E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతిని అనుమానించిన సత్యం.. రెచ్చిపోయిన ప్రభా.. బుక్కయిన రోహిణి..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతిని అనుమానించిన సత్యం.. రెచ్చిపోయిన ప్రభా.. బుక్కయిన రోహిణి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు గొప్ప పని చేశాడు అదేంటో నీకు తెలీదా అని రవి శృతిలు అనగానే.. ప్రభావతి ఎవరితోనో గొడవ పెట్టుకుని ఉంటాడు అని బాలుని తిడుతూ ఉంటుంది.. అప్పుడే ఇంట్లోకి వచ్చిన బాలు ఒక బిడ్డ తల్లిని కాపాడిన విషయాన్ని చెప్తాడు. తను కాపాడిన తీరును వివరించడంతో అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ ఈ కన్నీళ్లు పెట్టుకుంటారు.. బాలు చేసిన మంచి పని పై సత్యం ప్రశంసలు కురిపిస్తాడు. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది రా చాలా గొప్ప పని చేశావు అని సత్యం అంటాడు. అందరూ బాలుని మెచ్చుకుంటుంటే ప్రభావం మాత్రం ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపులో వస్తున్నాయి డెలివరీలవుతున్నారు. నా ఇంట్లో ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు వినాలో అని అంటుంది. బాలు చేసిన పని వల్ల మంచే జరుగుతుంది. నువ్వేం బాధపడకు ఏమో ఈ పుణ్యం వల్ల మన ముగ్గురు కోడలు ఒకేసారి తల్లికి వచ్చేమో చెప్పలేం కదా.. అని సత్యం అంటాడు.. శృతికి మీనా రోహిణి రెండోసారి ప్రెగ్నెంట్ కావడానికి హాస్పిటల్ కి వెళ్ళింది అని చెప్పడంతో అది కాస్త ఇంట్లో పెద్ద రచ్చకి దారితీస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా చెప్పిన రోహిణి రహస్యం బాలుకు తెలుస్తుంది. బాలు మాత్రం అస్సలు ఆగలేడు. వెళ్లి సత్యంతో ఈ విషయాన్ని చెప్తాడు.. ఇది నాకు మింగుడు పడడం లేదు రా అని సత్యం అంటాడు. ఎలాగైనా సరే ఈ నిజాన్ని మన నిజమో కాదో తెలుసుకోవాలి అని బాలు అనుకుంటాడు.. ఇక సత్యం వెళ్లి ప్రభావతి చెవిలో ఊదుతాడు.. మన ఇంటి కోడలు మీద ఇలాంటి నిందలు వేయడం పాపమండి అని ప్రభావతి మొదట నమ్మదు.. ఆ తర్వాత సత్యం అవును కదా తెలుసుకుందామని అనడంతో ప్రభావతి నమ్ముతుంది.. అసలేం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటుంది.

Advertisement

నువ్వు చెప్పు ప్రభ నీకు తెలిసే ఇదంతా జరిగిందా..? నీకు ఈ విషయం తెలియకుండానే ముద్దుల కోడలని నెత్తిన పెట్టుకున్నావా? ఏంటి ఇదంతా నువ్వు దీని గురించి కనుక్కోకుండానే పెళ్లి చేసావా అని సత్యం ప్రభావతిని అనుమానిస్తాడు.. ఆ మాటకు ప్రభావతి షాక్ అవుతుంది.. మీరు నన్నే అనుమానిస్తున్నారా..? నేను ఈ విషయాన్ని తట్టుకోలేకపోతున్నాను. రెండోసారి ప్రెగ్నెంట్ అవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు వెంటనే ఈ విషయాన్ని తెలుసుకోవాలి అని ప్రభావతి అంటుంది. ఆ మాట వినగానే సత్యం ఇప్పుడెందుకు చాలా కూల్ గా నువ్వే పక్కకు పిలిచి అడగొచ్చు కదా అని అంటాడు. మెల్లగా అడగొచ్చులే ఇప్పుడే ఎందుకు అని సత్యం అన్న కూడా ప్రభావతి మాత్రం వినకుండా రోహిణిని అడగాలని వెళ్తుంది.

ప్రభావతి రోహిణి రూమ్ దగ్గరకు వెళ్లి రోహిణి అని గట్టిగా అరుస్తుంది. అయితే మనోజ్ వచ్చి ఏంటమ్మా అరుస్తున్నావేంటి ఏమైంది రోహిణి గురించి ఏం తెలుసుకోవాలి అని అంటాడు.. ముందు నీ పెళ్ళాన్ని బయటకి పిలుస్తావా లేదా అని అడుగుతుంది.. రోహిణి ఏమైంది అత్తయ్య ఎందుకు కోపంగా ఉన్నారు అని అడుగుతుంది.. ఇదంతా మ్యాటర్ కాదు ముందు కిందికి వెళ్లి అసలు విషయం ఏంటో తేల్చుకోవాలి పదా అని.. రోహిణిని బలవంతంగా ప్రభావతి కిందకు తీసుకొని వస్తుంది. నువ్వు రెండోసారి గర్భం కోసం హాస్పిటల్ కి వెళ్ళావా లేదా అని కొట్టినట్లు అడిగేస్తుంది ప్రభావతి.. నువ్వు రెండోసారి తల్లివి అయ్యావా లేదా అని అడుగుతుంది..

Advertisement

Also Read :‘పొదరిల్లు’ మహా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..? తండ్రి ఏం చేస్తాడంటే..?

అసలు మొదటి బిడ్డకు తండ్రి ఎవరు? ఎవరితో కన్నావు పెళ్లికి ముందు కన్నావా? పెళ్లి తర్వాత కన్నావా ఆ బిడ్డ ఎక్కడ అని ప్రభావతి రోహిణిని గుక్క తిప్పుకొనివ్వకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి అడ్డంగా ఇరికించేస్తుంది.. అయితే ఓరి దేవుడో అడ్డంగా ఇరుక్కుపోయాను కదా అని రోహిణి అనుకుంటుంది.. అసలేం జరుగుతుంది అర్థం కావట్లేదు ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? ఏం చెప్పి తప్పించుకోవాలి అని రోహిణి అనుకుంటుంది.. ఇక రోహిణిని గట్టిగా అడగడంతో అసలు నిజాన్ని కక్కేస్తుంది.. మొదటిసారి ప్రెగ్నెంట్ అయ్యాను అని గట్టిగా అరుస్తుంది.. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు.. ఏంటి ప్రెగ్నెంట్ అయ్యావా అయితే మనోజ్ వల్లే అయ్యావా లేక ఇంకెవరైనానా అని అంటుంది ప్రభావతి.. మొత్తానికి రోహిణి అయితే తన రెండవ ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్ కి వెళ్ళిన విషయం అయితే బయటపెడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో రోహిణి చింటూ గురించి బయట పెడుతుందా లేదా అన్నది చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×