// // Gundeninda GudiGantalu Today episode: ప్రభా బుద్ధిపోనిచ్చుకోలేదు.. -->
E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభా బుద్ధిపోనిచ్చుకోలేదు.. హమ్మమ్మ మనోజ్ సేఫ్.. బాలు దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Gundeninda GudiGantalu Today episode: ప్రభా బుద్ధిపోనిచ్చుకోలేదు.. హమ్మమ్మ మనోజ్ సేఫ్.. బాలు దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 10th: మీనా మీరేమీ బాధపడకండి మీ తమ్ముడు మిమ్మల్ని ఆటపట్టించడానికి అలా అంటూ ఉంటాడు.. మీకు ఇలా జరిగినప్పటి నుంచి తను తను లాగా లేడు.. మీరు ఎప్పుడు ఎప్పుడు కళ్ళు తెరిస్తే చూస్తారని చాలా భయపడిపోతున్నాడు బాధపడుతున్నాడు.. మీరు త్వరలోనే కళ్ళు తెరిచి చూస్తారు భయపడకండి అని మీన పాజిటివ్ గా మాట్లాడడంతో.. మనోజ్ చూసావా రా మీ నాన్న నాతో మొదటిసారి పాజిటివ్ గా మాట్లాడింది.. నా మీద జాలి చూపించా? లేదా నన్ను బాధ పడద్దని చెప్తున్నా అని అనగానే మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మీనా మొదటి సారి నాతో ఇలా మాట్లాడుతుంది రా అని మనోజ్ అనగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా మనోజ్ పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు.. ఎలాగైనా సరే మనోజ్ కి కళ్ళు రావాలి అని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు.. మీ నాతో పాటుగా బాలు కూడా దేవుడికి దండం పెట్టుకొని నేను ఎప్పుడూ ఏదీ అడగను.. మా అన్నయ్య కళ్ళు వచ్చేలా చూడు స్వామి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు.. ఈ ఎపిసోడ్కి బాలు ఎమోషనల్ సీన్ హైలెట్ గా నిలుస్తుంది..

మనోజ్ సర్జరీ సక్సెస్..

మనోజ్ కి కళ్ళకి ఇంకా సన్నని గాజు పెంకులు ఉండడం వల్ల సర్జరీ పెద్దదే చేయాలి అని డాక్టర్ చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. అయితే ఎలాగైనా సరే సర్జరీని పూర్తి చేయాలని అనుకుంటారు.. ఇక అనుకున్నట్లుగానే సర్జరీని పూర్తి చేస్తారు. మనోజ్ కి సర్జరీ పూర్తయింది అని అనగానే అందరూ చాలా సంతోషంగా ఉంటారు. మనోజ్ కళ్ళు మళ్ళీ తిరిగి రాబోతున్నాయని అందరూ కూడా దేవుడికి ప్రార్థిస్తూ దండం పెట్టుకుంటారు.. ఏమైనా సరే మనోజ్ చాలా అదృష్టవంతుడు మళ్లీ ఇంత పెద్ద ప్రమాదం జరిగిన కళ్ళతో చూడగలుగుతున్నాడు అని ప్రభావతి సంతోషంగా ఉంటుంది..

కానిస్టేబుల్ ఎంట్రీతో బాలు కామెడీ..

Advertisement

బాలు మీనా బయటికి వెళ్ళగానే అక్కడ కానిస్టేబుల్ నిన్న యాక్సిడెంట్ అయ్యి కళ్లకు గాజు పెంకులు గుచ్చుకున్నాయి కదా.. అతను ఎక్కడ అని వెతుక్కుంటూ రిసెప్షన్ ఇస్తు దగ్గరకి వచ్చి అడుగుతాడు.. అయితే అక్కడ ఉన్న బాలు ఏంటి సార్ మీరు ఇక్కడ అని అడుగుతాడు.. మా అన్నయ్య కోసం ఎందుకు వచ్చారు అని అడక్కని ఏంటి మీ అన్నయ్య ఎవరయ్యా మీ అన్నయ్య అని కానిస్టేబుల్ అడుగుతాడు. ఆరోజు మీరు చెవిలో ఏదో చెప్పారని మూడు చెంప దెబ్బలు కొట్టారు కదా అతనే మా అన్నయ్య అని చెప్పగానే ఓ మీ అన్నయ్య అతనేనా అని అనుకుంటారు.. మా అన్నయ్య దగ్గరికి నేను తీసుకొని వెళ్తాను మీరు రండి అని కానిస్టేబుల్ ని అక్కడికి తీసుకొని వెళ్తారు.. కానిస్టేబుల్ ఎంట్రీ తో సీన్ మొత్తం కామెడిగా ఉంటుంది..

నిజం కక్కేసిన మనోజ్..

