// // Gundeninda GudiGantalu Today episode: చింతామణితో ప్రభా సవాల్.. -->
E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: చింతామణితో ప్రభా సవాల్.. రోహిణికి మరో సమస్య..ఇంత కక్కుర్తి ఏంటి ప్రభావతి..?

Gundeninda GudiGantalu Today episode: చింతామణితో ప్రభా సవాల్.. రోహిణికి మరో సమస్య..ఇంత కక్కుర్తి ఏంటి ప్రభావతి..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode july 1st : డాన్స్ స్కూల్ కి పిల్లలందరూ వస్తారు. కానీ అందులో ఒక వ్యక్తి వెయిట్ మిషన్ తీసుకొని వస్తాడు. అందరూ జిమ్ లో కూడా వెయిట్ చూసుకుంటున్నారు.. మీరు ఇక్కడ కూడా వెయిట్ మిషన్ ని చెక్ చేసి ఎలా ఉండాలో చెప్పాలి అని అంటారు. ఇక అందరూ సరదాగా వెయిట్ ఎంత ఉంటానో అని చెక్ చేసుకుంటారు. కామాక్షి, చింతామణితో పాటుగా అక్కడున్న పిల్లలందరూ కూడా వెయిట్ ని చెక్ చేసుకుంటారు.. కానీ ప్రభావతి ఆ మిషన్ మీద ఎక్కగానే అది ఆగిపోతుంది దాంతో కామాక్షి వాళ్ళందరూ కూడా ప్రభావతిని ఆటపట్టిస్తారు. ఇక మొత్తానికి అక్కడ ఒక సరదా వాతావరణం క్రియేట్ అవుతుంది..

ప్రభావతిని అవమానించిన చింతామణి..

చింతామణి మీరు బరువు ఉన్నారు అని ప్రభావతిని అంటుంది.. నేను బరువు ఏమీ లేను కాస్త బొద్దుగా ఉన్నాను అని ప్రభావతి అంటుంది.. మీరు బరువు తగ్గాలి అంటే ముందు మీ కోడల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి అప్పుడే మీరు బరువు తగ్గుతారు అని చింతామణి అంటుంది.. మీ కోడలు కంట్రోల్లో ఉంటే మీరు బరువు కూడా తగ్గిపోతారు. మీరేం చెప్తే అది చేస్తుంది కదా.. అలా మీకు కావాల్సినట్లు బరువు తగ్గడానికి చేయించుకోండి అని చింతామణి కావాలనే ప్రభావతిని రెచ్చగొడుతుంది.. మీనా చతా మీకు కావాల్సినట్టు చేయించుకొని బరువు తగ్గొచ్చు అని ప్రభావతి కి చింతామణి సలహా ఇస్తుంది.. కామాక్షి మా వదినని నిప్పులాగా రెచ్చగొడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది.. తను లావుగా ఉందని అవమానంగా ఫీల్ అయిన ప్రభావతి ఎలాగైనా సరే డైట్ చేయాలి అని మనోజ్ కి ఫోన్ చేసి చెప్తుంది.. నాకు ఆ డాక్టర్ గురించి చెప్పు అతని అడిగి తెలుసుకుంటాను అని ప్రభావతి అంటుంది

రోహిణికి మరో సమస్య..

Advertisement

సుగుణమ్మ రోహిణి కి ఫోన్ చేస్తుంది.. ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేశావు నేనే ఫోన్ చేస్తాను అని చెప్పాను కదా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయొద్దు అని రోహిణి తో అంటుంది. ఇప్పుడే చింటూ నీ స్కూల్లో వదిలిపెట్టి వస్తున్నానమ్మ కానీ ఇక్కడ ఉన్న టీచర్లు రేపు పేరెంట్స్ మీటింగ్ అని చెప్పారు.. రేపు పేరెంట్స్ కచ్చితంగా రావాలి అని చెప్పగానే నేను ఏం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాను అమ్మ.. మరి రేపు నువ్వు చింటూ కి అమ్మగా వస్తావా అని సుగుణమ్మ ఆడుతుంది.. నేను అక్కడికి వస్తే చింటూ నా కొడుకుని అందరికీ తెలిసిపోతుంది ఆ తర్వాత నాకు కాపురం ఏమైపోతుందో ఆలోచించవా అమ్మ నువ్వు అని సుగుణమ్మ పై సీరియస్ అవుతుంది రోహిణి.. కానీ రేపు ఏదో ఒకటి చేసి నేనే వాడికి తల్లి లాగా అక్కడికి వస్తానని చెప్తుంది రోహిణి.

