E-Paper
Advertisement

Gundeninda Gudigantalu : ‘గుండెనిండా గుడి గంటలు’ సీరియల్ రేటింగ్.. ఇదేం ట్విస్ట్ మావా..

Gundeninda Gudigantalu : ‘గుండెనిండా గుడి గంటలు’ సీరియల్ రేటింగ్.. ఇదేం ట్విస్ట్ మావా..
Advertisement

Gundeninda Gudigantalu : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కూడా ఒకటి. ఇప్పటివరకు స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఈ సీరియల్ ఎప్పుడూ టాప్ రేటింగ్ లోనే దూసుకుపోతుంది. ఒకవారం డౌన్ అయింది అనుకునే లోపల మరో వారం ప్రేక్షకులకు ఊహించని ట్విస్టులను ఎదురయ్యేలా చేస్తూ జనాలని ఆకట్టుకుంటున్నారు కొన్ని నిండా గుడి గంటలు సీరియల్ టీం. గత వారంతో పోలిస్తే ఈ వారం ఈ సీరియల్కు మంచి రేటింగ్ వచ్చింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టాప్ 5 రేటింగ్ అందుకుంటున్న స్టార్ మా సీరియల్స్లలో ఈ సీరియల్ కూడా ముందంజలో ఉండడం విశేషం.. ఎప్పుడు మూడవ స్థానం లేదా నాలుగవ స్థానంలో వచ్చే ఈ సీరియల్ ఇప్పుడు రెండవ స్థానంలోకి రావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.. రేటింగ్ ఒక్కసారిగా పెరగడానికి అసలు కారణం ఇదే అని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. ఈవారం టాప్ లోకి గుండెనిండా గుడి గంటలు సీరియల్ రావడం వెనక అసలు కారణం ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

స్టోరీలో హైలెట్ ఇదే..

గత వారంతో పోలిస్తే ఈ వారం స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ రెండవ స్థానంలో కొనసాగుతోంది. నాలుగో స్థానంలో ఉండే ఈ సీరియల్ కాస్త రెండవ స్థానంలోకి రావడంతో బాలు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. రోహిణి బండారం ఎక్కడ బయటపడుతుందోనని ఎత్తుకు పై ఎత్తు వేస్తూ అందరిని నమ్మిస్తూ వచ్చిన కొన్ని సీన్లు జనాలకి విపరీతంగా నచ్చేసాయి. ముఖ్యంగా బాలు మనోజ్ ని తిడుతూ రోహిణి తిడుతూ ఉన్న కొన్ని సీన్లు బాగా ఆకట్టుకున్నాయి. గత వారంలో బాలు మలేషియా ట్రిప్ గురించి రోహిణి దగ్గర చెప్పడంతో ఆమె ఫ్యుజులు ఎగిరిపోతాయి.. ప్రభావతి మాత్రం బాలు ఇన్నాళ్ళకి తన కోరికను తీర్చబోతున్నాడు అంటూ కొడుకు పై ఎక్కడ లేని ప్రేమను కురిపిస్తుంది. ఈ ఎపిసోడ్ కి ఇదే హైలెట్గా నిలిచింది. తన మలేషియా బండారం బయటపడకుండా రోహిణి చేసిన ప్రయత్నాలు బాలు మీనాలకి కొత్త అనుమానాలని క్రియేట్ చేశాయి. ప్రస్తుతం బాలు మీనా రోహిణి బండారం గురించి బయట పెట్టే సందర్భాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా మరికొన్ని రోజుల్లో రోహిణి బండారం బయటపడుతుందని స్పష్టమవుతుంది.

Advertisement

Also Read: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. పొదరిల్లు లవర్స్ కు బ్యాడ్ న్యూస్..

ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ..

బాలు ఆ తాతయ్య వాళ్ళ దగ్గర తన ఫోను ఎలా వచ్చింది తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.. ఒక అమ్మాయి వచ్చి చెప్పు కుట్టించుకుని అక్కడ ఫోన్ పడేసుకుంది అని చెప్పగానే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని బాలు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో రోహిణి అలాగే విద్యపై అనుమానాలు మొదలవుతాయి. శివ గురించి వీడియోని బయటపెట్టింది రోహిణి అన్న బాలు అనుమానం నిజమయ్యేలా కనిపిస్తుంది. ఆ ఫోన్ కొట్టేసింది నేనే అని తెలిస్తే మాత్రం నన్ను బాలు చంపేస్తాడు అని రోహిణి భయపడిపోతూ ఉంటుంది.. ప్రస్తుతం విద్యను ఫోటో తీసిన మేన ఆ ఫోటోలను ఆ ముసలి దంపతులకు చూపించి ఫోన్ పడేసుకునింది వీళ్లేనా అని కనిపెట్టే పనిలో ఉన్నారు.. బాలు మీనా ఇద్దరు కలిసి రోహిణి అసలు బండారం బయట పెట్టే క్షణాలు కూడా మరికొద్ది రోజుల్లోనే రాబోతున్నాయని స్పష్టంగా తెలుస్తుంది.. మలేషియా నుంచి రోహిణి రాలేదని తెలుసుకోవడం ప్రభావతి తనపై ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. ఇవాళ ఎపిసోడ్లో బాలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడో తెలియాలంటే అసలు మిస్ అవ్వకుండా ఎపిసోడ్ ని చూడాల్సిందే…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×