E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం..దెయ్యంగా మారిన మీనా.. రోహిణికి మైండ్ బ్లాక్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం..దెయ్యంగా మారిన మీనా.. రోహిణికి మైండ్ బ్లాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 8th: రోహిణి బాలుకి అనుమానం వచ్చింది కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటివరకు అయితే మా నాన్న చనిపోయాడు అని ఏదో ఒక అబద్ధం అయితే చెప్పాను. ప్రస్తుతానికి మా నాన్న మేటర్ క్లోజ్ అయింది కానీ బాలుకి నా మీద అనుమానం వచ్చింది కాబట్టి నేను ఆ 30 లక్షలు కూడా త్వరగా తెచ్చే ప్రయత్నం చేయాలి అని అనుకుంటుంది.. ఫోన్ చేసి అతను దొరకాలి అంటే ఏం చేయాలి అని అడుగుతుంది.. సీసీటీవీ ఫుటేజ్ గనుక నాకు దొరికితే దాన్ని నేను ఎలాగైనా సరే గుణాకిచ్చి ఆ 30 లక్షలు త్వరగా తీసుకురావాలి అని అనుకుంటుంది.. బాలు మాత్రం రోహిణి ప్లాన్ ని ఎలాగైనా సరే తిప్పికొట్టి తన మలేషియా బాగోతం బయటపెట్టి నోరు మూయిస్తాను అని నిర్ణయించుకుంటాడు.. ఒకవేళ అదే గనుక నిజమైతే రోహిణి పరిస్థితి దారుణంగా మారుతుంది..

అయ్యో.. బాలు కు నిరాశ..

ఈ రెండు ఫోటోలని ఆ బామ్మ వాళ్లకి పంపించి వీళ్ళలో ఎవరైనా నా ఫోన్ పడేసుకున్నారు ఏమో తెలుసుకోవడం మేలు కదా అని బాలు అనుకుంటాడు. అయితే బాలు ఆ బామ్మ వాళ్ళ మనవడికి ఫోన్ చేస్తాడు. నేను రెండు ఫోటోలు పంపిస్తాను అది భామ వాళ్ళని అడిగి వాళ్ళు తెలుసేమో అడుగుతావా అని బాలు అడుగుతాడు. అయితే నేను ఇక్కడ లేను బాలు అన్న వేరే ఊర్లో పనిమీద వచ్చాను రెండు రోజుల తర్వాత వెళ్తాను అని అనగానే సరే రెండు రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత ఆ ఫోటోలని భామ వాళ్ళకి చూపించమని బాలు అడుగుతాడు.. తప్పకుండా చూపిస్తానన్నా అని అనగానే బాలు ఇంకో రెండు రోజులు మనం వెయిట్ చేయాల్సిందే అని బాలు అంటాడు. రోహిణి మీద నా అనుమానం రోజు రోజుకి పెరుగుతుంది.

మీనాకు దెయ్యం..

Advertisement

అర్ధరాత్రి అవుతుంటే మనోజ్ ఎక్కడికి వెళ్ళాడు అని రోహిణి వెతుక్కుంటూ కిందకు వెళుతుంది. అయితే మనోజ్ ఎక్కడ అర్థం కావడం లేదు అని రోహిణి అంత వెతుకుతూ ఉండగా అక్కడ తెల్ల చీర కట్టుకొని ఒకరు కనిపిస్తారు. ఎవరు ఇక్కడ తెల్లచీర కట్టుకొని కనిపిస్తున్నారు అని రోహిణి అడుగుతుంది. చూడటానికి మీనా లాగా ఉండడంతో రోహిణి మీనా అని అడుగుతుంది కానీ ఎంత పిలిచినా పలుకుండా మీనా మౌనంగా ఉంటుంది.. అయితే, మీనా రోహిణిని ఒక్కసారిగా చూసి గట్టిగా అరుస్తుంది. అది చూసిన రోహిణి మీనా ఏంటి ఇలా మారిపోయావు దెయ్యం పట్టిందా అని అడుగుతుంది..

రోహిణికి చుక్కలు చూపించిన మీనా..

