E-Paper
Advertisement

Comedy Web Series OTT : 25 ఏళ్లుగా క్రైమ్ అంటే ఏంటో తెలియని గ్రామం… బైక్‌ మిససవ్వడంతో గడబిడ… కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్

Comedy Web Series OTT : 25 ఏళ్లుగా క్రైమ్ అంటే ఏంటో తెలియని గ్రామం… బైక్‌ మిససవ్వడంతో గడబిడ… కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్
Advertisement

Comedy Web Series OTT : ఓటీటీలో వెబ్ సిరీస్ ల హవా కొనసాగుతూనే ఉంది. రక రకాల కథలతో ఆడియన్స్ ని మెప్పించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక కామెడీ వెబ్ సిరీస్ గత ఏడాది హల్చల్ చేసింది. ప్రశాంతమైన గ్రామం నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో మోటార్‌బైక్ దొంగతనంతో గందరగోళం మొదలవుతుంది. అసలు ఆ బైక్ ఏంటి ? ఆ గందరగోళం ఎలా ఉంటుంది ? ఈ సిరీస్ పేరు ఏమిటి ? అనే విషయాలపై ఓ లుక్ వేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

బీహార్‌లోని ధడక్‌పూర్ అనే ఒక గ్రామం నేపథ్యంలో సాగే ఈ కామెడీ వెబ్ సిరీస్ పేరు ‘దుపహియా’ (Dupahiya). దీనిని అవినాష్ ద్వివేది, చిరాగ్ గార్గ్, సలోనా బైన్స్ జోషి, శుభ్ శివదాసాని రూపొందించారు. ఈ హిందీ కామెడీ టెలివిజన్ సిరీస్లో గజరాజ్ రావు, రేణుకా షహానే, స్పర్ష్ శ్రీవాస్తవ, శివాని రఘువంశీ, భువన్ అరోరా ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2025 మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి సీజన్ హిట్ అవ్వడంతో రెండవ సీజన్ పై కూడా దృష్టి పెట్టారు మేకర్స్.

Advertisement

Read Also : థియేటర్లలో సంచలనం సృష్టించిన మలయాళం హారర్ ఫాంటసీ మూవీ ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు ?

కథ ఏమిటంటే

ధడక్‌పూర్ అనే గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. గత 25 ఏళ్లుగా అక్కడ ఒక్క నేరం కూడా నమోదు కాలేదు. ఆ ఊరిని నేర రహిత గ్రామంగా అందరూ పిలుచుకుంటారు. అయితే బన్వారీ ఝా అనే వ్యక్తి తన కుమార్తె రోష్ని పెళ్లి కోసం సిద్ధమవుతున్నప్పుడు ఈ ప్రశాంతత చెదిరిపోతుంది. రోష్నిని పెళ్లి చేసుకోబోయే కుబేర్ అనే వ్యక్తి, కట్నంగా ఒక ఖరీదైన బైక్ కావాలని డిమాండ్ చేస్తాడు. బన్వారీ ఝా ఎంతో కష్టపడి ఆ బైక్‌ను కొంటాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ వస్తుంది. పెళ్లికి కేవలం ఎనిమిది రోజుల ముందు, ఆ బైక్ అనూహ్యంగా దొంగతనానికి గురవుతుంది.

Advertisement

ఇక ఆ బైక్‌ను వెతికే బాధ్యతను రోష్ని తమ్ముడు భూగోల్, రోష్ని మాజీ ప్రేమికుడు అమావాస్ తీసుకుంటారు. ఒక పక్క బైక్ దొంగను వెతకడం, మరోపక్క పెళ్లి ఏర్పాట్లు చేయడం మధ్య జరిగే కామెడీ సంఘటనలతో ఈ సిరీస్ నడుస్తుంది. చివరకు ఆ బైక్ ను ఎవరు దొంగిలించారు? రోష్ని పెళ్లి జరిగిందా? ఆమె తన మాజీ ప్రేమికుడితో కలిసిందా? అనేది క్లైమాక్స్‌లో తెలుస్తుంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×