E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: శృతి, మీనాను సత్యం షాక్.. రోహిణి గురించి నిజం తెలుస్తుందా..? ప్రభావతికి అనుమానం..

Gundeninda GudiGantalu Today episode: శృతి, మీనాను సత్యం షాక్.. రోహిణి గురించి నిజం తెలుస్తుందా..? ప్రభావతికి అనుమానం..
Advertisement

Gundeninda GudiGantalu Today episode February 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి పై మనోజ్ కు అనుమానం వస్తుంది. అయితే రోహిణి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది.. రవి పల్లి చెక్క చేస్తాడు దాన్ని టేస్ట్ చేసిన శృతి చాలా బాగుంది అని మెచ్చుకుంటుంది.. మీనాకి కూడా ఒకటి టేస్ట్ చేయమని ఇస్తుంది. మీనా చాలా బాగుంది ఇది అమ్మితే ఇంకా బాగుంటుంది కదా అని అంటుంది. మనం రెస్టారెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటివి చేస్తే అందరూ ఇష్టపడతారు మన బ్రాండ్ కూడా ప్రమోట్ అవుతుంది అని రవి అంటాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి వీళ్ళు గొడవ పడుతున్నారు అని తెలుసుకొని చాలా సంతోషంగా ఉంటుంది.

మీనా బాలు ఇద్దరు కూడా సుగుణమ్మ కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ నర్స్ ఉండడం చూసి షాక్ అవుతారు ఏమైంది అని అడుగుతారు. ఈమెకి గుండె నొప్పి వచ్చిందండి అందుకే నేను ఏమైనా చూసుకోవడానికి వచ్చాను అని అంటుంది. ఇంత ఆరోగ్యం బాగోలేకపోతే మాకు ఒక మాట చెప్పొచ్చు కదా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని బాలు సుగుణమ్మని అడుగుతాడు.. మీరు ఎందుకు మమ్మల్ని పరాయి వాళ్ళ లాగా చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్న మీరు మాకు చెప్పట్లేదు అసలు చింటూ ఎక్కడున్నాడు అని సుగుణమని మీనా బాలు అడుగుతారు.. రోహిణి మాత్రం చింటూ ని ఎలాగైనా సరే బాలు వాళ్లకి దూరం చేయాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రోహిణి చింటూ కోసం స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలని వెళుతుంది. ఎంత ఖర్చయిన పర్వాలేదు నేను ఇస్తానని అంటారు.. ఈ విషయాన్ని సుగుణమ్మకు రోహిణి చెప్తుంది. అయితే ఆ మాట వినగానే సుగుణమ్మ చాలా సంతోషంగా ఉంటుంది. ఇకపోతే చింటూ గురించి ఆలోచిస్తూ ఉంటాడు బాలు ఇంటికి రాగానే మీనా మనం ఇంకా టైం తీసుకుని మరోసారి అడుగుదాం ఆల్రెడీ ఏమంటుందో చూద్దామని అంటారు.. ఇక శృతి మీనా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అత్తయ్య మనల్ని గొడవ పడట్లేదు అని అనుకుంటే ఏడుస్తుంది ఏమో అని అనుకుంటుంది.. సత్యం ప్రభ రా తిందాం అని అనగానే శృతి మీనా గొడవ పడుతున్నట్లు నటిస్తారు. మీరు మావిడిని మోసం చేస్తున్నారు మరి నేను ఆ మాత్రం మిమ్మల్ని మోసం చేయాలి కదా అని సత్యం అనగానే ఇద్దరు కూడా మావయ్య అని అంటారు..

సరే శృతి నీకు ఎంత కావాలో అంత తిను ఫ్రిజ్లో నీకోసం చేసిన జ్యూస్ ఉంది. తాగేసేయ్ నేను బయటికి వెళ్ళాలి అని నేను అంటుంది.. మీనా అందరి కోసం కష్టపడి ఇంతగా చేస్తుంది కదా మరి ఎందుకు ఆంటీ మీనాన్ని తిడుతూనే ఉంటుంది అని శృతి సత్యంని అడుగుతుంది. నేను ఒక పేదింటి అమ్మాయిని తీసుకొచ్చి ఏంటి కోడల్ని చేశాను.. అయితే ఆమెను సరిగ్గా చూసుకోవాలని ప్రభావతికి ఎన్ని సార్లు చెప్పినా కూడా నా మాట వినడం లేదు. మీనా కూడా ప్రభావతికి దగ్గర అవడానికి ఎన్ని సార్లు ప్రయత్నాలు చేసినా సరే ఆమె మాత్రం అస్సలు వినలేదు. ఇక ప్రభావతి నే తెలుసుకుంటే బాగుంటుంది అని సత్యం అంటాడు.

Advertisement

ఆ తర్వాత మనోజ్ షోరూంలో ఉండగా ఓ వ్యక్తి వచ్చి లెటర్ తెచ్చి ఇస్తాడు.. నువ్వు ఎవరు నాకెందుకు లెటర్ ఇస్తున్నావని మనోజ్ ఎంతగా అడుగుతున్నా సరే అతను మాత్రం చెప్పడు.. ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలని మనోజ్ చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ అతను మాత్రం ఆ లెటర్ ఏముందో చూడు అని అంటాడు.. ఇక మనోజు అతని బిల్లు కట్టి అతనితో నిజాలు చెప్పించుకోవాలని అనుకుంటాడు కానీ అక్కడి నుంచి అతను మాయం అయిపోతాడు.. ఆ పక్కన ఉన్న వ్యక్తి అతను ఒక దొంగ అని చెప్పడంతో మనోజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత మనోజ్ అతను ఎందుకు నాకు లెటర్ ఇచ్చారని ఆలోచిస్తూ ఉంటాడు.

Also Read :గురువారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

ఇక మీనా ప్రభావతి కోసం బిర్యాని తీసుకొని వెళుతుంది. అక్కడున్న పిల్లలు ఇద్దరు లవర్స్ మాత్రం ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కానీ ప్రభావతికి మాత్రం ఎక్కడా అనుమానం రాదు. అయితే మీనా ప్రభావతి కోసం తెచ్చిన బిర్యానిని కామాక్షి కూడా తినాలని అనుకుంటుంది. అయితే కామాక్షి చేసిన వంటని పక్కనపెట్టి మీనా వడ్డించిన బిర్యానీని ఇద్దరు ఫుల్లుగా లాగించేస్తారు.. బయట ఉన్న లవర్స్ ని చూసి మీనా జాగ్రత్తగా డాన్స్ నేర్చుకోండి లేదంటే మాత్రం బాగోదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది.. ప్రభావతి ఇంటికి వచ్చిన తర్వాత బిర్యాని ఫుల్లుగా తినడంతో ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. మీనా రాగానే బిర్యానీ ఎక్కడ నుంచి తెచ్చావు ఇదిగో హోటల్ బిల్లు అంటూ అంటుంది.. రోహిణి మాత్రం అత్తయ్య గారిని చంపాలనుకుంటున్నావా అని మీనాతో అనడంతో మీనా షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×