నువ్వు ఇప్పటివరకు మీ అత్తయ్య గారికి చెప్పినట్లు నాకు కూడా అబద్ధాలు చెప్పాలని చూస్తున్నావా అని రోహిణి గొంతు పట్టుకుంటుంది మీనా.. నేనేమీ అబద్ధాలు చెప్పలేదు నన్ను వదిలేసి అని ఎంత చెప్తున్నారు ? తను మాత్రం వినకుండా అరుస్తుంది. బాలు ఫోను కొట్టేసి శివ వీడియోని అందరికీ వెళ్లేలా చేసి వాడి భవిష్యత్తుని నాశనం చేయాలని చూసావా అని అడుగుతుంది. నేను ఏ తప్పు చేయలేదు నాకేం తెలీదు అని రోహిణి ఎంత చెప్తున్నా సరే.. నిజం చెప్పు లేదంటే నువ్వు చచ్చిపోతావు అని రోహిణిని మీనా బెదిరిస్తుంది. అయితే ఇదంతా నిజం కాదు రోహిణి కలలో నన్ను చంపొద్దు నన్ను వదిలేయి అంటూ అరుస్తుంది..

మనోజ్, ప్రభావతిలకు షాక్..

Advertisement

రోహిణి నన్ను చంపొద్దు కొట్టొద్దు అని అరుస్తున్నప్పుడు మనోజ్ లేచి రోహిణి ఈరోజు కూడా ఇలాగే అవుతుందా? ఈరోజు కూడా నన్ను తన్నేస్తుందని భయపడిపోతూ ఉంటాడు. రోహిణి తల్లుతుంది అని అనుకున్నప్పుడు రోహిణి తన్నేసి మనోజ్ ని కింద పడేస్తుంది. వెంటనే మనోజ్ ప్రభావతికి ఫోన్ చేసి ఇక్కడ రమ్మని పిలుస్తాడు.. రోహిణి ఆ పరిస్థితిలో చూసినా ప్రభావతి నిజంగానే దెయ్యం పట్టిందేమో అని మనోజ్ కి విభూది ఇస్తుంది. ఇక మనోజ్ కూడా రోహిణికి నిజంగానే దెయ్యం పట్టింది అని విభూది రాసి కింద పడుకుంటాడు. మీనా వల్ల నాకు కాపురంలో చిచ్చు పడేలా ఉంది అని రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది..

బాలును ఆడుకున్న మీనా..

రవి శృతి ఇద్దరు కూడా కాసేపు సరదాగా గొడవపడతారు.. రివర్స్ లో రవిని ఒక ఆట ఆడుకుంటుంది శృతి. ఇక బయటకు వచ్చిన శృతి మీనా బాలుని ఏ విధంగా ఆడుకుంటుందో చూడాలని బయట వింటూ ఉంటుంది. బాలు మీన దగ్గరికి వచ్చి వంట చేస్తున్నావా అని అడగ్గానే లేదు సినిమా చూస్తున్నాను అని వెటకారంగా మాట్లాడుతుంది. టీ పెట్టమని అడిగితే పాలు లేవు అని పొంతన లేకుండా సమాధానం చెప్తుంది. బాలు మీనాకు ఏదో అయింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా బయట శృతి నవ్వుతూ కనిపించడంతో బాలు ఇదంతా నీ ప్లాన్ అని అంటాడు. వీళ్ళిద్దరూ సరదాగా ఉండడం చూసి బాలు మీరిద్దరూ కలిసి నన్ను ఆడుకుంటున్నారు కదా అని అంటాడు.

రోహిణికి దెయ్యం పట్టిందా..?

ఉదయం లేవగానే రోహిణి ని మనోజ్ దగ్గరికి తీసుకొని వస్తారు. మనోజ్ ప్రభావతి ఇద్దరూ కలిసి రోహిణిని కామాక్షి ఇంటికి తీసుకొని వస్తారు. కామాక్షి అక్కడ ముగ్గు వేస్తూ కనిపించడంతో ఏంటే ఆంటీ ముగ్గు వేస్తున్నారు ఎందుకు అని అడుగుతుంది. రోహిణి ప్రవర్తన చూసి నిజంగానే దెయ్యం పట్టిందని అనుకుంటారు. అప్పుడే ఇంట్లోకి ఒక స్వామీజీ రావడంతో రోహిణి ఈ దెబ్బకు వీళ్ళకి షాక్ ఇవ్వాలి అని అనుకుంటారు. రోహిణి నిజంగానే దెయ్యం పట్టినట్లు చేయడంతో ఆ స్వామిజి కర్రతో రోహిణి దారుణంగా కొడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read:Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్, ప్రేమ సీన్ హైలెట్.. చందుకు దొరికిన శ్రీవల్లి.. ధీరజ్ ఇక జైల్లోనే..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×