E-Paper
Advertisement

AI Phone Repair: ఫోన్ రిపేర్ బిల్ రూ.16000 వేసిన సర్వీస్ సెంటర్.. AI సాయంతో 1,450కే సరి

AI Phone Repair: ఫోన్ రిపేర్ బిల్ రూ.16000 వేసిన సర్వీస్ సెంటర్.. AI సాయంతో 1,450కే సరి
Advertisement

AI Cuts Phone Repair Bill | ఒక సోషల్ మీడియా ఒక యూజర్.. శామ్‌సంగ్ ఫోన్ రిపేర్‌కు సంబంధించి తనకు ఎదురైన వింత అనుభవం గురించి ఒక పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ చదివిన వారంతా శాంసంగ్ అధికారిక సర్వీస్ సెంటర్‌లు ఎలా పనిచేస్తున్నాయని అనే ప్రశ్నిస్తున్నారు. యూజర్ చెప్పినదే నిజమైతే.. శాంసంగ్ అధికారిక సర్వీస్ సెంటర్ రిపేర్ అంచనా బిల్ రూ.16000 ఇచ్చింది. కానీ, AI సహాయంతో అదే ఫోన్‌ను కేవలం 1,450 రూపాయలకే యూజర్ రిపేర్ చేశాడు.

ఫోన్‌ లో ఉన్న సమస్య గురించి సర్వీస్ సెంటర్ చెప్పింది ఇదే..

యూజర్ పాత శామ్‌సంగ్ గెలాక్సీ A52s ఫోన్ కొన్ని రోజుల క్రితమే చేయి జారి కొందపడిపోయింది. దాంతో స్క్రీన్ అప్పుడప్పుడు బ్లాంక్ అవుతోంది, మైక్రోఫోన్ ఆక్స్ జాక్ పనిచేయడం లేదు. చార్జింగ్ మాత్రం సాధారణంగా జరుగుతోంది. ఫోన్ కొన్న షాప్‌కు తీసుకెళ్లగా, అక్కడ నుంచి శామ్‌సంగ్ అధికారిక సర్వీస్ సెంటర్‌కు పంపించారు.
సర్వీస్ సెంటర్ చెక్ చేసి, ఫోన్ మదర్‌బోర్డ్ పాడైపోయిందని, రిపేర్ చేయలేమని చెప్పారు. పూర్తి మదర్‌బోర్డ్ మార్చాలని, దాని ఖర్చు దాదాపు రూ.16000 అంచనా ఇచ్చారు.

అనుమానంలో ఏఐ సాయం తీసుకున్న యూజర్‌

Advertisement

ఫోన్ కొంతవరకు పనిచేస్తోంది కాబట్టి మదర్‌బోర్డ్ డ్యామేజ్ అయిందనే విషయంపై యూజర్‌కు అనుమానం వచ్చింది. ఆ సమయంలో ఏం చేయాలో తోచక యూజర్ తన సమస్య గురించి గూగుల్ జెమినీ AIకి వివరించాడు. తనకు సరైన సలహా ఇవ్వాలని అడిగాడు. సమస్యని అర్థం చేసుకున్న ఏఐ.. చాలా పర్ఫెక్ట్ సమాధానం ఇచ్చింది. “ఇది మదర్‌బోర్డ్ ఫెయిల్ కాదు, ఫోన్ కింద పడిపోవడం వల్ల అందులో ఫ్లెక్స్ కేబుల్ లేదా డిస్‌ప్లే కనెక్టర్ డ్యామేజ్ కావడం లేదా కనెక్టర్ లూజ్ అయి ఉండవచ్చు. లోకల్ రిపేర్ షాప్‌లో సెకండ్ ఒపీనియన్ తీసుకోమని, ఖర్చు 500 నుంచి 1,500 రూపాయల మధ్య ఉంటుంది” అని జెమినీ AI సూచించింది.

లోకల్ షాప్‌లో ఏమి జరిగింది?

యూజర్ ఇంటి దగ్గర ఉన్న లోకల్ మొబైల్ రిపేర్ షాప్‌కు ఫోన్ తీసుకెళ్లారు. అక్కడ టెక్నీషియన్‌కు ప్రత్యేకంగా ఫ్లెక్స్ కేబుల్, డిస్‌ప్లే కనెక్టర్ చెక్ చేయమని చెప్పారు. చెక్ చేస్తే AI చెప్పినట్టే సమస్య బయటపడింది. పడిపోవడం వల్ల మెయిన్ ఫ్లెక్స్ కేబుల్ డ్యామేజ్ అయింది. ఆ కేబుల్ మార్చేశారు. రిపేర్ తర్వాత ఫోన్ పూర్తిగా సాధారణంగా పనిచేయడం మొదలైంది. మొత్తం ఖర్చు సర్వీస్ చార్జ్‌తో కలిపి కేవలం రూ.1,450  మాత్రమే వచ్చింది.

Advertisement

Also Read: ఒక్క రోజులోనే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగిపోతారు.. యాడ్స్ అవసరం లేదు.. ఎలాగంటే

ఈ ఎక్స్‌పీరియన్స్ నుంచి ఏమి నేర్చుకోవచ్చు?

అధికారిక సర్వీస్ సెంటర్ మాట విని ఉంటే అనవసరంగా రూ.16000 ఖర్చు అయ్యేవి అని యూజర్ చెప్పాడు. సాధారణంగా బ్రాండ్ కంపెనీలు అధికారిక సెంటర్‌లోనే రిపేర్ చేయించమని సలహా ఇస్తాయి. బయట రిపేర్ చేస్తే వారంటీ పోతుందని కూడా చెబుతాయి.
ఈ కేసు ఒక పెద్ద ప్రశ్న లేవనెత్తుతోంది. ప్రతిసారీ ఖరీదైన రీప్లేస్‌మెంట్ మాత్రమే ఏకైక పరిష్కారమా? కొన్ని సందర్భాల్లో మంచి డయాగ్నోసిస్ సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే అనవసర ఖర్చు నుంచి తప్పించవచ్చు. యూజర్లు రిపేర్ చేయించే ముందు పూర్తి సమాచారం తీసుకోవడం, అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యమని ఈ ఘటన ద్వారా తెలుస్తోంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×