E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: షాప్ కు మేనేజర్ గా సత్యం.. మనోజ్ కు రోహిణి షాక్.. ముంబై ముకేష్ ఎంట్రీ..

Gundeninda GudiGantalu Today episode: షాప్ కు మేనేజర్ గా సత్యం.. మనోజ్ కు రోహిణి షాక్.. ముంబై ముకేష్ ఎంట్రీ..
Advertisement

Gundeninda GudiGantalu Today episode May17th: రోహిణి, మనోజ్ లను క్షమించమని అడిగితే సరిపోదు. నాన్న కష్టార్జితం కాబట్టి ముగ్గురు కొడుకులు కి వాటా ఉంటుంది అని బాలు అంటాడు. అయితే మాకు ఆ డబ్బులు ఏమీ అవసరం లేదు అది నాన్న కష్టార్జితం మాత్రమే అని బాలు అనగానే మీనా సంతోషంగా చప్పట్లు కొడుతుంది. మాకు కూడా నాన్న కష్టార్జితం ఒక్క రూపాయి కూడా అవసరం లేదు అని రవి అంటాడు.. శృతి కూడా రవికి సపోర్ట్ చేస్తూ ఉండడంతో ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు.. కాబట్టి నాన్నని ఆ షాప్ కి ఓనర్ని చేయాలని బాలు అంటాడు… ఆ మాట వినగానే మనోజు ఫ్యూజుల్ఎగిరిపోతాయి.. అమ్మ ఏమి మాట్లాడలేదు ఏంటి అని రవి అంటాడు.. ఇందులో అమ్మకి మాట్లాడే ఛాన్స్ లేదు అని బాలు అంటాడు..

సత్యంకు సపోర్ట్ గా ప్రభావతి..

మా నాన్న జీవితాంతం కష్టపడిన ఆ డబ్బులు ఇలా వాడు రెండోసారి కూడా లక్షలు మింగేసి మోసం చేస్తాడని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు ఆ నిజం బయటపడింది కాబట్టి వీడి బండారం కూడా బయటపడింది. దాంతో వీడిని ఏం చేసినా పాపం లేదు కానీ మా అమ్మ మొహం చూసి వదిలేస్తున్నాము అని బాలు అంటాడు.. మనోజు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ప్రభావతి వీడు చెప్పింది కరెక్టే ఆయన గారే ఈ షాప్ కి ఓనరు అని అంటుంది. ఇక ప్రభావతి మాట విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి అమ్మ ఈమధ్య మన మాటకి సపోర్ట్ గా నిలుస్తుంది అని బాలు కూడా అవాక్కవుతాడు.

రోహిణికి షాకిచ్చిన మనోజ్..

Advertisement

రాత్రి గదిలోకి వెళ్లిన మనోజ్ రోహిణి దగ్గరికి వెళ్లి నువ్వు మళ్ళీ ఇంటికి వస్తావని నేను అస్సలు ఊహించలేదు రోహిణి. ఎక్కడికైనా వెళ్ళిపోయావేమో అని నేను చాలా బాధపడ్డాను అని అంటాడు. నీకు కొంచమైన బుద్ధుందా మనోజ్ నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు.  కానీ మీ అమ్మ నన్ను తిడుతున్న కొడుతున్న నువ్వు పట్టించుకోలేదు. నీకు ఎంత చెప్పినా కూడా ఇంతే.. కనీసం నీ నుంచి నేను సారీ ఎక్స్పెక్ట్ చేశాను అది కూడా లేదు నేను ఫోన్ చేసిన కూడా నువ్వు ఫోన్ తీయడం లేదు అని రోహిణి మనోజ్ ని దారుణంగా తిడుతుంది. ఆ కల్పన ఇచ్చిన డబ్బులు నేనేమైనా తీసుకుని వెళ్లి నగలుకున్నానా ? నీకు బాగుపడేందుకే కదా చెప్పాను. షోరూం పెట్టడానికి కారణం నేనే కదా అది నువ్వు ఎలా మర్చిపోయావు మనోజ్ అని రోహిణి మనోజ్ ని తిడుతుంది.

మీ మామయ్య రావాలి…

నేను అంత చవటన అయితే కాదు రోహిణి నువ్వు ఏదేదో అనుకుంటున్నావు అని మనోజ్ రోహిణి కి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు. ఆరోజు 40 లక్షలు కొట్టేసిన కల్పనా ని ఏమి చేయలేకపోయావు.. ఇవాళ బాలు నిన్ను ఓనర్ గా తీసేసి మీ నాన్నని ఓనర్ని చేశాడు అయినా కూడా నువ్వేమీ మాట్లాడలేదు అని రోహిణి రెచ్చిపోతుంది.. అప్పుడే ప్రభావతీ సడన్ గా ఎంట్రీ ఇస్తుంది. నా కొడుకుని ఒక్క మాట అంటే నేను అసలు ఊరుకోను అని ప్రభావతి అంటుంది. నేను మీ అబ్బాయిని ఏమీ అనలేదు అత్తయ్య బాలు చేసిన పని గురించి మాట్లాడుతున్నాను అని రోహిణి అంటుంది. నువ్వు ముందు మలేషియా నుంచి మీ నాన్నని విడుదల ఎలా చెయ్యి లేదంటే వాడి చేత మళ్ళీ కొత్త షాపు పెట్టించే బాధ్యత నీదే అని ఒత్తిడి చేస్తుంది.. ఆ మాట వినగానే రోహిణి ఈవిడ అటు తిరిగి ఇటు తిరిగిన మీదకే వస్తుంది అని కంగారు పడిపోతుంది.

ముఖేష్ తో మనోజ్ డీల్ క్యాన్సిల్..

Advertisement

సేల్స్ పెరిగే కొద్దీ మనోజ్ ఇంకా బాధ్యతగా ఉండాలి అని చెక్ చేయడానికి హైదరాబాద్కు ముంబై ముకేష్ వస్తాడు.. అతనికి ఇచ్చిన 10 లక్షల గురించి మనోజ్ ని అడుగుతాడు. డీలర్ల ఫిర్యాదులపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో మనోజ్ పనితీరుపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తబడతాయి.. మనోజ్ ఏదో చేస్తున్నాడు అతను ఇలాగే ఉంటే బిజినెస్ చాలా లాస్ అవుతుందని ముఖేష్ అతన్ని ఎంతగా అడిగినా సరే నేను చూసుకుంటాను క్షమించండి అని మనోజ్ అంటాడు.. మొత్తానికి ఈ ఎపిసోడ్ మాత్రం హైలెట్గా నిలిచే అవకాశం ఉంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : మెంటలెక్కించే న్యూస్.. వంటలక్క ప్లేసులోకి మోనిత.. ఇదేం ట్విస్ట్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×