// // Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో షాకైన బాలు.. మరో మోసం.. బాలుకు మనోజ్ బంఫర్ ఆఫర్... -->
E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో షాకైన బాలు.. మరో మోసం.. బాలుకు మనోజ్ బంఫర్ ఆఫర్…

Gundeninda GudiGantalu Today episode:  మనోజ్ మాటతో షాకైన బాలు.. మరో మోసం.. బాలుకు మనోజ్ బంఫర్ ఆఫర్…
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. సుమతికి మంచి అబ్బాయి దొరికాడు. అయితే నువ్వు పెళ్లికి ముందు ఎలాంటి అబ్బాయి కావాలని కోరుకున్నావు అని మీనా ను బాలు అడుగుతాడు. నాకు ఇప్పుడు పెళ్లి అయిపోయింది. ఇప్పుడు నాకేం అవసరం ఉందండి అని నేను ఎంతగా అంటున్న సరే బాలు మాత్రం అస్సలు వినకుండా నువ్వు ఎలాంటి అబ్బాయి కావాలని కోరుకున్నావో ఒకసారి చెప్పు మీనా అని బలవంతంగా అడుగుతాడు. మంచిగా చదువుకున్న అబ్బాయి అయ్యుండాలి అని అనుకున్నాను. గవర్నమెంట్ ఉద్యోగం అయితే బాగుండేది అని అనుకున్నాను అని బాలు తో మీనా అంటుంది.

కానీ మీనా చెప్పిన లక్షణాలు ఏవి బాలుకి లేకపోవడంతో నాకు ఏ లక్షణాలు లేకపోయినా నువ్వు నాతో భార్యగా బాగానే ఉంటున్నావు అని బాలు మీనా పై పొగడ్తల వర్షం కురిపిస్తాడు. ప్రభావతి సత్యం ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే రవి శృతి ఇంటికి వస్తారు. మీదేంటి అప్పుడే వచ్చారు అని ప్రభావతి. రోహిణి ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్తానని చెప్పింది త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది అందుకే వచ్చేసాము అని శృతి అంటుంది.. అప్పుడే ఇంటికి వచ్చిన బాలు మీనాలు మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు అని అంటుంది ప్రభావతి. మేము మీకు ముందుకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటారు.. రోహిణి కూడా ఏదో గుడ్ న్యూస్ చెప్పాలని అనుకుంది అదేంటి అని అందరూ ఆలోచిస్తూ ఉండగా ప్రభావతి ఆ గుడ్ న్యూస్ ఆ గుడ్ న్యూస్ అనేమో అని అంటుంది.. మేము గుడ్ న్యూస్ చెప్పాలి అని బాలు మీనా అంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ ఎపిసోడ్ విషయానికొస్తే.. గుడ్ న్యూస్ చెప్పాలి అని అనగానే ప్రభావతి అదేనా అని అడుగుతుంది. అది కాదు అత్తయ్య అని రోహిణి అంటుంది.. మేం కూడా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని నేను అంటుంది.. ముందుగా మేమే ఇంటికి వచ్చాము కాబట్టి మేమే గుడ్ న్యూస్ చెప్తాము అని బాలు అంటాడు. కానీ ప్రభావతి మాత్రం వాడు గొప్ప బిజినెస్ మెన్ వాడే ఏదో మంచి న్యూస్ చెప్పబోతున్నాడు అన్నమాట. నువ్వు ఆగు నీ తర్వాత చెప్పొచ్చు కదా అనేసి ప్రభావతి అంటుంది. మేమే చెప్తాము అని బాలు చెప్తాడు.. చిన్న గంప పెళ్లి ఫిక్స్ అయ్యింది.. అదే మీనా చెల్లెలు సుమతికి అని అనగానే అందరు సంతోషంగా ఉంటారు. ఏంటి ఇది ఒక గుడ్ న్యూస్ ఆ అని ప్రభావతి వెటకారంగా మాట్లాడుతుంది.. మీనా వాళ్ళ చెల్లెలు పెళ్లి ఫిక్స్ అయ్యిందంటే అది గుడ్ న్యూస్ ఏ కదా అని అందరూ అంటారు. సత్యం మాత్రం ప్రభావతి మాటకు దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ వేస్తాడు.. నువ్వు ఇలాంటివి పొగడకపోయిన పర్వాలేదు కానీ ఏది అనకు ముందు వెళ్లి మూడు కోతులు బొమ్మలు చూసుకొని ప్రభావతితో అంటాడు.

