E-Paper
Advertisement

Family Drama OTT : పర్సు ఖాళీ… ఉండడానికి ఇల్లు లేదు… ఇది సినిమా కాదు ఒక ఎమోషన్

Family Drama OTT : పర్సు ఖాళీ… ఉండడానికి ఇల్లు లేదు… ఇది సినిమా కాదు ఒక ఎమోషన్
Advertisement

Family Drama OTT : హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించిన ఒక అద్భుతమైన బయోపిక్ ఓటీటీలో ఉంది. ఇది అందరూ చూడాల్సిన సినిమా. కటిక పేదరికం నుండి ఒక విజయవంతమైన స్టాక్ బ్రోకర్‌గా ఎదిగే ఒక వ్యక్తి కథ ఇది. ఇందులో విల్ స్మిత్ కొడుకుగా అతని సొంత కుమారుడు జేడెన్ స్మిత్ నటించాడు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆశ కోల్పోకుండా ప్రయత్నిస్తే విజయం లభిస్తుందని ఈ సినిమా చూపిస్తుంది. ఈ సినిమా క్రిస్ గార్డనర్ అనే వ్యక్తి రాసిన ఆత్మకథ ఆధారంగా రూపొందింది. ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన పరిస్థితులను, అంటే రైల్వే స్టేషన్ బాత్‌రూమ్‌లలో పడుకోవడం నుండి కోటీశ్వరుడు అయ్యే వరకు సాగిన ప్రయాణాన్ని ఇందులో చూపించారు. ఈ సినిమా పేరు, ఎందులో చూడవచ్చు అనే విషయాలను తెలుసుకుందాం.

ఎందులో చూడవచ్చు

‘ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’ (The Pursuit of Happyness) 2006లో విడుదలైన అమెరికన్ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం. ఇది గాబ్రియేల్ ముసినో దర్శకత్వంలో వచ్చింది. ఇందులో విల్ స్మిత్ సేల్స్ మాన్ క్రిస్ గార్డనర్ పాత్రలో నటించారు. స్మిత్ కుమారుడు జాడెన్ స్మిత్ సినీ రంగ ప్రవేశం చేసాడు. ఈ చిత్రం 2006 డిసెంబరు 15న కొలంబియా పిక్చర్స్ ద్వారా విడుదలైంది. ఇక తన నటనకు గాను స్మిత్ అకాడమీ అవార్డుకు, గోల్డెన్ గ్లోబ్‌కు నామినేట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా zee5 లో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1981లో శాన్ ఫ్రాన్సిస్కోలో నివసించే క్రిస్ గార్డనర్ అనే వ్యక్తి మెడికల్ స్కాన్ మిషన్లను అమ్మే వ్యాపారంలో తన పొదుపు డబ్బును పెట్టుబడిగా పెడతాడు. కానీ అవి సరిగ్గా అమ్ముడుపోవు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురై, భార్య అతన్ని విడిచి వెళ్లిపోతుంది. ఐదేళ్ల కొడుకు బాధ్యత క్రిస్ మీద పడుతుంది. అద్దె కట్టలేక ఇల్లు ఖాళీ చేయాల్సి రావడంతో, తండ్రీకొడుకులు రోడ్డున పడతారు. రైల్వే స్టేషన్ బాత్‌రూమ్‌లు, చర్చిలు, పేదల వసతి గృహాల్లో పడుకుంటూనే, క్రిస్ ఒక పెద్ద స్టాక్ బ్రోకింగ్ సంస్థలో జీతం లేని ‘ఇంటర్న్‌షిప్’ కోసం ఎంపికవుతాడు. 20 మందిలో ఒక్కరికి మాత్రమే ఉద్యోగం వచ్చే ఆ కఠినమైన పోటీలో, అడుగడుగునా కష్టాలు ఎదురైనా తన కొడుకుపై ఉన్న ప్రేమతో క్రిస్ పోరాడుతూనే ఉంటాడు.

క్రిస్ పగలు ఆఫీసులో కష్టపడి పనిచేస్తూ, రాత్రిపూట తల గాయచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడతాడు. తన దగ్గర డబ్బు లేదని, ఇల్లు లేదని కొడుకుకి తెలియకుండా అతన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాడు. చివరకు తన తెలివితేటలు మరియు పట్టుదలతో అందరికంటే ఎక్కువగా కష్టపడి, ఆ స్టాక్ బ్రోకింగ్ సంస్థలో ఉద్యోగాన్ని సాధిస్తాడు. ఉద్యోగం వచ్చిన ఆ క్షణంలో క్రిస్ కళ్ళలో వచ్చే నీళ్లు, అతను అనుభవించిన సంతోషం ప్రేక్షకులను కదిలిస్తాయి. ఒక పేదవాడు కోటీశ్వరుడిగా మారిన ఒక తండ్రి నిజమైన పోరాటమే ఈ సినిమా.

Advertisement

Read Also : అనుమానాస్పద స్థితిలో భర్త మృతి… ట్విస్టులతో పిచ్చెక్కించే బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×