E-Paper
Advertisement

ఫిలిప్పీన్స్‌పై ప్రకృతి కన్నెర్ర.. కుదిపేసిన భారీ భూకంపం, పేక మేడలా కూలిన భవనాలు

ఫిలిప్పీన్స్‌పై ప్రకృతి కన్నెర్ర.. కుదిపేసిన భారీ భూకంపం, పేక మేడలా కూలిన భవనాలు
Advertisement

Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఆదేశాన్ని సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం కుదిపేసింది. రెక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదు అయ్యింది. భూకంపం ధాటికి తీరప్రాంత నగరాల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఒక్కమాటలో చెప్పాలంటే భూకంపానికి జనరల్‌ శాంటోస్‌ సిటీ చిగురు టాకులా వణికిపోయింది.

ఫిలిప్పీన్స్‌పై ప్రకృతి కన్నెర్ర.. కుదిపేసిన భారీ భూకంపం

Advertisement

దావో ఆక్సిడెంటల్‌లోని మలిటా ప్రాంతంలోని ఓ పాఠశాలలో జెండా వందన కార్యక్రమం జరుగుతోంది. భూకంపం తీవ్రతతో మహాయహాయ్ ఎలిమెంటరీ స్కూల్‌ ఒక్కసారిగా వణికించింది. పాఠశాల ప్రాంగణంలో ఓ షెడ్ నుంచి విద్యార్థులు బయటకు వచ్చేశారు. క్షణాల్లో ఆ షెడ్ కూలిపోయింది. దాని కింద చాలామంది ఉన్నారు. ఈ భూకంపం ధాటికి విద్యార్థులు ఒకరినొకరు గట్టిగా పటుకున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

ఫిలిప్పీన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సీస్మాలజీ వెల్లడించిన వివరాల మేరకు.. సోమవారం ఉదయం 7.30 గంటలకు దక్షిణ ఫిలిప్పీన్స్‌లో 10 కిలోమీటర్ల లోతులో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది . దీని దాటికి ఫిలిప్పీన్స్ తీరప్రాంతంలోని పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. ఫిలిప్పీన్స్ ప్రధాన ద్వీపమైన మిండానోలోని జనరల్ శాంటోస్ సిటీ తీరానికి సమీపంలో భూకంపం సంభవించింది.

Advertisement

పేక మేడలా కూలిన ఎత్తైన భవనాలు.. రిక్టర్ స్కేలుపై 7.8 గా నమోదు

జనరల్‌ శాంటోకు నైరుతి దిశగా 6.2 మైళ్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫిలిప్పిన్స్‌ తీరంలో మూడు అడుగుల ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడ్డాయి. భూకంపం తీవ్రత దృష్ట్యా 10 అడుగుల ఎత్తులో సునామీ అలలు విరుచుకుపడొచ్చని హెచ్చరించారు.

ఇండోనేషియా, మలేసియాలో మూడు అడుగుల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగసిపడే అవకాశం ఉందని పసిఫిక్‌ సునామీ సెంటర్ తెలిపింది. తైవాన్‌, జపాన్‌, పపువా న్యూ గునియా వంటి దేశాలు ప్రభావితం కావొచ్చని ఓ అంచనా. జనరల్‌ శాంటోస్‌ సిటీ జనాభా 7 లక్షల మంది. ఈ ప్రాంతం ట్యూనా ప్రాసెసింగ్‌ పరిశ్రమకు ఫేమస్. భూకంపం ధాటికి అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతింది.

ALSO READ: ఇరాన్-అమెరికా యుద్ధం.. 100 రోజులు పూర్తి, విఫలమైతే నాశనం చేస్తామన్న ట్రంప్ 

భూకంపం వచ్చిన ప్రాంతాల్లో హైస్కూల్, కాలేజీలు, విశ్వవిద్యాలయ భవనాలు సహా చారిత్రక కట్టడాలు దెబ్బతిన్నట్లు సమాచారం. చాలా భవనాలు దెబ్బతిన్నాయని, సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నందున వాటి వివరాలను ఇప్పుడు చెప్పలేమని జనరల్ శాంటోస్ సిటీ పోలీసు మాస్టర్ సార్జెంట్ రాబర్ట్ డాగన్ అన్నారు. అనేక భవనాలు, కొన్ని ఇళ్లు కూలిపోయాయని తెలిపారు.

 

 

 

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×