E-Paper
Advertisement

Family Drama OTT : భర్త రాత్రి పూట ఉద్యోగం చేస్తే.. భార్య పగటిపూట… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Family Drama OTT : భర్త రాత్రి పూట ఉద్యోగం చేస్తే.. భార్య పగటిపూట… లాస్ట్ ట్విస్ట్ హైలెట్
Advertisement

Family Drama OTT : ఓటీటీలో ఒక ప్రత్యేకత ఉన్న సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అది ఏమిటంటే, ఇందులో సంభాషణలు ఉండవు. కేవలం శబ్దాలు, విజువల్స్ ద్వారానే కథను నడిపించారు. కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక జంట ఆర్థిక ఇబ్బందుల వల్ల వేర్వేరు షిఫ్టుల్లో పనిచేస్తుంటారు. ఇది ఒక దంపతుల జీవితాన్ని కళాత్మకంగా చూపిస్తుంది. కలకత్తాలో సాధారణ ప్రజల బాధలు, ప్రేమ, ఒంటరితనం గురించి బాగా టచ్ అయ్యే సినిమా. దాదాపు 1 గంట 24 నిమిషాల నిడివితో సినిమా ఉంటుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

‘ఆశా జావార్ మాఝే’ (Asha Jaoar Majhe) 2014లో విడుదలైన ఒక ప్రయోగాత్మక బెంగాలీ మూవీ. దీనికి ఆంగ్లంలో Labour of Love అనే పేరు ఉంది. దీనికి ఆదిత్య విక్రమ్ సేన్‌గుప్తా దర్శకత్వం వహించారు. ఇందులో రిత్విక్ చక్రవర్తి, బసబ్దత్త ఛటర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 62వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ మరియు ఉత్తమ ఆడియోగ్రఫీ విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. అలాగే వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రశంసలు అందుకుంది. 2015 జూన్ 26 థియేటర్లలో రిలీజ్ అయింది ఈ మూవీ. ప్రస్తుతం Prime Video, hoichoi లో అందుబాటులో ఉంది. దీనికి IMDbలో 7.9/10 రేటింగ్ కూడా ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సినిమా కథ చాలా సింపుల్ కానీ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. కోల్‌కతాలో ఉండే ఒక మధ్యతరగతి భార్యాభర్తలు ఆర్థిక ఇబ్బందులతో ఉంటారు. దీంతో వాళ్ళు రెండు వేర్వేరు షిఫ్టుల్లో పని చేస్తూ ఉంటారు. భార్య పగలు ఫ్యాక్టరీకి వెళ్తే, భర్త రాత్రి పూట ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తాడు. రోజంతా వాళ్లు తమ తమ పనుల్లో బిజీగా ఉంటూ, ఇంటి పనులను కూడా ఒకరికోసం ఒకరు షేర్ చేసుకుంటారు. కథ మొత్తం ఎక్కడా మాటలు లేకుండా కేవలం శబ్దాలు, వాళ్లు పడే కష్టం చుట్టూనే తిరుగుతుంది.

అసలు పాయింట్ ఏంటంటే, ఈ జంట ఒకరినొకరు కలుసుకునేది కేవలం రోజులో కొన్ని నిమిషాలు మాత్రమే. భర్త డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చే సమయానికి, భార్య డ్యూటీకి వెళ్లడానికి సిద్ధమవుతుంది. ఆ కొద్దిసేపు వాళ్లు కలిసి గడిపే క్షణాల్లోనే వాళ్ల మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం కనిపిస్తుంది. మాటలు లేకపోయినా, ఒకరిపై ఒకరికి ఉన్న బాధ్యతను, ఆ కష్ట కాలంలో వాళ్లు ఒకరికొకరు ఎలా తోడుగా ఉన్నారనేది చాలా అందంగా చూపించారు ఈ సినిమాలో.

Advertisement

Read Also : బతికుండగానే కల్లోకొచ్చి నరకం చూపించే దెయ్యం… ఒంటరిగా చూస్తే అంతే సంగతులు

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×