// // Gundeninda GudiGantalu Today episode: బాలు వద్దన్నా గుడికి వెళ్లిన మీనా.. శివ ఫుల్ హ్యాపీ.. ప్రభావతి మాటతో బాలు షాక్.. -->
E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలు వద్దన్నా గుడికి వెళ్లిన మీనా.. శివ ఫుల్ హ్యాపీ.. ప్రభావతి మాటతో బాలు షాక్..

Gundeninda GudiGantalu Today episode: బాలు వద్దన్నా గుడికి వెళ్లిన మీనా.. శివ ఫుల్ హ్యాపీ.. ప్రభావతి మాటతో బాలు షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. గుణ ఒకరింటికి వెళ్లి అక్కడ డబ్బులు వసూల్ చేయాలని అంటాడు. తన భార్యతో మీ ఆయన తొందరగా పిలిస్తే మేము వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోతాము అని అంటారు. ఆ మాట వినగానే ఆవిడ భయపడిపోయి వాళ్ళ ఆయనకు ఫోన్ చేస్తుంది. అతను గుణ పేరు చెప్పగానే వెంటనే ఇంటికి వచ్చేస్తాడు. బాలు కారులోనే అతని ఇంటికి రావడంతో అతను బ్యాగు మర్చిపోయాడని బాలు ఆ బ్యాగ్ ని లోపలికి తీసుకెళ్తాడు. గుణ డబ్బులు కావాలి అని అడుగుతాడు.. వెంటనే ఇవ్వాలని ఒత్తిడి చేస్తాడు. అప్పుడే అక్కడకు వచ్చిన బాలు గుణను తిడుతుంది. ఇలాంటి వాళ్ల దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారు మీరు.

వీడొక రౌడీ డబ్బులు దోచుకుంటాడు.. మనుషుల ప్రాణాలని వడ్డీ పేరుతో లాగేసుకుంటాడు. బాలు అడుగుతాడు.. నేను ఒక లక్ష 50 వేల వరకు తీసుకున్నాను అని అతను అంటాడు. ప్రతి నెల వడ్డీ ఇస్తున్నాం కదా అయిన కూడా అతను మమ్మల్ని లేదు. మీరు ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మోసపోతే మిమ్మల్ని వెళ్ళు దోచుకుంటారు జలకలాగా రక్తం పీల్చేస్తారు. ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది అని బాలు అంటారు. పోలీసులకు ఫోన్ చేస్తే వీడు దారిలోకి వస్తాడని బాలు చెప్పడంతో గుణ అక్కడి నుంచి ఎవరికి ఫోన్ చేయొద్దు అని వెళ్ళిపోతాడు. శివ పుట్టినరోజు కాబట్టి బాలుని కూడా గుడికి తీసుకెళ్లాలని మీనా అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శివ బర్త్ డే సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి మీనా తన పుట్టింటికి వెళ్తుంది. అక్కడ శివ నువ్వు సంతోషంగా ఉన్నా కూడా బాలును పిలిస్తే నేను రాను అని అంటాడు.. నువ్వు వెళ్ళాలి అనుకుంటే నువ్వు వెళ్ళు కానీ నాకు విలువ ఇవ్వని వాడి దగ్గరికి నేను వెళ్ళను అని బాలు అంటాడు.. కానీ మీనా మాత్రం మా అమ్మ మిమ్మల్ని పదేపదే రమ్మని పిలిచింది మీరు రావాలి అని అడుగుతుంది. బాలు మాత్రం నాకు విలువ లేని విలువ ఇవ్వని చోటికి నేను వెళ్ళను అని అంటాడు. వాడు ఇంకా మారలేదు ఆ గుణ గాడి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు అని బాలు ఎంత చెప్పినా సరే మీనా మాత్రం తన తమ్ముడు తప్పే చేస్తున్నాడు కానీ మనం చేయాల్సింది మనం చేయాలి కదా అని అంటుంది.

