E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణిపై అనుమానం.. బాలు, మీనా రొమాన్స్..మరో తప్పు చేసిన మనోజ్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణిపై అనుమానం.. బాలు, మీనా రొమాన్స్..మరో తప్పు చేసిన మనోజ్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. సుమతి ఎంత చెప్తున్నా సరే మీనా మాత్రం తను నాకు తోడు కోడలు అంటే నాకు సొంత అక్కతో సమానం. తను ప్రెగ్నెంట్ కాబోతుంది అంటే నాకే కదా సంతోషమని మీనా అంటుంది. అయితే ఈ విషయాన్ని ఎలాగైనా సరే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి అందరిని సంతోషంగా ఉండేలా చూడాలి అని అనుకుంటుంది మీనా.. వెంటనే ఇంటికి వెళ్లి కేసరి చేస్తుంది.  ఏంటి మీనా ఇవాళ కేసరి చేస్తున్నావ్ అని బాలు అడుగుతాడు.. మీకు ఒక రెండు గుడ్ న్యూస్ లు ఉన్నాయి వాటి గురించి నేను కాసేపట్లో చెప్తాను అని మీనా అంటుంది. ఏంటి తొందరగా చెప్పు లేకపోతే ఆ కేసరిని మింగేస్తుంది లక్షవతి వచ్చి అని బాలు అంటాడు.

మీనా మీరు ఊరుకోండి ప్రతి చిన్న విషయానికి ఏదో ఒకటి అంటూ ఉంటారు అని అంటుంది. అప్పుడే ఏదో గుమగుమ వాసన వస్తుందే అని ప్రభావతి  వస్తుంది.. ఆ లక్షలు మింగినోడు రాలేదు కదా.. వాడు వచ్చిండంటే ఈ కేసరిని మొత్తం తినేస్తాడు అని బాలు.. రోహిణి తల్లి కాబోతుంది. ఈ గుడ్ న్యూస్ ని అందరితో షేర్ చేసుకోవాలని స్వీట్ చేశానని అంటుంది.. ఆ మాట వినగానే షాక్ అయినా రోహిణి మౌనంగా ఉంటుంది.. అయితే ప్రభావతి మాత్రం సంతోషంతో గాల్లో తేలిపోతుంది. రోహిణి మాత్రం నేను తల్లి కాలేదు తల్లి కాకపోవడానికి కారణాలేంటి తెలుసుకోవాలని అనుకున్నాను అని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మనోజ్ బాధపడుతుంటే ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్లి నా కొడుకు ఇలాంటి వాడు నాకు తెలుసు. నువ్వు ముందు వాడికి సారీ చెప్పు అని అంటుంది. నేనే తప్పు చేయలేదు నేను మీ కొడుకు తప్పు చేయలేదని చెప్పమనండి నేను అప్పుడు సారీ చెప్తానని రోహిణి అంటుంది.. ప్రభావతి మనోజ్ మాత్రం రోహిణి ఏదో దాస్తుంది తన గతం గురించి మనం తెలుసుకోవాలి అని ప్రభావతి అంటుంది.. ఇంత త్వరగా తను పిల్లల కనాలి అని అనుకుంటుందంటే ఏదో ఉంటుంది. నువ్వు తన గతం గురించి తెలుసుకొని రోహిణి యొక్క మేటర్ ఏంటో తేల్చుకోవాలి అని ప్రభావతి అంటుంది. రోజు అలాగే అమ్మ రోహిణిని అడిగి మెల్లగా తెలుసుకుంటాను అని అంటాడు..

