E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కి దిమ్మతిరిగే షాక్.. కూపి లాగుతున్న బాలు, మీనా.. విద్య నిజం చెప్తుందా..? ఇదేం ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కి దిమ్మతిరిగే షాక్.. కూపి లాగుతున్న బాలు, మీనా.. విద్య నిజం చెప్తుందా..? ఇదేం ట్విస్ట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode may 29th : మీనా టీవీ యాక్టర్ కల్యాణి వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. బయట మొత్తం డెకరేషన్ చేసి కార్ ని అందంగా అలంకరిస్తూ ఉంటుంది.. అది చూసిన చింతామణి తన మనుషులని పంపించి ఆ డెకరేషన్ పీకేయాలని అనుకుంటుంది. అయితే రౌడీ ఎవర్రా మేము పంపించింది మీరు సంగతి నేను చూస్తాను అని అనడంతో ఆ రౌడీలు భయపడి పారిపోతారు. నేను అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగితే ఒకటి అని చింతామణి ఆలోచిస్తూ ఉంటుంది. కళ్యాణ్ అక్కడికి వచ్చి మీరు డెకరేషన్ మెచ్చుకోడంతో పాటుగా ఇంకొక 5000 ఎక్స్ట్రా ఇవ్వండి అని అంటాడు. కానీ చింతామణి డెకరేషన్ కి కాస్త తగ్గించి ఇవ్వమనడంతో ఒక సరిగా షాక్ అవుతుంది.. మీ నాకు వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటుంది కానీ చింతామణికి మీనా వార్నింగ్ ఇస్తుంది.

మనోజ్, రోహిణి చేతికి సీసిటీవీ ఫుటేజ్..

రోహిణి,మనోజ్ లు గుడికి వెళ్తారు.. అక్కడ వాళ్ళని చూసి పార్వతి గుడి కి వచ్చారా పూజ కోసం వచ్చారా పువ్వులు తీసుకు రమ్మంటారా అని అడుగుతుంది. అయితే పార్వతిని రోహిణి పూజ కోసం రాలేదు వేరే చిన్న పని కోసం వచ్చాము అని అంటుంది.. వెనకాల పోలీసులు రావడంతో పార్వతి ఏ దానికోసం వచ్చారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ గుడి సెక్యూరిటీని రమ్మని చెప్పాం కదా వచ్చేస్తుంటారు అని కానిస్టేబుల్స్ అంటారు.. అతను రాగానే సీసీటీవీ ఫుటేజ్ ఉన్న పెన్ డ్రైవ్ ని ఇస్తాడు.. అయితే రోహిణి మనోజ్ ఇద్దరు కూడా ఆ ఫుటేజ్ ని మాకు కూడా ఇవ్వండి సార్ మేము కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తాము అని అంటారు.. మీరు పట్టుకుంటే మేమేం చేయాలి.. ఈ దొంగల్ని మీరే పట్టుకోండి మేమెందుకు మధ్యలో అని పోలీసులు వెటకారంగా మాట్లాడడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ విషయాన్ని మీనా తో చెబుతుంది సుమతి..

రోహిణి దొరికిపోతుందా..?

Advertisement

మీనా పూలు కడుతూ ఉండగా బాలు అక్కడికి వస్తాడు. మల్లెపూల అయితే పెట్టుకుంటే పోలే అని అడుగుతాడు.. మల్లెపూలు పెట్టుకుంటే డబ్బులు ఎవరిస్తారు అని మీనా అడగ్గానే దానికి డబ్బులు నేనిస్తాను అని బాలు అంటాడు. ఇదంతా కాదు నీకు ఒక విషయం చెప్పాలి అని బాలు అంటాడు.. మొన్న వచ్చిన మలేషియా వాళ్ళకి జైల్లోని సూపర్డెంట్ తెలుసంట.. పార్లరమ్మ వాళ్ల నాన్న గురించి చెబితే కచ్చితంగా హెల్ప్ చేస్తారు అని అనుకుంటూ ఉండగా.. మనోజ్, రోహిణి అక్కడకు వస్తారు.. మా నాన్న గురించి వాళ్ళందరికీ చెప్పడం ఎందుకు అవసరమా మీకు లేనిపోని పనుల గురించి మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని రోహిణి అనుకుంటుంది. కానీ రోహిణికి మాత్రం దిమ్మతిరిగి పోయేలా బాలు కౌంటర్ మీద కౌంటర్లు వేస్తాడు.

డిటెక్టివ్ గా మారిన బాలు మీనా..

మీరు రెండోసారి కూడా లక్షలు మింగేసి మూడోసారి 30 లక్షలు పోగొట్టుకున్నారు. మళ్లీ ఇలా మోసపోకూడదు అని మావయ్య గారు చెప్పడంతో మేము ఆ దొంగల్ని పట్టుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ మీరు మాత్రం మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. రెండుసార్లు మీరు మింగేసారు మూడోసారి ఈ ఇద్దరు అన్నదమ్ములకు వాటా వస్తుందని మావయ్య గారి అభిప్రాయం అని మీనా అనగానే రోహిణి షాక్ అవుతుంది.. ఆ డబ్బులు గురించి మేము చూసుకుంటాము మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు మా విషయాల్లో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదు అని రోహిణి వెళ్ళిపోతుంది. ఇక బాలు మీనా ఇద్దరు కూడా రోహిణి ఏదో దాస్తుంది కచ్చితంగా మనం కనిపెడదామని డిటెక్టివ్ గా మారతారు.

కామాక్షి ని కలిసిన మీనా, బాలు..

