E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. బాలు దెబ్బకు ప్రభా అవుట్.. రోహిణి బండారం బయటపడుతుందా?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. బాలు దెబ్బకు ప్రభా అవుట్.. రోహిణి బండారం బయటపడుతుందా?
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతితో సత్యం మాట్లాడడానికి లోపలికి వెళ్తాడు. ప్రభావతిని ఎలా ఉన్నావు అని అడుగుతారు సత్యం. మీరేమైనా తిన్నారా అని అడుగుతుంది.. మనము ఎన్ని గొడవలు పడ్డ కూడా ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోలేదు అని ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. జీవితంలో ఏ భర్త అయినా ఎవరికి ఇచ్చే విలువ వాళ్లకు ఇస్తాడు అని అనగానే.. ప్రభావతి నా కండిషన్స్ కి ఒప్పుకొని నన్ను తీసుకెళ్లడానికి వచ్చారని అడుగుతుంది. కేసు వెనక్కి తీసుకోమని అడగడానికి వచ్చాను అని సత్యం చెప్పగానే ప్రభావతి షాక్ అయిపోతుంది. మొత్తానికి ప్రభావతి కేసు వెనక తీసుకోవడానికి ఒప్పుకుంటుంది.. ఆ మీనా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటుంది.. సత్యం ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం తన మాటే నెగ్గాలని అనుకుంటుంది.. ప్రభావతి దగ్గరికి వెళ్లి ఎంతగా శివని విడిపించాలని అడిగిన సరే వినదు.. లాయర్ మాత్రం తనకి రెండు లక్షలు ఇచ్చి బెదిరించడంతో శివ మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకుంటుంది. ఇక శివ ఇంటికి వచ్చాడని మీనా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బాలు కు ఫోన్ చేసి శివని బయటకు తీసుకొచ్చేసాము అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా చాలా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత శివ బయటకు వచ్చాడు అన్న సంతోషంతో మీనా బాలు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి శివుని తీసుకొని వచ్చి పార్వతి దగ్గరికి తీసుకువెళ్తారు. అమ్మ శివ వచ్చాడు అని సుమతి చాలా సంతోషంగా పార్వతీతో చెప్తుంది.. అయితే పార్వతీ శివని చూసి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు చేసిన చిన్న తప్పు వల్ల ఎంతమంది బాధపడ్డారో చూసావా అని పార్వతి అంటుంది.. ఇక ఇలాంటివి ఇక మీదట చెయ్యొద్దు అని పార్వతి మాట తీసుకుంటుంది.. ప్రభావతి దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పాలి అని అందరూ అనుకుంటారు.

Advertisement

గుణ మనుషులు శివాని విడుదల చేశారు అని చెప్పగానే గుణ షాక్ అవుతాడు. అయితే ఎందుకు రా అప్పుడే వాడిని రిలీజ్ చేశారు ఒక ఏడాదైనా సరే వాడికి జైలు శిక్ష పడుతుంది అని అనుకున్నాను. బాలుని ఇదంతా చేసి ఉంటాడు దగ్గరుండి ఆ శివని రిలీజ్ చేసి ఉంటాడు అని గుణ అంటాడు.. కానీ దినేష్ అప్పుడే అక్కడికి రావడంతో గుణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నువ్వేంటి బయటికి వచ్చావు ఆ రోహిణి ఇంకా డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు నువ్వు బయటికి వచ్చావంటే నిజం తెలుసుకొని డబ్బులు ఇవ్వకుండా మాయం అయిపోతుంది అని దినేష్ ఫై గుణ సీరియస్ అవుతాడు. ఆ రోహిణి డబ్బులిస్తుందని మనం అనుకుంటున్నాం కదా ఇవ్వదేమో అని దినేష్ అంటాడు.

రోహిణి డబ్బులు ఎలా ఇవ్వదో నేను చూస్తాను అని అంటాడు. ఇక బాలు వాళ్ళ అత్తగారి కుటుంబాన్ని తీసుకొని కామాక్షి వాళ్ళ ఇంటికి ప్రభావతిని కలవడానికి వెళ్తాడు. అక్కడ కామాక్షి వాళ్ళని చూసి ప్రభావతి పై సెటర్లు వేస్తుంది. ప్రభావతి ఎంతగా సైలెంట్ గా ఉండాలని చూస్తున్నా సరే వాళ్ళందరూ క్షమాపణ చెప్పారని బాలు చెప్పిన సరే నేను ఎవరి మాట వినను అని అంటుంది.. ఇక శివ క్షమాపణ చెప్పిన తర్వాత ప్రభావతి మౌనంగా ఉంటుంది ఒకవేళ వాడు నన్ను ఏదైనా చేస్తాడేమో అని లో లోపల భయపడిపోతూ ఉంటుంది.. ప్రభావతి నీ ఇంటికి రమ్మని బాలు మీనా పిలిచినా కూడా తను రాను అని అంటుంది.

Advertisement

Also Read :సంబంధం కోసం తాయారు ఇంటికి వెళ్లిన మహా..తాయారుకు దిమ్మతిరిగే షాక్.. అందరికి క్లాస్ పీకిన నారాయణ..

బాలు సుశీలకు ఈ విషయం తెలిసిపోయింది. బామ్మ పంతం గురించి నీకు తెలిసిందే కదా.. ఆ నీలవేణిని ఇచ్చి నాన్నకి రెండో పెళ్లి చేస్తుందట. సవతి పోరు నీకు తప్పదు నువ్వు గనక రాకపోతే కచ్చితంగా ఇదే జరుగుతుంది అని ప్రభావతిని భయపడేలా చేస్తాడు బాలు.. ఇక మనం కొత్తగా పెళ్లి చేసే పిన్నికి అన్ని కొనాలి పదా మీనా అని బాలు మంట పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కామాక్షి వదిన ఏంటి అలా ఉండి పోయావు ఈ వయసులో నీకు సవతి పోరు ఉంటే బాగోదు ఒకసారి ఆలోచించుకో అని ప్రభావతితో అంటుంది. ఇక ప్రభావతి చేసేది ఏమీ లేక మా ఇంటికి నేను వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనోజ్ రోహిణి లను కిందకి రమ్మని చెప్పి ప్రభావతి ఇంట్లోకి బలవంతంగా వచ్చినట్లు నటిస్తుంది. అది చూసిన బాలు ప్రభావతి పై సెటైర్లు వేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×