బాలు లెక్కపెడుతుంటే మీనా తలలో మల్లెపూలు పెట్టుకుని పైకి వెళుతుంది.. కానీ బాలు మాత్రం మీనాన్ని పట్టించుకోకుండా డబ్బులు లెక్క పెడుతూ ఉంటాడు.. పైన చల్లగాలి వెన్నెల ఉన్నాయి అని ఎంత బాలుని రెచ్చగొట్టాలని చూసిన సరే బాలు మాత్రం డబ్బులు గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. తలలో మల్లెపూలు ఉన్నాయి కనీసం కనిపించలేదా అని ఎంతగా మీనా రెచ్చగొట్టిన సరే బాలు మాత్రం లొంగడు.. రోహిణి వాళ్ళు హాస్పిటల్ కి వెళ్లి చూపించుకోవాలనుకున్నారు కదా మనం కూడా పిల్లలకనే ఆలోచన మొదలు పెడదామా అని మీనా అంటుంది. ఇప్పటికే అన్ని చూసుకోలేక చచ్చిపోతున్నాను. ఇప్పుడు మళ్లీ పిల్లలంటే మన సంపాదించేదంతా వాళ్ళ డైపర్లకే సరిపోతుంది అని బాలు అంటాడు. ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదు మనం గది కట్టుకున్న తర్వాత ఆ తర్వాత మొదలు పెడదాము అని బాలు అంటాడు.

Advertisement

కానీ మీనా మాత్రం బాలు పై చిరుబుర్రులాడుతుంది. మొత్తానికి బాలు అయితే మీనా దారిలోకి వచ్చేస్తాడు వీళ్లిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ హైలెట్ గా మారుతాయి.. ఆ తర్వాత బాలు సర్వీస్ కిస్తే కారుని సరిగ్గా సర్వీస్ చేయలేదు అంటూ సత్యంతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మనోజ్ అక్కడికి వచ్చి రోహిణి అని గట్టిగా కేకలేస్తూ పిలుస్తాడు. ఏంట్రా ఏవో కొనుక్కొని వచ్చావు అని ప్రభావతి అంటుంది. రోహిణి రాని అమ్మ చెప్తాను అని అంటాడు. ఆ స్వామిజిని నమ్ముకుని ఏవో షాపింగ్ చేసి వచ్చినట్టున్నావు కదా అని మనోజ్ ను బాలు అవమానిస్తాడు..

కానీ బాలు మాత్రం ఏమంటున్న సరే మనోజ్ మౌనంగా ఉండడంతో పాటుగా రోహిణి రాగానే తనకి పుస్తెలతాడును విడిపించుకుని తీసుకొచ్చినట్లు చెప్తాడు.. ఆ మాట వినగానే రోహిణి చాలా సంతోషపడుతుంది. ప్రభావతి కోసం పాతికవేల చీరని గిఫ్ట్ గా తీసుకుని వచ్చి ఇస్తాడు మనోజ్. సత్యం కి మొదట వాచ్ తీస్తే ఆ వాచి అతను ఎందుకు పెట్టుకుంటాడు అని ప్రభావతి అవమానించేలా మాట్లాడుతుంది.. నాన్న కోసం కాదు నాకోసం అని మనోజ్ అంటాడు. సత్యం కోసం కేవలం కండువ మాత్రమే తీసుకురావడంతో బాలు సీరియస్ అవుతాడు.

Also Read :మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మాత్రం మిస్ అవ్వకండి..

ఇక తర్వాత గుణ ఒకరింటికి వెళ్లి అక్కడ డబ్బులు వసూలు చేయాలని అంటాడు. తన భార్యతో మీ ఆయన తొందరగా పిలిస్తే మేము వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోతాము అని అంటారు. ఆ మాట వినగానే ఆవిడ భయపడిపోయి వాళ్ళ ఆయనకు ఫోన్ చేస్తుంది. అతను గుణ పేరు చెప్పగానే వెంటనే ఇంటికి వచ్చేస్తాడు. బాలు కారులోనే అతని ఇంటికి రావడంతో అతను బ్యాగు మర్చిపోయాడని బాలు ఆ బ్యాగ్ ని లోపలికి తీసుకెళ్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో బాలు శివని గుణతో చూస్తాడా లేదా అన్నది చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×