E-Paper
Advertisement

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు,  ఇక  హైదరాబాద్‌ మాటేంటి?
Advertisement

India Housing Market: దేశంలో రియల్ ఎస్టేట్ క్రమంగా పుంజుకుంటోంది. ఈ ఏడాది జనవరి-మార్చి తొలి ట్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో గృహాల ధరలు సగటున 3 నుంచి 24 శాతం వరకు పెరిగాయి. అందులో బెంగళూరులో అత్యధిక పెరుగుదల నమోదు అయ్యింది. మరి హైదరాబాద్ మాటేంటి?

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల

Advertisement

అంతర్జాతీయ పరిణామాలు వెంటాడుతున్నా దేశంలో ఇళ్ల ధరలు ఏ మాత్రం తగ్గలేదు. ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలకు అమాంతం పెరుగుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఏకంగా 3 శాతం నుంచి 24 శాతం వరకు పెరిగినట్లు ప్రాప్ టైగర్ నివేదిక వెల్లడించింది. చదరపు అడుగు ధర రూ.9785 మేరా పలుకుతున్నట్లు అందులో ప్రస్తావించింది.

ఇళ్ల అమ్మకాల విషయంలో బెంగళూరు నగరం బలమైన వృద్ధి సాధించింది. ఈ సిటీలో ఇళ్ల విక్రయాలు ఏకంగా 33 శాతం మేరా పెరిగినట్టు ప్రస్తావించింది. ఆర్థిక రాజధాని ముంబైలో అయితే చదరపు అడుగు ధర 20 శాతం పెరిగింది. అక్కడ అడుగు రూ.15 వేలకు చేరినట్టు పేర్కొంది. ఢిల్లీలో కూడా ఇళ్ల ధరలు 18 శాతం పెరిగాయి. అక్కడ చదరపు అడుగు ధర రూ.9534కు చేరినట్లు ఆ రిపోర్టు చెబుతోంది.

Advertisement

హైదరాబాద్ సిటీలో 11 శాతం వరకు ఇళ్ల ధరలు పెరుగుదల

పుణెలో ఇళ్ల ధరలు 12 శాతం పెరగ్గా ఆ తర్వాత స్థానంలో హైదరాబాద్ నిలిచింది. మహానగరం హైదరాబాద్‌‌లో 2026 జనవరి నుంచి మార్చి తొలి త్రైమాసికంలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఇక్కడ ఇళ్ల ధరలు దాదాపు 11 శాతం పెరిగినట్టు స్థిరాస్తి కన్సల్టెంట్ ప్రాప్ టైగర్ సంస్థ ప్రస్తావించింది. హైదరాబాద్ సిటీలో చదరచగ అడుగు ధర రూ.10 వేల వరకు పలుకుతోందని ప్రస్తావించింది.

హైదరాబాద్‌లో 25 శాతం మేరా ఇళ్ల విక్రయాలు పెరిగినట్లు వెల్లడించింది. 2026 ఏడాది జనవరి-మార్చి తొలి త్రైమాసికంలో ఇళ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ఓ వైపు ఇళ్లకు డిమాండ్ పెరగడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దాని ప్రభావం చాలా రంగాలను ప్రభావితం చేస్తోంది.

ALSO READ: బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

చమురుతోపాటు సిమెంట్, స్టీల్ వంటి వాటి ధరలు భారీగా పెరిగాయి. దాని ప్రభావం కాస్త స్థిరాస్తి రంగంపై పడిందని చెబుతున్నారు. మిగతా నగరాలైన అహ్మదాబాద్‌-8 శాతం, కోల్‌కతా- 7, చెన్నై-3 శాతం మేర ఇళ్ల ధరలు పెరిగినట్టు పేర్కొంది. ఇళ్ల నాణ్యతకు కొనుగోలుదారులు అధిక ప్రయార్టీ ఇస్తున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×