ఎన్నైనా చెప్పు మీనా నేను మాత్రం వాడి కోసం గుడికి రాను నువ్వు కూడా వెళ్ళద్దు అని కండిషన్ పెడతాడు బాలు.. పార్వతీ సుమతి మీనా బాలు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే మీ నాకు ఫోన్ చేస్తే నేను రాలేనమ్మ నాకు పని ఉంది అని అంటుంది. శృతి మాత్రం మీన దగ్గరకు వచ్చి పుట్టింటి వాళ్ళని వదిలేస్తామా ఏంటి నువ్వు వెళ్లి మీ వాళ్ళతో గడిపి రా.. బాలు అర్థం చేసుకుంటాడు అని అంటుంది. కానీ మీరు మాత్రం బాలుకు తెలిస్తే ఏదైనా అంటాడేమో అని భయపడుతూ ఉంటుంది. శృతి చెప్పడంతోనే మీనా గుడికి వెళుతుంది. మీనా వచ్చిందని శివ చాలా సంతోషంగా ఉంటాడు..

Advertisement

అందరూ కలిసి ప్రసాదం పంచుతున్నారు.. అప్పుడే బాలు ఇంటికి వచ్చి మీనా అని పిలుస్తాడు. అయితే మీనా ఇంట్లో లేకపోవడంతో ప్రభావతి బాలు దగ్గరికి వచ్చి అది ఇంట్లో లేదు అని అంటుంది.. ఇంట్లో లేదా పూలు ఇవ్వడానికి వెళ్లిందా ఏంటి అని అడుగుతారు. పూలు ఇవ్వడానికి కాదురా వాళ్ళ పుట్టింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అని ప్రభావతి అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అమ్మా కొంచమైనా నీకు ఉందా అని బాలు ప్రభావతి పై సీరియస్ అవుతాడు. తను నా మాట కాదని బయటికి వెళ్ళదు నేను వద్దని చెప్పినా తను వెళ్ళదు అని ప్రభావతితో గొడవపడతాడు బాలు. కానీ ప్రభావతి మాత్రం నా మాట మీద నీకు నమ్మకం లేకపోతే వెళ్లి గుడికి వెళ్లి చూడరా అని బాలుని ప్రభావతి గుడికి పంపిస్తుంది.

మీనా అందరికీ ప్రసాదం పంచుతూ ఉంటుంది కానీ బాలుకు తెలిస్తే సీరియస్ అవుతాడని నేను వెళ్ళిపోతాను అని ఎంతగా అన్నా సరే పార్వతి మాత్రం కాసేపు ఆగి వెళ్ళవే అని అంటుంది. అయితే అప్పుడు అక్కడికి వచ్చిన బాలు మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది. నేను చచ్చిపోయానని ఇక్కడికి వచ్చావా అని బాలు అనగానే మీనా అవేం మాటలు అండి అలా మాట్లాడుతున్నారు అని అంటుంది. నా మాటంటే లెక్కలేయకుండా నువ్వు ఇక్కడికి వచ్చావు. అంటే నేను అన్నా నా మాట నీకు విలువ లేదు కదా అని బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Also Read :ప్రేమపై ధీరజ్ సీరియస్.. శ్రీవల్లి పై చందుకు అనుమానం.. నర్మద సాగర్ రొమాన్స్..

అయితే మీనా ప్రసాదం తీసుకొని ఇంటికి వస్తుంది. సత్యంకు గుడికి వెళ్లి ప్రసాదం తీసుకొచ్చాను మామయ్య అని ఇస్తుంది. బాలు వచ్చాడా అంటే వచ్చాడు మామయ్య అని అంటుంది. ఆ తర్వాత శృతి గుడికి వెళ్లొచ్చావు కదా ఏం ప్రాబ్లం లేదు కదా అని అంటుంది.. ఒకవైపు కన్నీళ్లు వస్తున్నా ఆపుకుంటూ మీనా ఏం సమస్య లేదు శృతి అని అంటుంది. ఆ తర్వాత ప్రభావతి ప్రసాదం ఇస్తే తీసుకోదు. నువ్వు మీ ఇంటి నుంచి తీసుకొచ్చింది నాకు ఏదైనా సరే విషంతో సమానం. వాడు నీకోసం గుడి వచ్చాడు నేనే పంపించాను అని ప్రభావతి అసలు నిజాన్ని బయటపెడుతుంది. అది విన్న మీనా షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×