E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మళ్లీ ఇరుక్కున్న మనోజ్.. మౌనిక కోసం బాలు కన్నీళ్లు..లక్ష కోసం ప్రభావతి ప్లాన్..

Gundeninda GudiGantalu Today episode: మళ్లీ ఇరుక్కున్న మనోజ్.. మౌనిక కోసం బాలు కన్నీళ్లు..లక్ష కోసం ప్రభావతి ప్లాన్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు ఫ్రెండ్ రాజేష్ కారు కోసమని ఇంటికి వస్తాడు. ఆ కారు కీ ఇవ్వగానే నువ్వు మా నాన్న చేతి మీద తాళాలు తీసుకున్నావు కదా ఇంతకింత మళ్ళి అభివృద్ధి అవుతావు అని బాలు అంటాడు. కానీ ప్రభావతి మాత్రం ఏదో ఒకటి అనాలని అనేస్తూ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ కార్ కి ఇంత బిల్డప్ ఇస్తున్నారే ఇది ఏదో పెద్ద విమానం ఇచ్చినట్లు అని ప్రభావతి వెటకారంగా మాట్లాడుతుంది. ఆ మాట వినగానే మీనా ఏం మాట్లాడారు.. ఏం మా ఆయన గురించి మీకు తెలియదు అని అంటుంది.. బిజినెస్ మాన్ అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అని అంటాడు. స్టేటస్ అంటే ఏంటి వేరే వాళ్ళ నగలని దొంగతనం చేసి అమ్ముకొని బిజినెస్ ని పెంచుకోవాలని అనుకోవడమా అని మనోజ్ గాలిని తుస్సున తీసేస్తుంది మీనా..

మాకలాంటి బుద్ధులు లేవు మా ఆయన ఎప్పటికీ అలాంటి పని చేయడు అని మీనా అంటుంది.. బిజినెస్ చేయాలంటే ఒక స్టేటస్ ఆ ఏం స్టేటస్ ఇలాంటి స్టేటస్లు గుడి ముందర అడుక్కోడాలు మాకు అవసరం లేదు అని మీనా గట్టిగానే చెప్తుంది. నువ్వు ఇలానే నోరు జారీ అందరి చేత అనిపించుకుంటూ ఉండొద్దు అని రోహిణి అంటుంది. మనోజ్ ఆ లెటర్ వల్ల తనకు ప్రమాదం ఉందని తెలుసుకొని బాధపడుతూ ఉంటాడు.. స్వామీజిని కలిసి పరిష్కారం తెలుసుకోవాలని అనుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే… ఆ లెటర్ ఇచ్చి స్వామిని కలుద్దాం లోపలికి వెళ్దాం పద అని అంటాడు. ఆ స్వామిజి అల్లుట ని చూసి నీ చుట్టూ ఉన్నవాళ్లే నీకు కీడు చేయాలని చూస్తున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మళ్లీ గుడి దగ్గర అడుక్కునే పరిస్థితి వస్తుంది అని స్వామీజీ అనగానే మనోజ్ పై పడిపోతాడు… నేను చెప్పినట్లు గనుక నువ్వు కొన్ని రోజులు ఈ కలర్ లో ఉన్న డ్రస్సులను వేసుకుంటే నీ పరిస్థితి దూరమవుతుందని అతను అంటాడు. మనోజు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. నేను రోజు అలా కలర్ డ్రెస్సులు వేసుకుంటే ఇంట్లో వాళ్లకి అనుమానం వస్తుంది ఏమో అని మనోజ్ అడుగుతాడు..

నువ్వు నేను చెప్పినట్టు చేయకుంటే మాత్రం కచ్చితంగా ప్రమాదంలో పడతావు అని స్వామీజీ హెచ్చరిస్తాడు.. మనోజ్ చేసేది ఏమీ లేక మీరేం చెప్తే అది చేస్తాను నాకు ఈ గండం నుంచి బయటపడండి అని అంటాడు.. ఇక మణికంఠను తీసుకొని వెళ్ళిపోతాడు మనోజ్. బాలు మాత్రం మౌనిక ఎందుకు అలా అన్నది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయం నాన్నతో చెప్తే నాన్న చాలా బాధపడుతాడు అని తనలో తానే బాధపడుతూ ఉంటాడు. ఒకసారి మౌనిక ఫోన్ చేస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటాడు.

Advertisement

మౌనికాకు మీనా ఫోన్ చేస్తుంది. సంజయ్ ఉన్నాడని తెలుసుకున్న మౌనిక ఫోన్ కట్ చేస్తుంది. అది చూసిన సంజయ్ నువ్వు ఇలానే ఉండు మీ వాళ్ళు నరకాన్ని అనుభవించాలి అప్పుడే నేను చాలా సంతోషంగా ఉంటానని అంటాడు. ఇక బాలు ఎప్పటిలాగే ట్రిప్ కి వెళ్తాడు. మీనా తన పని తాను చేసుకుంటూ బిజీగా ఉంటుంది. ప్రభావతి మళ్లీ మొదటికి వచ్చేస్తుంది. మీ నాన్న తిట్టడమే పనిగా పెట్టుకుంటుంది. సత్యం ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం సైలెంట్ గా సెటైర్లు వేస్తూ ఉంటుంది.

ఇక ఉదయం అందరూ టిఫిన్ చేయడానికి అని వస్తారు. అప్పుడు రవి మా రెస్టారెంట్లో కపుల్స్ కోసం ఒక కాంటెస్ట్ ఏర్పాటు చేస్తారు. అందులో పాల్గొనే జంటలల్లో ఎవరు బెస్ట్ కపుల్ గా అనిపిస్తారో వాళ్ళు ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు అని అంటారు. ఇలాంటివన్నీ మాకెందుకు మాకేం అవసరం లేదు అని ప్రభావతి అంటుంది. కామాక్షి మాత్రం మీ అత్తయ్య కూడా పాల్గొనవచ్చా అని అంటుంది. వయసుతో సంబంధం లేదు వాళ్ళ మధ్య ఉన్న అన్యోన్యత గురించి చెప్పి అక్కడ వాళ్ళని మెప్పించాలి అని రవి అంటాడు. కానీ ఎవరికి వారే మేం రాలేము అని అనుకుంటారు. శృతి మీరు వస్తారేమో ప్రైజ్ మనీ లక్ష రూపాయలు మనకే వస్తుందని అనుకున్నాను అని అంటుంది. ఏంటి లక్ష అని ప్రభావతి షాక్ అవుతుంది.

Also Read : ఇమ్మానుయేల్ అవుట్.. 15 వారాలకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటే?

రోహిణి కూడా లక్ష రూపాయల అని అనుకుంటుంది.. అందరూ కూడా ఎవరికి వారే అన్నట్లు ఉంటారు.. ఈ ప్రైజ్ మనీ ని ఎలాగైనా కొట్టేయాలి అని బాలు మీనా కూడా అనుకుంటారు.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఆ లక్ష రూపాయలు ప్రైస్ మనీ ఏ జంట అందుకుంటుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×