సుమతి పెళ్లి ఫిక్స్ అయ్యిందంటే అది గుడ్ న్యూస్ ఏ కదా మనమందరం కలిసి దగ్గరుండి ఆ పెళ్లిని చేయాలి అని మనోజ్ అంటాడు. ఆ మాట వినగానే బాలు ఒక్కసారిగా షాక్అయ్యి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు.. అందరూ కలిసి బాలుని లేపుతారు. వీడేం మాట్లాడుతున్నాడో వీడికి కూడా అర్థం కావడం లేదు ఏమన్నావు రా ఇందాక నువ్వు అని బాలు అంటాడు. నేనేమన్నాను సుమతికి దగ్గరుండి పెళ్లి చేద్దామని అన్నాను అందులో తప్పేంటి అని మనోజ్ అంటాడు.. ఆ మాట వినగానే బాలు మళ్ళీ కింద పడిపోతూ ఉంటాడు.. తప్పేమీ లేదు కదా అందరూ కలిసి సుమతి పెళ్లి చేద్దామని రోహిణి కూడా అంటుంది. ఇక తర్వాత మేం చెప్పబోయే గుడ్ న్యూస్ కూడా వినండి అని రోహిణి అంటుంది..

Advertisement

ఈ శనివారం మీకు గుర్తుందా లేదా అని మనోజ్ అడుగుతాడు.. వీడు ఫర్నిచర్ షాప్ పెట్టి ఆ శనివారానికి కచ్చితంగా వంద రోజులు పూర్తి అవుతాయి అని బాలు అనగానే.. అవును నిజమే కదా మాకు అది విషయం గుర్తుకు రాలేదు.. ఇది కాదు ఇంకొకటి ఉంది అని అనగానే మీనా వాళ్ళ పెళ్లి రోజు అని చెప్తుంది. అవును నిజమే మా పెళ్లి రోజే అని అనగానే నిజమే కదా వీళ్ళకి అప్పుడే పెళ్లి అయ్యి ఏడాది పూర్తవుతుందా అని ప్రభావతి అంటుంది. మా పెళ్ళి రోజు నేను చాలా గ్రాండ్ గా చేసుకోవాలని అనుకుంటున్నాం అత్తయ్య అని రోహిణి అంటుంది.. ఇక మనోజ్ కూడా అదే విషయాన్ని చెప్పడంతో గ్రాండ్ గా ఎందుకు సింపుల్ గా చేసుకోవచ్చు కదా అని సత్యం అంటాడు. ఒక పెద్ద పార్లర్కి రోహిణి ఓనరు. ఒక పెద్ద బిజినెస్ మాన్ అయ్యుండి ఇలా అగ్గిపెట్టి కొంపలో సింపుల్ గా చేసుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా చేసుకొని ఇవ్వండి అని ప్రభావతి అంటుంది.. మీరందరూ ఓకే అంటే నాకేం ఇబ్బంది లేదు అని సత్యం కూడా అంటాడు.

Also Read : విడాకులు తీసుకోమని చెప్పిన హారిక.. మహాకు షాకిచ్చిన చక్రీ.. లాయర్ ను కలిసిన మహా, చక్రీ..

ఈ ఫంక్షన్ ఎలా చేయాలి అన్నది మన ముగ్గురం వెళ్లి మాట్లాడుకుందాం అని మనోజ్ అంటాడు. బాలు రవిలను పైకి తీసుకుని వెళ్లి ఆ బిజినెస్ డీల్ గురించి చెప్తాడు. మొదట వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే దానివల్ల వచ్చే లాభాల గురించి చెప్పడంతో మనోజ్ బాగుపడతాడు అని బాలు ఒప్పుకుంటాడు.. అయితే బాలుని ఏకంగా 50 కార్లకు ఓనర్ అని మనోజ్ అబద్ధం చెప్తాడు. అలాగే రవి ఒక పెద్ద రెస్టారెంట్ కి ఓనర్ అని చెప్పినట్లు మనోజ్ చెప్తాడు. ఏదో ఒకటి చేసి బాలు రవిలను మనోజ్ ఒప్పిస్తాడు.. ఇక రోహిణి కూడా మీనా శృతిలను కూడా ఒప్పిస్తుంది. రాత్రి బాలు మీనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.. మీరిలా అబద్ధం చెప్పడానికి ఒప్పుకుంటారండి అని అస్సలు ఊహించలేదు అని మీనా అంటుంది.. మా అమ్మ వాడు బాగుపడితే సంతోషపడుతుంది కదా అందుకే నేను ఒప్పుకున్నాను అని అంటాడు అక్కడితో ఎపిసోడ్.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×