E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: సుగుణమ్మను కలిసిన బాలు.. రోహిణికి షాక్.. మీనా కాపురంలో రోహిణి చిచ్చు..

Gundeninda GudiGantalu Today episode: సుగుణమ్మను కలిసిన బాలు.. రోహిణికి షాక్.. మీనా కాపురంలో రోహిణి చిచ్చు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode February 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. బయటికి వెళ్లిన బాలు కస్టమర్ ని తీసుకుని వెళుతూ ఉంటాడు.. అతను మీకు పెళ్లయిందా అని అడుగుతాడు.. ఒకసారి తప్పక పెళ్లయింది అని బాలు అంటారు. ఏంటి మీ ఆవిడ గయ్యాలినా అంటే కాదు స్వీట్ పూలగంప అని అంటాడు.. అప్పుడే బాలు మీనా ఎదురుగా వచ్చి గుద్దేసుకుంటారు. అక్కడికి వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇక్కడ యాక్సిడెంట్ అయింది. ఎవరిది రాంగ్ రోడ్డు అని ఆలోచిస్తూ ఉంటాడు.. అయితే ఇద్దరూ కాసేపు పోట్లాడుకుంటారు. వీళ్ళిద్దరి గొడవ చూసి ఇక జీవితంలో పెళ్లి చేసుకోను అని అతను ఫిక్స్ అయిపోతాడు.. మీనా బాలు ఇద్దరు కూడా అతని మధ్యలో పెట్టేసి బాగా ఆడేసుకుంటారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైన్ కట్టమంటే మీనా ఆయన మా ఆయనే అని అంటుంది. మీరిద్దరూ మొగుడు పెళ్ళాల అయితే మా టైం ఎందుకు వేస్ట్ చేశారు అని కానిస్టేబుల్ సీరియస్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రోహిణి పై మనోజ్ కు అనుమానం వస్తుంది. అయితే రోహిణి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది.. రవి పల్లి చెక్క చేస్తాడు దాన్ని టేస్ట్ చేసిన శృతి చాలా బాగుంది అని మెచ్చుకుంటుంది.. మీనాకి కూడా ఒకటి టేస్ట్ చేయమని ఇస్తుంది. మీనా చాలా బాగుంది ఇది అమ్మితే ఇంకా బాగుంటుంది కదా అని అంటుంది. మనం రెస్టారెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటివి చేస్తే అందరూ ఇష్టపడతారు మన బ్రాండ్ కూడా ప్రమోట్ అవుతుంది అని రవి అంటాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి వీళ్ళు గొడవ పడుతున్నారు అని తెలుసుకొని చాలా సంతోషంగా ఉంటుంది.

Advertisement

ఇక తర్వాత మీనా బాలు ఇద్దరు కూడా సుగుణమ్మ కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ నర్స్ ఉండడం చూసి షాక్ అవుతారు ఏమైంది అని అడుగుతారు. ఈమెకి గుండె నొప్పి వచ్చిందండి అందుకే నేను ఏమైనా చూసుకోవడానికి వచ్చాను అని అంటుంది. ఇంత ఆరోగ్యం బాగోలేకపోతే మాకు ఒక మాట చెప్పొచ్చు కదా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని బాలు సుగుణమని అడుగుతాడు.. సుగుణమ్మ మాత్రం ఏం కాలేదు బాగానే ఉంది అని చెప్తుంది.. మీరు ఎందుకు మమ్మల్ని పరాయి వాళ్ళ లాగా చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్న మీరు మాకు చెప్పట్లేదు అసలు చింటూ ఎక్కడున్నాడు అని సుగుణమని మీనా బాలు అడుగుతారు..

సుగుణమ్మ నాకు బాగోలేదు కదా అందుకే మా బంధువుల ఇంటికి పంపించాను. వాళ్ళు చింటూని వైజాగ్ కి తీసుకెళ్లారు అని చెప్పగానే మీనా బాలు దత్తత గురించి మరోసారి సుగుణమ్మకి గుర్తు చేస్తారు. అయితే వాడి భవిష్యత్తు కోసం చేయడం నాకు ఇష్టమే కానీ వాళ్ళ అమ్మ ఏమంటుందో అని అనగానే మీరు ఆలోచించుకొని మీ నిర్ణయం చెప్పండి అని బాలు మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. ఆ తర్వాత రోహిణికి సుగుణమ్మ ఈ విషయం చెప్పగానే మొదట షాక్ అవుతుంది.. ఎందుకమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు వాళ్ళతో మాట్లాడొద్దని ఎంత చెప్పినా సరే నువ్వు వాళ్లతోనే మాట్లాడుతున్నావు ఏంటి అని సుగుణమ్మ రోహిణి అడుగుతుంది..

Advertisement

రోహిణి ఆ విషయం చెప్పగానే రోహిణి నా కొడుకు నీకు బరువయ్యాడా అని సీరియస్ అవుతుంది.. కానీ సుగుణమ్మ మాత్రం నువ్వు ఇలానే చేస్తుంటే నేను వాళ్లకి దత్తత ఇచ్చేస్తాను అని రోహిణి తో వార్నింగ్ ఇస్తుంది.. ఇంక రోహిణి నా కొడుకు నేను ఇవ్వనే ఇవ్వను అని గట్టిగా తేల్చి చెప్పేస్తుంది. ఆ తర్వాత ఈ విషయాన్ని ప్రభావతితో చెప్పి ఇంట్లో గొడవ పెట్టాలని రోహిణి ఫిక్స్ అవుతుంది. ప్రభావతి దగ్గరికి వెళ్ళగానే ఈ విషయం చెప్తే ఈ సాకుతో వాళ్ళిద్దర్నీ కూడా ఇంట్లోంచి గెంటేస్తాను అని చెప్పడంతో రోహిణి టెన్షన్ పడుతుంది.

Also Read:కాపురంలో చిచ్చుపెట్టిన కార్తీక దీపం.. ఇదేందయ్యా ఇది.. నమ్మలేకపోతున్నామే..

ఇక రోహిణి చింటూ కోసం స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలని వెళుతుంది. ఎంత ఖర్చయిన పర్వాలేదు నేను ఇస్తానని అంటారు.. ఈ విషయాన్ని సుగుణమ్మకు రోహిణి చెప్తుంది. అయితే ఆ మాట వినగానే సుగుణమ్మ చాలా సంతోషంగా ఉంటుంది. ఇకపోతే చింటూ గురించి ఆలోచిస్తూ ఉంటాడు బాలు ఇంటికి రాగానే మీనా మనం ఇంకా టైం తీసుకుని మరోసారి అడుగుదాం ఆల్రెడీ ఏమంటుందో చూద్దామని అంటారు.. ఇక శృతి మీనా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అత్తయ్య మనల్ని గొడవ పడట్లేదు అని అనుకుంటే ఏడుస్తుంది ఏమో అని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×