E-Paper
Advertisement

వైసీపీ మూడు రాజధానుల వ్యవహారం.. గుట్టు విప్పిన మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్, తన పుట్టుకను కూడా

వైసీపీ మూడు రాజధానుల వ్యవహారం.. గుట్టు విప్పిన మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్, తన పుట్టుకను కూడా
Advertisement

Amaravati: వైసీపీ హయాంలో మూడు  రాజధానుల బిల్లు సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎట్టకేలకు నోరు విప్పారు మాజీ ఛైర్మన్ షరీఫ్. మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నందుకు ఆనాడు ఓ మంత్రి తనపై చేయి చేసుకున్నారని మనసులోని మాట బయటపెట్టారు.  ఇప్పుడు ఆ సందర్భం రావడంతో కీలక విషయాలను ఆయన బయట పెట్టారు.

వైసీపీ మూడు రాజధానుల వ్యవహారం

Advertisement

తప్పు జరిగిన వెంటనే నిజం తెలియకపోయినా తర్వాత మెల్లగా తెలుస్తోంది. ఇది వైసీపీకి అతికినట్టు సరిపోతుంది. ఎందుకుంటే వైసీపీ రూలింగ్‌లో మూడు రాజధానుల గురించి జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. అనుకూల మీడియా తాటికాయంత అక్షరాలతో ఉదయం మొదలు రాత్రి వరకు పుంఖాను పుంఖానుగా వార్తలు ప్రచారం చేసింది. అసెంబ్లీలో మూడు రాజధానులపై బిల్లు పాస్ అయ్యింది.

మండలిలో టీడీపీకి బలం ఉండడంతో నెగ్గించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది వైసీపీ సర్కార్. ఆ బిల్లు సమయంలో మండలి ఛైర్మన్‌గా షరీఫ్ కొనసాగుతున్నారు. మండలిలో మూడు రాజధానుల బిల్లు విషయంలో పెద్ద రచ్చ జరిగింది. ఆనాడు ఛైర్మన్ నోరు మెదపలేదు. సమయం, సందర్భం వచ్చినప్పుడు బయటపెట్టాలని భావించారు. ఇప్పుడు ఆ విషయాన్ని వెల్లడించారు.

Advertisement

ఆనాటి మండలి గుట్టు బయటపెట్టిన మాజీ ఛైర్మన్ షరీఫ్

ఏపీ రాజధాని అమరావతిగా పేర్కొంటూ పార్లమెంటు ఉభయసభల్లో గురువారం బిల్లు పాసైంది. ఈ సందర్భంగా గురువారం టీడీపీ ఆఫీసులో జరిగిన అమరావతి వేడుకల్లో మాజీ ఛైర్మన్ షరీఫ్ పాల్గొన్నారు. ఆనాడు గత చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ వేదికపై ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

ఆనాడు మూడు రాజధానుల బిల్లుపై మండలిలో జరిగిన వ్యవహారాన్ని బయటపెట్టారు. సభా గౌరవాన్ని కాపాడేందుకు ఆనాడు నోరు విప్పలేదన్నారు. తమ మాట వినకుంటే మండలిని రద్దు చేస్తామని ఆనాటి పాలకులు ప్రకటన చేశారని అన్నారు. తనను పదవి నుంచి తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీ కావని గుర్తు చేశారు.

ALSO READ: మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో పేర్ని నానిని అడ్డుకున్న సిబ్బంది.. ఆసుపత్రిలో కూడా రాజకీయాలా అంటూ ఆగ్ర‌హం

మండలిలో టేబుల్‌పైకి వైసీపీ సభ్యులు ఎక్కి రచ్చ చేశారని తెలిపారు. ఒకానొక సమయంలో బిల్లును అడ్డుకున్నందుకు ఓ మంత్రి తనపై చేయి చేసుకున్నారని మనసులోని ఆవేదనను బయటపెట్టారు. చివరకు కులం పేరుతో దూషించి, పుట్టుకను నిందించారని కాసింత భావోద్వేగానికి గురయ్యారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×