కానిస్టేబుల్ కి ఎందుకయ్యా అంతగా పరిగెత్తుకుంటూ వెళ్లావు. నీవల్ల ఎంత న్యూసెన్స్ జరిగిందో తెలుసా కాకపోతే నీ కళ్ళకి ప్రమాదం జరిగింది.. కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను లేకున్నా అంటే నీ మీద వాళ్ళందరూ కేసు పెట్టారు కదా తీసుకెళ్లి బొక్కలో వేసే వారిని అంటాడు.. ఎందుకయ్యా నువ్వు కుక్క పరిగెత్తినట్టుగా ఎందుకు అంతగా పరిగెత్తావు నిజంగానే నిన్ను కుక్కేమైనా తరిమిందా అని మనోజ్ ని అడుగుతాడు.. నాకు ఐదు కోట్లు అని చెప్పి మూడు కోట్లకే విల్లా అమ్మిన ఆ విల్లా విజయ్ గాడు కనిపించగానే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను సార్ వాడి వల్ల నాకు యాక్సిడెంట్ జరిగింది.. నాకు వాడి వల్ల 30 లక్షలు పోయాయి.. అలాగే ఇప్పుడు నాకు ఆక్సిడెంట్ జరగడానికి వాడే కారణం వాన్ని పట్టుకోండి మీరు అని మనోజ్ అనగానే.. కానిస్టేబుల్ సీసీ కెమెరాలు చూసి వాడు ఎక్కడున్నా పట్టకుంటాము అని అంటాడు..

మీనా పై రెచ్చిపోయిన ప్రభా..

Advertisement

బాలు మీనా ఉదయం లేవగానే ఎక్కడికి వెళ్లారు అని ప్రభావతి హడావిడి చేస్తుంది. హాస్పిటల్లో ఒక మనిషి ఉన్నారు. అతనికి తోడుగా ఇంకొకరు ఉన్నారు వాళ్ళకి భోజనం ఏంటి టిఫిన్ ఏంటి అని ఆలోచించకుండా.. ఈ పూల అమ్ముకునేది పొద్దున్నే పూలమ్మడానికి ఉరి మీద పడిందా అని ప్రభావతి మీనా పై రెచ్చిపోతూ దారుణంగా మాట్లాడుతుంది.. మీనని అంత మాట అనడంతో ప్రభావతి పై శృతి అలాగే సత్యం ఇద్దరూ ఒకేసారి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతారు. నువ్వు మాట్లాడాలనుకున్నది మాత్రమే మాట్లాడతావా మేము మాట్లాడాలనుకున్నది వినవా.. అని సత్యం డైనింగ్ టేబుల్ దగ్గరికి ప్రభావతిని లాక్కొని వెళ్లి ఇవన్నీ మీనా చేసి హాస్పిటల్ కి ఫుడ్ తీసుకొని వెళ్ళింది అని చెప్పగానే ప్రభావతి అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది..

బిల్ చూసి మనోజ్ గుండె గుబేల్..

మనోజ్ కి చెక్ చేసిన డాక్టరు మళ్లీ కళ్ళు వస్తాయి అని చెప్పగానే అందరూ సంతోషంగా ఉంటారు.. అయితే మనోజ్ ఈ బిల్ ఎంత ఎవరు కట్టారా రోహిణి కట్టిందా అని అడుగుతాడు.. రోహిణి కట్టలేదు బాలు అన్నయ్య కట్టాడు అని అనగానే.. ఓ 20 30 వేల ఉంటుంది కదా అందుకే వాడే కట్టుంటాడు వాడికి నేను ఇచ్చేస్తానులే అని అంటాడు.. 20 30 వేలు కాదురా మొత్తం బిల్లు రాసి నేను ఇస్తాను అది మొత్తం నాకు ఇవ్వాలి అని బాలు మనోజ్ మాటలు విన్నాక ఇంకాస్త కోపంగా అంటాడు.. హాస్పిటల్ కి పెట్టిన బిల్లును కూడా నువ్వు లెక్కలు వేస్తున్నావు అంటే కచ్చితంగా నేను నీకు ఎంత అయిందో చెప్పాల్సిందే అని మొత్తం రాసి రోహిణి చేతికి ఇస్తాడు.. హాస్పిటల్ బిల్లులు ఉన్నాయి మరి 30000 ఎవరికి కట్టావు అని రోహిణి మనోజ్ ఇద్దరు బాలుని అవమానిస్తూ అడుగుతారు.. ఎవరిది నేను ఒక్క రూపాయి కూడా తీసుకొని నాకు అవసరం లేదు మీరు కావాలంటే వెళ్లి కేసు పెట్టుకోండి అని అంటాడు.. ఎవరికి సాయం చేయకూడదు ఇలాగే తీసి పడేస్తారు అని బాలు కూడా వెళ్ళిపోతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: వల్లికి మైండ్ బ్లాక్..ధీరజ్, ప్రేమ రొమాన్స్..విశ్వంకు శిక్ష పడుతుందా..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×