E-Paper
Advertisement

అందం కోసం ఫ్రెండ్స్ చర్మాన్ని ఒలిచే సైకో పిల్ల… తినేటప్పుడు మాత్రం ఈ సినిమాను చూడొద్దు

అందం కోసం ఫ్రెండ్స్ చర్మాన్ని ఒలిచే సైకో పిల్ల… తినేటప్పుడు మాత్రం ఈ సినిమాను చూడొద్దు
Advertisement

Body Horror Thriller: అందం కోసం అమ్మాయిలు ఏమైనా చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ పక్క అమ్మాయిల చర్మం వలిచి, తమకు అతికించుకుంటారు అన్న విషయం తెలుసా ? నిజానికి అది సాధ్యం కాదనుకోండి. కానీ కనీసం చంపేదాకా వెళతారు అని ఊహించగలరా ? ఒకమ్మాయి నిజంగానే నిగనిగా మెరిసే చర్మం కోసం ఇంతటి ఘాతుకానికి పాల్పడుతుందా ? అంటే… ‘గ్రాఫ్టెడ్’ (Grafted) సినిమాను చూశాక అవుననే సమాధానం చెప్తారు. మరి 2024లో విడుదలైన ఈ అంతర్జాతీయ బాడీ హారర్-థ్రిల్లర్ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

చైనాకు చెందిన వీ (జోయెనా సన్) అనే ఒక అమాయకపు యువతి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. వీ ముఖంపై పుట్టుకతోనే ఒక వికారమైన పెద్ద మచ్చ ఉంటుంది. అది చర్మ సంబంధిత లోపం అని చెప్పవచ్చు. సరిగ్గా అలాంటి లోపమే ఆమె తండ్రికి కూడా ఉంటుంది. సైంటిస్ట్ అయిన ఆమె తండ్రి, తన కూతురు సమాజంలో అవమానాలు పడకూడదని చర్మాన్ని పూర్తిగా పునర్నిర్మించే (Skin Grafting) ఒక విప్లవాత్మకమైన కెమికల్ సీరమ్‌ ను తయారు చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ప్రయోగం వికటించడంతో బెడిసికొడుతుంది.

Advertisement

ఒకరోజు రాత్రి ఆ సీరమ్‌ ను తనపైనే ప్రయోగించుకుంటాడు. అది వికటించి చర్మం అదుపు లేకుండా పెరిగి ఊపిరాడక ఆయన అక్కడికక్కడే మరణిస్తాడు. తండ్రి మరణం తర్వాత వీ తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతుంది. తన తండ్రి ఆశయమైన ఆ స్కిన్ గ్రాఫ్టింగ్ ప్రయోగాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలని, ఆయన రీసెర్చ్ బుక్‌ ను దాచుకుంటుంది. తరువాత న్యూజిలాండ్‌ కు ప్రయాణం అవుతుంది ఆ అమ్మాయి.

ఉన్నత చదువుల కోసం వీ న్యూజిలాండ్‌ లోని ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీకి స్కాలర్‌ షిప్‌ పై వెళ్తుంది. అక్కడ తోటి విద్యార్థులు జెస్ హాంగ్, ఈడెన్ హార్ట్ ఈ అమ్మాయిని ఆడుకుంటాడు. ఆమె ముఖంపై ఉన్న మచ్చను చూసి వాళ్ళు హేళన చేస్తారు. అంతేకాదు ఆమెను అవమానిస్తారు. దీంతో తాను కూడా అందంగా మారి, అందరిలాగే పాపులారిటీ సంపాదించాలనే కోరిక ఆమెలో బలంగా నాటుకుంటుంది. దీంతో క్రూరమైన ప్రయోగాలకు పాల్పడుతుంది.

Advertisement

వీ తన కాలేజ్ ల్యాబ్‌ లోనే రహస్యంగా తండ్రి ప్రయోగాన్ని మళ్లీ మొదలు పెడుతుంది. అయితే ఈసారి ఆమె జంతువులపై కాకుండా, తోటి అందమైన అమ్మాయిల చర్మాన్ని కోసి, తన ముఖానికి అతికించుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ఒక సైకో కిల్లర్‌ గా మారుతుంది. కాలేజీలో తనను ఇబ్బంది పెట్టిన ఒక్కొక్కరిని కిడ్నాప్ చేసి, వారి చర్మాన్ని బతికుండగానే ఒలిచి క్రూరమైన ప్రయోగాలు చేస్తుంది. వీ అనుకున్నట్లుగా ఇతరుల చర్మంతో తను అందంగా మారిందా ? ఆమె చేస్తున్న ఈ ఘోరమైన నరమేధం కాలేజీలో మిగతా వారికి ఎలా తెలిసింది ? చివరకు ఈ లేడీ సైకో శాస్త్రవేత్తకు ఎలాంటి శిక్ష పడింది ? అనే అత్యంత భయానకమైన బ్లడీ బాత్ ఈ మూవీ క్లైమాక్స్.

ఈ సినిమా JioHotstarలో తెలుగు డబ్బింగ్ ఆడియోతో అందుబాటులో ఉంది. అంతేకాకుండా గ్లోబల్ హారర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన Shudder లో కూడా ఇది ఒరిజినల్ వెర్షన్‌లో లభిస్తోంది. న్యూజిలాండ్‌ దర్శకురాలు సాషా రెయిన్‌బో తెరకెక్కించిన ఈ సైంటిఫిక్ బాడీ హారర్ చిత్రం, సమాజంలో అందం కోసం ప్రాకులాడే మనుషుల మనస్తత్వాన్ని, ఒక సైకో అమ్మాయి క్రూరత్వాన్ని వెన్నులో వణుకు పుట్టించేలా చూపించింది.

Read Also: ప్రయోగం బెడిసి కొట్టి సూపర్ పవర్స్… మార్వెల్, డీసీ సూపర్ హీరోలను మరిపించే సిరీస్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×