// // Gundeninda GudiGantalu Today episode: రవిపై శృతి సీరియస్.. -->
E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రవిపై శృతి సీరియస్.. మీనా కాళ్ళు పట్టుకున్న బాలు.. ప్రభా డ్యాన్స్ కేక..

Gundeninda GudiGantalu Today episode: రవిపై శృతి సీరియస్.. మీనా కాళ్ళు పట్టుకున్న బాలు.. ప్రభా డ్యాన్స్ కేక..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 11th: రాత్రి అయిన తర్వాత మనోజ్ రోహిణి కొట్టడానికి కర్ర తీసుకొని వస్తాడు. నన్ను తిట్టుకోవద్దని రోహిణి నీలో ఉన్న దెయ్యాన్ని మాత్రమే నేను కొడుతున్నాను అని మనోజ్ అంటాడు. అయితే రోహిణి నన్ను కొట్టొద్దు మనోజ్ అని ఎంతగా బ్రతిమలాడుతున్నా సరే మనోజ్ మాత్రం తనని కొడుతూనే ఉంటాడు. కానీ ఆ నొప్పిని భరించలేక రోహిణి దయ్యం పట్టిందానిలాగా ప్రవర్తిస్తుంది. కర్ర తీసుకొని వచ్చి మనోజ్ ని కొడుతుంది. ప్రభావతి మనోజ్ ని ఇద్దరినీ కొట్టేస్తుంది రోహిణి.. అప్పుడు కూడా ప్రభావతి ఆస్తులు గురించి మీరు చెప్పలేదు అని అనగానే రోహిణి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది..

అయ్యో..రవి కాపురంలో చిచ్చు..

రవి పెళ్లిరోజు కూడా రెస్టారెంట్ కి రావడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా ఈ రోజైనా కనీసం లీవ్ తీసుకుని అక్కడ ఉండొచ్చు కదా.. అని ఎంత చెప్తున్నా సరే రెండు ఆర్డర్లు ఉన్నాయి అవి అవ్వగానే వెళ్ళిపోతాను అని అంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చినా నీతూ ఏంట్రా నువ్వు ఇవాళ లీవ్ తీసుకున్నవ్ కదా మళ్లీ ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది.. అయితే రవి రెండు ఆర్డర్లు ఉన్నాయి నీతూ అవి అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే వెయిటరు ఒక ఆర్డర్ ని కింద వేయడం చూసినా రవి నీతో ఇద్దరు కూడా షాక్ అవుతారు.. ఏంటి ఏం జరిగింది ఎందుకు కింద పడేసావ్ అని అడుగుతారు.. కస్టమర్ అర్జెంట్ అంటూ టెన్షన్ పెట్టడంతో ఇలా చేయి జారిపోయింది అని అతను చెప్తాడు..

రవిని వదిలేసిన శృతి..

Advertisement

రవి నేను ఈ ఆర్డర్ని ప్రిపేర్ చేసి వెళ్తాను అని నీతూ తో చెప్తాడు.. అయితే లోపలికి వెళ్లిన నీతు అక్కడి కింద పడిపోవడంతో తనకి కాలికి దెబ్బ తగిలింది అని రవి అనుకుంటాడు.. అయితే నీతూని ఎత్తుకొని బయటికి తీసుకురావడం చూసినా శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. శృతి నేను చెప్పేది విను అని రవి ఎంతగా బ్రతిమిలాడుతున్నా సరే నువ్వు చెప్పాలనుకునేది చూశాను కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. శృతికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ రావడంతో రవి టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. శృతి వల్ల ఈ ఫంక్షన్ ఆగిపోకూడదు అని రవి ఇంటికి వెళ్లి రెడీ అయ్యి వెయిట్ చేస్తూ ఉంటాడు.

మీనా కాళ్లు పట్టుకున్న బాలు..

బాలు రెడీ అయ్యి మీనా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.. అయితే మీన అందంగా రెడీ అయ్యే కిందకి రావడం చూస్తున్న బాలు ఒక్కసారిగా తనపై పొగడ్తలు వర్షం కురిపిస్తాడు.. చాలా అందంగా ఉన్నావు అని అంతగా పొగిడేస్తున్నావు కదా ఈరోజు పార్టీలో ఏమైనా పనుందా అని అడుగుతుంది మీనా.. ఆడవాళ్ళని పొగిడినా సరే ఇబ్బందిగా ఉంటుంది కదా.. మీరు ఇప్పుడు ఇంతేనా మగవాళ్ళు పొగిడితే ఇలాంటి మాటలు మీకు వస్తాయని బాలు అంటాడు. ఇక మీనా చీర కొంగు మడతలు సరిగ్గా లేవు అని చూసుకుంటూ ఉండగా బాలు నేను సరి చేస్తాను అని మీనా కాళ్లు పట్టుకుంటాడు.. సత్యం రాగానే బాలు లేస్తాడు. ఇంకా అందరూ రాలేదా అని అడుగుతాడు..