Advertisement

బాలు మేన ఈ రోహిణి కలపడానికి కారణం మా కామాక్షిత్తా. ఆమె దగ్గరికి వెళితే మలేషియా గురించి అన్ని నిజాలు బయట పెడుతుంది అని అనుకుంటారు.. కామాక్షి వాళ్ళ ఇంటికి మీనా బాలు వెళ్తారు. నీకు హల్వా అంటే చాలా ఇష్టం కదా అత్త అందుకే హల్వా తీసుకొని వచ్చాము మొత్తం నీకే తినేసేయ్ అని బాలు అంటాడు. వయసులో ఉన్నప్పుడు రెండు డబ్బాలు తినేదాన్ని కానీ ఇప్పుడు అంతా తినేదాన్ని కాదులే అని అంటుంది. నాకు తెలిసిన ఒక అబ్బాయికి విదేశాల్లో ఉన్న అమ్మాయి కావాలని అనుకుంటున్నాడు. అయితే నువ్వు కూడా మా రోహిణిని అక్కడి నుంచే తీసుకొని వచ్చావు కదా అని బాలు అడుగుతాడు. నీకు మలేషియా అని ఎలా తెలుసు అత్తా అని బాలు కూపి లాగే ప్రయత్నం చేస్తాడు. కానీ కామాక్షి మాత్రం ఒకసారి మసాజ్ చేస్తూ ఉండగా ఆ అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను. ఆ తర్వాత మీ అమ్మకు కలిపాను. అమ్మ ఇక మలేషియా కోడలని నెత్తిన పెట్టుకుంటుంది అని చెప్పగానే అత్తకు కూడా ఏమీ తెలియదేమో అని అనుకుంటారు..

విద్య ఇంటికి వెళ్లిన మీనా..

విద్య మనోహర్ తో ప్రేమలో పడిపోతుంది.. అతనితో మూడోసారి కలిసినప్పుడు కాఫీ తాగుతుంది. నిజంగానే అతను చాలా స్మార్ట్ గా ఉన్నాడు ఎలాగైనా సరే ప్రేమలో పడిపోవాలి అని అనుకుంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్లిందో లేదో వెనకాలే డోర్ కొట్టడంతో ఎవరని తలుపు తెరిచి చూస్తుంది. అయితే మీనా రావడంతో ఏంటి మీ నాన్న నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను కానీ నువ్వే వచ్చావ్ ఏంటి అని అడుగుతుంది.. నాకు ఫోన్ చేసి రమ్మని పిలుద్దాం అనుకున్నావా ఎందుకు విద్య అని నేను అడుగుతుంది.. ఏమీ లేదు మీరిద్దరూ నిజమైన ప్రేమని అనుమతి చెందుతున్నారు కదా ప్రేమలో పడితే ఎలాంటి మెలకువలు పాటించాలి అని తెలుసుకుందామని పిలిచాను అని విద్య అంటుంది. కానీ మీనా మాత్రం మాటల్లో పెట్టి విద్యను రోహిణి గురించి అడుగుతుంది. విద్య ఎక్కడ తడబడకుండా రోహిణి మలేషియా బండారం బయటపడకుండా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేస్తుంది..

రోహిణికి మరో టెన్షన్..

విద్యా వెంటనే మీనా వెళ్లిపోగానే రోహిణి కి ఫోన్ చేస్తుంది.. మీనా మా ఇంటికి వచ్చింది నీ గురించి అడిగింది అని చెప్పగానే రోహిణి మొహంలో ఫ్యుజులు ఎగిరిపోతాయి.. దేనికోసం వచ్చింది అని రోహిణి అడుగుతుంది.. నువ్వు మలేషియాలో చదివావా అని నీ గురించి చాలా అడిగింది. కానీ నేను ఏమి చెప్పకుండా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేసి ఏదో ఒకటి మ్యారేజ్ చేసి మీనాను నమ్మించాను. నామీద మీ నాకు అనుమానం వచ్చింది అంటే కచ్చితంగా నేను మలేషియా కాదని కనుక్కొని ఎలా ఉంది అని రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మనోజ్ కి విషయం చెప్తే మీ మావయ్యతో ఒకసారి నాకు మాట్లాడించు బిజినెస్ గురించి నేను అడిగి డబ్బులు తీసుకుంటాను అని ఎంత చెప్తున్నా సరే రోహిణి మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది.

చింతామణికి దిమ్మతిరిగే కౌంటర్..

మీనా పూలు ఇచ్చి బయటకి వస్తూ ఉండగా ఆమె బాక్స్ ని ఒక వ్యక్తి తీసుకుని పారిపోతూ ఉంటాడు. అది చూసిన మీనా అతని వెనకాలే పరిగెడుతూ వస్తుంది.. ఒక ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ ఒక ఆవిడ భోజనం చేయండి అని ఎంతగా అడుగుతున్నా సరే నా బాక్స్ నాకు ఇవ్వండి అని నేను అంటుంది.. అయితే చివరికి అది చింతామణి ఇల్లు అని తెలిసిపోతుంది. అయితే చింతామణి మనిద్దరం కలిసి బిజినెస్ చేద్దామని బంపర్ ఆఫర్ ఇస్తుంది. నేను ఎప్పుడు కష్టపడి చేయాలనుకుంటానో ఇలా కక్కుర్తి పడి చేసి తినాలని అనుకోను అని అంటుంది మీనా.. పులికి తోక లాగా ఉండడం కంటే పిల్లికి తలలాగే ఉండడం నాకు ఇష్టం. నేను కలిసి బిజినెస్ చేయను అని నేను తెగేసి చెప్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: వేరే కాపురం పెట్టిన అన్నయ్యకు కష్టాలు.. నిజం తెలుసుకున్న నర్మదా..భాగ్యంకు షాక్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×