మీనాకు బాలు షాక్..

మీనాకు బాలు డ్రైవింగ్ చేయించడానికి బయటకు తీసుకొని వెళ్తాడు.. మీనా ఇలాగే ఇంక రెండు రోజులు మంచిగా డ్రైవింగ్ నేర్చుకుంటే నాకు సపోర్ట్ గా ఉంటావు అని బాలు అంటాడు.. శృతి చెప్పినట్టుగా నువ్వు డ్రైవింగ్ బాగా నేర్చుకుంటే లేడీస్ కి డ్రైవింగ్ నేర్పించవచ్చని బాలు అంటాడు. ఇక బాలు దెబ్బకి మేన కాస్త ఫీలయినా సరే కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తుంది.. అయితే మీనా తెలిసిన వాళ్ళందరూ కూడా మీనా డ్రైవింగ్ బాగా నేర్చుకుంటే మేము కూడా నీ కారు ఎక్కి వస్తాము అని అంటారు. కానీ చివరికి ఓ ఇద్దరూ మీనా గురించి తెలియక కారు ఎక్కుతారు.. ఇక ఇద్దరూ కలిసి కాస్త సరదాగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటారు..

అరుణ్ కు షాకిచ్చిన బాలు..

Advertisement

బాలు పూల కోసమని ఒక షాపు దగ్గరికి వెళ్తాడు.. అక్కడికి వెళ్లిన బాలు వాళ్లతో మాట్లాడుతూ ఉండగా అరుణ్ అక్కడికి కూరగాయల కోసమని వస్తాడు.. అక్కడ బాలుని చూసి ఏంట్రా నా గురించి ఏదేదో చేస్తున్నావు నా వీడియో తీసింది నువ్వే కదా అని అడుగుతాడు.. ఇన్ని రోజులు నువ్వు యూనిఫాం వేసుకున్నావు కదా అని రెచ్చిపోయావు..ఇప్పుడు యూనిఫాం లేదు కదా మీరు మామూలు మనిషి అది గుర్తుపెట్టుకోండి అని బాలు అరుణ్ణి అవమానించేలా మాట్లాడుతాడు.. అరుణ్ బాలు మాటలకి ఇంకాస్త సీరియస్ అవుతాడు.. రోడ్డు మీద ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్తారు.. ఈ గొడవ సమయంలో అరుణ్ చొక్కా కూడా చినిగిపోతుంది..

దొంగగా మారిన ప్రభావతి..

ఉదయం లేవగానే మీనా ఏం వంట చేశావు అని బాలు హడావిడిగా వచ్చి అడుగుతాడు.. గారెలు ఇడ్లీ చికెన్ చట్నీ సాంబార్ అన్ని ఉన్నాయి అని మీనా అనగానే చెప్తుంటేనే నోరూరిపోతుంది.. ఇక తింటే ఎలా ఉంటుందో అని బాలు సత్యం ఇద్దరూ కూడా తినడానికి కూర్చుంటారు… అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి నేను డైట్ లో ఉన్నాను నాకు ఇలాంటి నూనె వస్తువులు పెట్టి నన్ను ఇది చెయ్యొద్దు.. నుంచి నాకు ఇడ్లీనే కావాలి అని ప్రభావతి కూర్చుంటుంది.. అయితే మీరు తినకపోతే మిగిలిన వాళ్ళందరూ తింటారని మీనా అనగానే అందరూ గారెల్ని లొట్టలు వేసుకుంటూ తింటారు.. ఆ తర్వాత అందరూ వెళ్లిపోయిన తర్వాత ప్రభావతి అక్కడికి వచ్చి దొంగలాగా గారెలు చికెన్ వేసుకుని తింటుంది.. ఇక బయటికి వచ్చి ఏమీ తెలియనట్టు కూర్చోవడంతో బాలు దొంగగా తినే వాళ్ళకి మోషన్స్ అవుతాయి అది ఇది అనడంతో ప్రభావతి షాక్ అవుతుంది. నేను ఇక మీద నుంచి డైట్ ఫాలో అవుతాను నన్ను ఎవరు ఇబ్బంది పెట్టద్దు అని ప్రభావతి అనగానే అందరూ కూడా కాస్త నవ్వుకుంటారు.. ఇక మనోజ్ కి చింటూ దగ్గరవడం చూసిన సుగుణమ్మ వీళ్లిద్దరూ కలిసిపోవాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడేమో అని ఆలోచిస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : మహా ఎంట్రీ అదుర్స్.. తాయారుకు దిమ్మతిరిగే షాక్.. మళ్లీ దొరికిపోయిన చక్రీ..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×