతో శవాలుగా మారే ఊరి జనం… గుండె ఝల్లుమనిపించే సినిమా

OTT Movie : దేవుడి విగ్రహాలపై రాక్షసుడి కన్ను… శాపంతో శవాలుగా మారే ఊరి జనం… గుండె ఝల్లుమనిపించే సినిమా
Advertisement

OTT Movie : ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలను చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ప్రేక్షకులు. ఈ సినిమాలలో రకరకాల థీమ్స్ ను యాడ్ చేసి సరికొత్త స్టోరీలను అందించడానికి మేకర్స్ కూడా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చినా సినిమానే ‘అశ్విన్స్’. ఈ సినిమా సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ తో క్లైమాక్స్ వరకు ఉత్కంఠంగా సాగుతుంది. ఇందులో దేవుడు, దెయ్యం కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. హారర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘అశ్విన్స్’ 2023లో విడుదలైన థ్రిల్లర్ సినిమా. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు తరుణ్ తేజ దర్శకత్వం వహించాడు. వ‌సంత్ ర‌వి, విమలా రామన్, మురళీధరన్ సుబ్రమణియన్, సార‌స్ మీన‌న్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 జూన్ 23న విడుదలైంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : హ్యాండ్సమ్ భర్త… క్యూట్ పెళ్ళాం… మధ్యలో అందంతో మత్తెక్కించే ప్రియురాలు… అబ్బబ్బా అన్నీ అలాంటి సీన్లే

స్టోరీలోకి వెళ్తే

అర్జున్ అనే ఫేమస్ యూట్యూబర్ కి అశ్విన్ అనే ఒక ట్విన్ బ్రదర్ ఉన్నాడు. కానీ అశ్విన్ చిన్నప్పుడే చనిపోయాడు. అర్జున్ ఒక రోజు ఒక భయంకరమైన డ్రీమ్ కంటాడు. అందులో ఒక పాత మాన్షన్ లో రక్తం కారుతూ, ఒక వింత ఆకారం అతన్ని వెంటాడుతుంది. ఆ డ్రీమ్‌లోనే అతను చచ్చిపోతాడు. ఉదయం లేచి చూస్తే అతని గొంతు మీద గాయం ఉంటుంది. అతనికి డ్రీమ్‌లో ఏమి జరిగినా రియల్ బాడీకి డ్యామేజ్ అవుతుందని తెలుస్తుంది. అర్జున్ షాక్ అయి రిసెర్చ్ చేస్తే ఆ మాన్షన్ రియల్‌గానే ఉంటుంది. అక్కడ కొన్ని ఏళ్ల క్రితం అతని ట్విన్ బ్రదర్ చనిపోయి ఉంటాడు. అర్జున్ అసలు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి, తన లవర్ రేణు, ఫ్రెండ్స్‌తో కలిసి ఆ మాన్షన్‌కి వెళ్తాడు. అక్కడికి వెళ్లగానే ఫుల్ హారర్ మోడ్ ఆన్ అవుతుంది. ఆ రోజు రాత్రి డ్రీమ్‌లో అశ్విన్ వచ్చి నువ్వు నా బ్రదర్‌వి, మనం ఒక్కటే అని అర్జున్‌ని భయపెడతాడు.

Advertisement

ఇప్పుడు అర్జున్‌కి గతం గుర్తొస్తుంది. చిన్నప్పుడు అతను, అశ్విన్ ఇద్దరూ ఒక ప్రమాదంలో పడ్డారు. అప్పుడు అతని తండ్రి దేవున్ని ప్రసన్నం చేసుకుని ఒక కొడుకుని బతికించుకుంటాడు. అశ్విన్ చచ్చిపోతాడు. దీంతో పాటు అక్కడ రెండు అమూల్యమైన దేవతా విగ్రహాలు కూడా అక్కడ వుంటాయి. ఆ విగ్రహాలపై ఒక రాక్షసుడు కన్ను పడుతుంది. దీంతో ఆ ఊరిలో ఒక్కొక్కరూ చనిపోవడం జరిగింది. ఇది గతంలో జరిగిన కథ. ఇప్పుడు మళ్ళీ ఆ రాక్షసుడు జర్నీ మొదలవుతుంది. అశ్విన్ ఆత్మ కూడా ఎంట్రీ ఇస్తుంది. దీంతో స్టోరీ ఉత్కంఠంగా సాగుతుంది. చివరికి రాక్షసున్ని అర్జున్ ఎలా ఎదుర్కొంటాడు ? అశ్విన్ ఆత్మ ఎందుకు వచ్చింది ? ఆ విగ్రహాల స్టోరీ ఏమిటి ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×