E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Balu : ‘గుండె నిండా గుడిగంటలు ‘ బాలు బ్యాగ్రౌండ్.. ఐటీ జాబ్ వదిలేసి..

Gundeninda Gudigantalu Balu : ‘గుండె నిండా గుడిగంటలు ‘ బాలు బ్యాగ్రౌండ్.. ఐటీ జాబ్ వదిలేసి..
Advertisement

Gundeninda Gudigantalu Balu : ప్రముఖ బుల్లితెర తెలుగు ఛానల్ స్టార్ మా లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు ఒకటే. ఇందులో హీరో పాత్రలో నటించిన బాలు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈయన ఒక తమిళ నటుడు. తమిళ ఇండస్ట్రీలో సీరియల్స్ చేస్తూ ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుసగా సీరియల్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సీరియల్ భారీ విజయాన్ని అందుకోవడంతో బాలు గురించి తెలుసుకోవాలని నెటిజెన్లు ఆతృత కనబరుస్తున్నారు. బాలు అసలు పేరు విష్ణు కాంత్.. తెలుగు ఆడియన్స్‌ బాలుని అక్కున చేర్చుకున్నారు. మీన, బాలు క్రేజీ కాంబోకి ప్రేక్షకాదరణ దక్కడంతో.. ఇతనికి మంచి ఫేమ్ వచ్చింది.. అయితే విష్ణు కాంత్ బ్యాగ్రౌండ్ అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన మగ్గం వర్క్ కూడా చేస్తాడని చాలామంది అనుకున్నారు. కానీ అతను ఒక జాబ్ చేసి నటనపై ఇంట్రెస్ట్ తో జాబ్ ను వదిలేసిన సంగతి చాలా మందికి తెలియదు..అతని ఏం చదివాడు? ఏం జాబ్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐటీ జాబ్ ను వదిలేసి సీరియల్స్ లో ఎంట్రీ.. 

కొంతమంది యాక్టర్స్ తమ గురించి పెద్దగా చెప్పుకోరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తన గురించి తన ఫ్యామిలీ గురించి, ఎన్నో ఆసక్తికర విషయాలలో పంచుకున్నారు. తాను చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తినంటూ తన కులవృత్తి మగ్గం నేయడాన్ని గురించి చెప్పుకొచ్చాడు.. అంతేకాదు తాను సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీ వైపు రావడానికి గల కారణాలను కూడా చెప్పుకొచ్చాడు.. గవర్నమెంట్ స్కూల్‌లోనే చదువుకున్నాను. డిప్లమో చేశాను. ఆ తరువాత మెరిట్‌లో గవర్నమెంట్ కాలేజ్‌లో ఇంజనీరింగ్ సీటు వచ్చింది. అయితే కొద్ది రోజులు ఐటీలో జాబ్ చేశాను.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను అని విష్ణుకాంత్ అన్నారు..

మగ్గం వృత్తిని ఎప్పటికీ వదలను.. 

Advertisement

తమిళ నటుడు విష్ణు కాంత్ కు తెలుగులో స్టార్ ఇమేజ్ వచ్చింది. అయితే ఈయన ఫ్యామిలీ మగ్గం పని చేస్తారు.మధ్యతరగతి ఫ్యామిలీ. మగ్గంనేయడం అనేది నా వృత్తి. కాబట్టి.. షూటింగ్ లేకపోతే నేను నా వృత్తిని చేసుకుంటా. నేను కింది స్థాయి వ్యక్తినే అని చాలా సార్లు బయట పెట్టారు. ఇంత స్టార్ ఇమేజ్ వచ్చిన సరే ఎప్పుడూ గర్వం లేకుండా సింపుల్ గానే ఉంటాడు బాలు. అందుకే తెలుగు ప్రేక్షకులు బాలు అంటే తెగ ఇష్టపడుతుంటారు.

Also Read:సంజనతో ఇమ్మానుయేల్ పోటీ.. పంతం నీదా, నాదా..ఫైనలిస్ట్ లోకి వెళ్ళేది ఎవరు..?

మంచి భార్య రావాలంటే వస్తుంది.. 

Advertisement

ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. ఆ పెళ్లి ఎన్నటికీ నిలవదు.. మన తలరాతలో ఏదైతే రాసిపెట్టి ఉంటుందో అదే జరుగుతుంది.. దేవుడు రాసిపెట్టిన అమ్మాయితోనే మన పెళ్లి జరుగుతుంది అని బాలు అన్నారు. బాలు ఆల్రెడీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మీ ఇద్దరు మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు.. ఇక తమిళ్‌ నుంచి తెలుగులోకి వచ్చినప్పుడు చాలా భయపడ్డాను. కానీ మెల్ల మెల్లగా తెలుగు నేర్చుకున్నాను. ఇప్పుడు పూర్తిగా తెలుగులోనే మాట్లాడుతున్నానని అంటున్నాడు.. ప్రస్తుతం బాలు నటిస్తున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్కు 35వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.. దీంతోపాటుగా తమిళ్లో కూడా పని సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×