E-Paper
Advertisement

ఎన్నికల కమిషన్ తో కలిసి బీజేపీ డ్రామాలు.. సామా రామ్మోహన్ రెడ్డి ఫైర్!

ఎన్నికల కమిషన్ తో కలిసి బీజేపీ డ్రామాలు.. సామా రామ్మోహన్ రెడ్డి ఫైర్!
Advertisement

Nomination Rejection: స్వేచ్ఛ బ్యూరో: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ  అంశంలో ఎన్నికల కమీషన్ తో కలిసి బీజేపీ డ్రామాలు ఆడుతుందని మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ..నిజాలను పక్కదోవ పట్టించడానికి సీఎం రేవంత్ రెడ్డి పై బీజేపీ నేతలు బురద జల్లుతున్నారన్నారు. దక్షిణ భారత దేశంలో రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి మోడీ కి కూడా అర్థం అయిందని, అందుకే రేవంత్ రెడ్డి నైతికత ను దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఫిర్యాదులపై విచారణ చేసే అధికారం ఆర్ వో కు లేదన్నారు.

ఎవరిదో ఒత్తిడి తో ఆర్ వో మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరించారని ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్ పై తెలంగాణ లో క్రిమినల్ కేసు లేదన్నారు. ఆమె నామినేషన్ ను తిరస్కరించడానికి ఎదో ఒక సాకు పెట్టి రిజెక్ట్ చేశారన్నారు. పిర్యాదు చేస్తే క్రిమినల్  కేసు ఎలా అవుతుంది? అంటూ ప్రశ్నించారు. పిర్యాదు కు క్రిమినల్ కేసు కు చాలా తేడా ఉన్నదన్నారు. ఇంతకు మించిన సిగ్గు మాలిన, హేయమైన చర్య ఇంకొకటి లేదన్నారు. దీనిపై కాంగ్రెస్ సుప్రీంకోర్టు కు పోతుందన్నారు.

Advertisement

బీఎల్ సంతోష్ తెలంగాణ లో ఎమ్మెల్యేల ను గోనుగోలు చేసిన వ్యక్తి అని, మధ్య ప్రదేశ్ లో కూడా చేద్దామనుకుంటే అక్కడ ఎమ్మెల్యేలు లొంగలేదన్నారు. అందుకే బీఎల్ సంతోష్ కాంగ్రెస్ పై దొంగనాటకాలు ఆడుతున్నాడన్నారు. కాంగ్రెస్ ను గద్దె దించడం కోసమే వాళ్ళు జెండా, అజెండా పెట్టుకున్నారన్నారు. స్వతంత్ర  భారత దేశంలో ఇంత కంటే దిక్కుమాలిన చర్య ఇంకొకటి ఉండదన్నారు. ఓట్ చోరీ జరిగిందని, అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ కట్టలు కట్టలు ఆధారాలు చూపించారన్నారు. కానీ చీప్ ఎన్నికల కమిషనర్ సమాధానం చెప్పలేదన్నారు.

Also Read: బంగారం-వెండి ధరల పతనం.. కొనుగోలు ఇదే సరైన సమయం, లోహాల ధరలు పతనం వెనుక?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×