ప్రభాను రెడీ చేసిన రోహిణి..

Advertisement

అత్తయ్య గారిని రోహిణి రెడీ చేస్తుంది అని చెప్పగానే ఫంక్షన్ అనగానే సరిపోతుంది.. ఈ పార్లరమ్మ ఎక్కడో దాచిపెట్టినవి కూడా క్రీములు బ్రష్షులు అన్ని బయటకు తీసుకొచ్చి, మొహానికి పెయింట్ వేసినట్టు వేసేస్తూ ఉంటుంది అని బాలు అంటాడు.. అయితే అక్కడ ఆడవాళ్లు ఎంతగా రెడీ అయితే మగవాళ్ళకి అంత మంచిది కదా అని సత్యం కూడా అనడంతో సరేలెండి నేనేమన్నా కూడా మీ మామ కోడలు తోడైపోతారు అని బాలు అంటాడు.. ప్రభావతిని అందంగా రెడీ చేసిన రోహిణి పై పొగడ్తల వర్షం కురిపిస్తుంది.. తనకి తానే పొగిడేసుకుంటూ ఉంటుంది.. అయితే అందరూ కలిసి కిందకు రావడంతో రవి శృతి ఎక్కడ అని అడుగుతారు.. డబ్బింగ్ ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతారు.. మీరు ఫంక్షన్ హాల్ కి వెళ్ళండి నేను శృతిని తీసుకొని వస్తాను అని రవి అందరిని ఎక్కడికి పంపిస్తాడు..

నిజం చెప్పిన రవి..

బాలు మీనాలకు రవి అబద్ధం చెప్తున్నాడని అర్థమవుతుంది.. ఏమైంది ఎందుకు నువ్వు అలా టెన్షన్ పడుతూ ఉన్నావు అని రవిని బాలు అడుగుతాడు.. ఏమి టెన్షన్ పడడం లేదు అన్నయ్య ఎంత చెప్తున్నా సరే.. బాలు మాత్రం నాకు నిజం తెలుసు రా నువ్వు ముందు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు.. శృతి రవిని అలా చూసి వెళ్ళిపోయింది అని రవి చెప్పగానే అపార్థం చేసుకుని వెళ్ళిపోయి ఉంటుంది శృతిని ఎక్కడున్నా మేము తీసుకొని వస్తాము అని మీనా బాలు వెళ్తారు.. ఇక రవి అందరితో కలిసి ఫంక్షన్ హాల్ కి వెళ్ళిపోతాడు..

ప్రభా డ్యాన్స్ అదిరిపోయింది..

రవి శృతి ఇంకా రాలేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అందరూ డౌటుతో అడుగుతారని డాన్స్ ప్రోగ్రాం లను మొదలు పెట్టమని చెప్తాడు.. ప్రభావతి తన స్టూడెంట్స్ తో కలిసి అదిరిపోయే డాన్స్ను పర్ఫామెన్స్ చేస్తుంది.. అందరూ కూడా ఆ డాన్సులను చూసి సరదాగా ఉంటారు.. కానీ రవి మాత్రం టెన్షన్ పడిపోతూ కనిపిస్తాడు.. ప్రభావతి డాన్స్ చూసిన సురేందర్ ఈ వయసులో ఏంటి అని వెటకారంగా మాట్లాడతాడు.. అందరి ముందు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదా అని సత్యంతో అనగానే సత్యం ప్రభావతికి సపోర్ట్ చేస్తూ అది నాట్యమని అంటాడు..

మనోజ్, రోహిణికి అనుమానం..

రవి టెన్షన్ పడిపోదు అటు ఇటు తిరగడం చూసినా రోహిణి.. రవి దేని గురించి టెన్షన్ పడుతున్నాడు అని అనుకుంటుంది.. శృతి వస్తుంది నేను తీసుకుని వస్తాను అని చెప్తున్నా సరే రోహిణి మాత్రం వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది అని ఉంటుంది. అటు మీనా బాలు ఇద్దరు కూడా శృతి కోసం డబ్బింగ్ స్టూడియో కి వెళ్తారు. ఆ తర్వాత అక్కడ శృతి లేదు అని తెలుసుకుని మీనా బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. మొత్తానికి ప్రభావతి డాన్స్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తుంది. మరి బాలు మీనాలు శృతిని తీసుకొస్తారా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : కేశవ ప్రేమలో పడ్డాడురో.. మహా కోసం చక్రీ ఫీల్.. మహాకు విక్కీ వార్నింగ్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×