E-Paper
Advertisement

ప్రపంచంలోనే తొలిసాలి.. రోబోలతో లైవ్ సర్జరీ.. ఆపరేషన్ సూపర్ సక్సెస్!

ప్రపంచంలోనే తొలిసాలి.. రోబోలతో లైవ్ సర్జరీ.. ఆపరేషన్ సూపర్ సక్సెస్!
Advertisement

Humanoid Robots: వైద్య సాంకేతిక పరిజ్ఞానంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. చరిత్రలోనే తొలిసారిగా రెండు హ్యూమనాయిడ్ (మనుషులను పోలిన) రోబోల సాయంతో పరిశోధకులు రెండు శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో (UCSD) కి చెందిన ఇంజనీర్లు, సర్జన్ల బృందం సంయుక్తంగా ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది. ‘నేచర్’ జర్నల్‌లో జులై 8న ప్రచురితమైన ఈ ప్రయోగం.. భవిష్యత్తులో వైద్య రంగంలో రాబోయే పెను మార్పులకు నాంది పలికింది.

మనిషి – రోబో అద్భుత సమన్వయం

అయితే ఈ శస్త్ర చికిత్సలను క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా రెండు వేర్వేరు పెద్ద జంతువులపై నిర్వహించారు. తొలి సర్జరీలో ఒక హ్యూమనాయిడ్ రోబో, ఒక మానవ సర్జన్ కలిసి ‘పిత్తాశయం తొలగింపు’ (Gallbladder removal) చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఇక రెండవ సర్జరీలో ఏకంగా రెండు హ్యూమనాయిడ్ రోబోలు పక్కపక్కనే నిలబడి ఒకదానికొకటి సహకరించుకుంటూ ఆపరేషన్‌ను పూర్తి చేయడం విశేషం.

Advertisement

వైద్యుల కొరతకు పరిష్కారం

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సర్జన్ల కొరత తీవ్రంగా ఉంది. దీనివల్ల రోగులు శస్త్రచికిత్సల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యకు హ్యూమనాయిడ్ రోబోలు చక్కని పరిష్కారం కానున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ‘సుదూర ప్రాంతాల నుండి ఆపరేట్ చేయగల ఈ రోబోల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందుతుంది’ అని ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ మైఖేల్ యిప్ తెలిపారు.

సాధారణ రోబోల కంటే భిన్నం!

Advertisement

అయితే ఈ ట్రయల్స్ లో వినియోగించిన హ్యుమనాయిడ్ రోబోలు.. ఇతర శస్త్రచికిత్సలకు వాడే రోబోల కంటే ఎంతో భిన్నమైనవని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఉన్న శస్త్రచికిత్స రోబోలు సుమారు 1,800 పౌండ్ల బరువు ఉండి భారీ స్థలాన్ని ఆక్రమిస్తాయి. వాటిని నిర్వహించడానికి పెద్ద బృందం అవసరం. కానీ ఈ ప్రయోగంలో వాడిన ‘సర్గీ’ (Surgie) అనే హ్యూమనాయిడ్ రోబో కేవలం 5 అడుగుల ఎత్తు, 60 కేజీల బరువు మాత్రమే ఉంటుంది. ఇది చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా అచ్చం మనిషి లెక్కనే ఆపరేషన్ థియేటర్లలో సులభంగా ఇమిడిపోతుంది. గ్రామీణ ప్రాంతాలు, యుద్ధ రంగాలు, చివరికి అంతరిక్షంలో కూడా వీటిని సులభంగా ఉపయోగించవచ్చు.

Also Read: Illu Illalu Pillalu Today Episodes: వల్లికి మైండ్ బ్లాక్..ధీరజ్, ప్రేమ రొమాన్స్..విశ్వంకు శిక్ష పడుతుందా..?

భవిష్యత్తు సవాళ్లు – లక్ష్యాలు

అయితే ట్రయల్స్ సమయంలో ఈ రోబోల్లో కొన్ని సాంకేతిక సవాళ్లను పరిశోధకులు గుర్తించారు. వీటిని పదే పదే రీ-కాలిబ్రేట్ చేయాల్సి రావడం వల్ల సర్జరీకి సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టింది. అలాగే సర్జన్ కదలికలకు, రోబో స్పందనకు మధ్య కొంత గ్యాప్ ను గుర్తించారు. రాబోయే రోజుల్లో ఈ లోపాలను అధిగమిస్తామని వైద్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ రోబోలు కేవలం సర్జరీలే కాకుండా ఆపరేషన్ థియేటర్‌ను శుభ్రం చేయడం, సర్జన్లకు అవసరమైన పరికరాలను అందించడం వంటి పనులను కూడా స్వయంగా చేసుకోగలవని పరిశోధక బృందం స్పష్టం చేసింది.

Also Read: Intinti Ramayanam Today Episode: పల్లవికి కమల్ ఝలక్.. సత్యనారాయణ పూజ సక్సెస్.. ఊహించని ట్విస్ట్..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×