E-Paper
Advertisement

Early Admissions: ఇంటర్​ నిబంధనలకు నీళ్లు.. పది పరీక్షలు కాకుండానే జోరుగా అడ్మిషన్లు

Early Admissions: ఇంటర్​ నిబంధనలకు నీళ్లు.. పది పరీక్షలు కాకుండానే జోరుగా అడ్మిషన్లు
Advertisement

Early Admissions: పదో పరీక్షలు కాకుండానే అడ్మిషన్లు
–జోరుగా ముందోస్తు ఆడ్మిషన్లు, ఆడ్వటర్జైమెంట్
–విద్యార్ధులను ఆకర్షిస్తూ ప్రచారం చేస్తున్న కార్పోరేట్​ కాలేజీలు
–కట్టడి చేయడంలో ఇంటర్మీడియేట్​ అధికారుల నిర్లక్ష్యం
–ఇంటర్​ కాలేజీలపై ఫిర్యాదు చేసిన క్రైస్తవ జన సమితి

రంగారెడ్డి బ్యూరో, స్వేచ్చ: రాష్ట్రంలోని ప్రైవేట్​ కళాశాలల ఆగడాలకు ఇంటర్మీడియేట్​ అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రతి యేడాది ఇదీ ఒక తంతుగా కోనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇంటర్​ కాలేజీలపై సీరియస్​ గా చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. ప్రస్తుత ప్రభుత్వం ఇంటర్ కాలేజీలపై సీరియస్​గా వ్యవహారించాలని అధికారులకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల పరిధిలోని కార్పోరేట్​, ప్రైవేట్​ కళాశాలలు అధికంగా ఉన్నాయి. విద్యార్ధులను ఆకర్షించే విధంగా కళాశాల యాజమాన్యం ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటి వరకు పదో తరగతి పరీక్షలు కూడా పూర్తి కాలేదు. కానీ ఇంటర్​లోకి ఆడ్మిషన్లు తీసుకోవడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. తల్లిదండ్రులు మా పిల్లలకు ఆడ్మిషన్లు ముందుగానే రిజర్వ్​ చేసుకోవాలనే లక్ష్యంతో ఉత్సహాం చూపిస్తున్నారు. ఇలాంటి తల్లిదండ్రులను ఆసరా చేసుకోని రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఆడ్మిషన్​ రిజర్వ్​కు తీసుకోవడం చట్ట విరుద్దం. హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాలోని ఇంటర్​ కార్పోరేట్​ కళాశాలపై క్రైస్తవ జన సమితి వ్యవస్థపక అధ్యక్షులు మాసారం ప్రేమ్​ కుమార్​ ఫిర్యాదు చేశారు.

ముందే ఆడ్మిషన్లు తీసుకుంటే ఫీజు తక్కువ..

Advertisement

ఇంటర్ కార్పోరేట్​, ప్రైవేట్​ కళాశాల యాజమాన్యం ప్రవేశాలకు శ్రీకారం చూట్టారు. ముందోస్తు ఆడ్మిషన్లు, ఆడ్వటర్జైమెంట్​లతో బీజీ బీజీగా పనిచేస్తున్నారు. పది ఫలితాల తర్వాత ఆడ్మిషన్లు తీసుకుంటే అధిక ఫీజులు వసూలు చేస్తారనే ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఫీజు తగ్గింపు కోసం ముందోస్తు ఆడ్మిషన్లు తీసుకుంటున్నారు. కొన్ని ప్రైవేట్‌ కళాశాలలు రెండు నెలలుగా స్కాలర్‌షిప్‌ టెస్టులను నిర్వహిస్తూ మెరిట్‌ స్టూడెంట్స్‌కు ఫీజుల్లో రాయితీలు ఇస్తామని ప్రచారం చేస్తున్నాయి. కళాశాలలు వారికి ఇష్టం వచ్చినంత ఫీజులను వసూలు చేశాయి. కొందరికి మాత్రమే ఫీజు రాయితీలు లభించగా మిగిలిన వారు లక్షల్లో ఫీజు చెల్లించాల్సి వస్తోంది.

Also Read: Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్…

హోర్డీంగ్​ ప్రకటనలతో ఆకర్షణ..

Advertisement

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆకర్షణీయమైన ప్రకటనలకు ఆకర్షితులై ఆయా కళాశాలల్లో చేరేందుకు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో కొన్ని కళాశాలల యాజమాన్యాలకు అడ్డు అదుపు లేకుండా ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. ఇంజనీరింగ్‌, మెడికల్‌ కళాశాలల్లో ఫీజుల నియంత్రణతోపాటు కళాశాల ప్రమాణాలను బట్టి ఫీజులను నిర్ధారించిన ప్రభుత్వం జూనియర్‌ కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.

ఫీజుల వేటలనే నిమగ్నం..

ఇంటర్మీడియట్‌తో పాటు జేఈఈ అడ్వాన్స్‌డ్‌, మెయిన్స్‌, నీట్‌, ఎప్‌సెట్‌ కోచింగ్‌ పేరిట ప్రైవేట్‌ కళశాలలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. జాతీయ, రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించామంటూ ప్రకటనలతో విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఆయా కళాశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందితోపాటు పీఆర్వోలను నియమించుకొని పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళుతున్నారు.ఇప్పుడే అడ్మిషన్లు తీసుకుంటే ఫీజుల్లో రాయితీ ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్‌కు దీటుగా ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నా.. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రైవేట్‌ కళాశాలలవైపే మొగ్గు చూపుతున్నారు.

ఈ కళాశాలలపై ఫిర్యాదు..

హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఆగస్తయ్య,శ్రీ గురు, ఎక్షలేన్సియా జూనియార్​ కాలేజీలతో పాటు ఫిజిక్స్​వాలా, అలెన్​ ఆకాడమీలు ముందోస్తు ఆడ్మీషన్లు, అడ్వటర్జైమెంట్​ లతో ప్రచారం చేస్తున్నారని ఇంటర్మీడియేట్​ అధికారులు క్రైస్తవ జనసమితి అధ్యక్షులు మాసారం ప్రేమ్​ కుమార్​ ఫిర్యాదు చేశారు. రూల్ 14 ప్రకారం ఇంటర్​ నిబంధనల ఉల్లంఘన కింద ముందోస్తు అడ్మిషన్​ కు రూ.లక్ష, అడ్వటరైజ్​మెంట్ కు రూ.లక్ష చోప్పున జరిమానా వేయాల్సి ఉందని విద్యార్ధి సంఘం నాయకులు వివరిస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వం ఫిర్యాదు చేసిన కాలేజీలకు జరిమాన విధించే అవకాశం ఉందని తెలిపారు.

Also Read: Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో.. ప్రభుత్వం చర్చించే అతి కీలకమైన అంశాలివే..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×