E-Paper
Advertisement

అందుకే జబర్దస్త్ మానేశా.. ఇన్నాళ్లకు నిజాలు బయటపెట్టిన గెటప్ శ్రీను?

అందుకే జబర్దస్త్ మానేశా.. ఇన్నాళ్లకు నిజాలు బయటపెట్టిన గెటప్ శ్రీను?
Advertisement

Getup Srinu:బుల్లితెరపై నిర్విరామంగా ప్రసారమవుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్న కామెడీ షో జబర్దస్త్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అయితే ఈ షో ద్వారా ఎంతోమంది తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయారు. అయితే మరి కొంతమంది అనూహ్యంగా ఈ షో నుంచి బయటకు వచ్చి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి వారిలో గెటప్ శ్రీను కూడా ఒకరు. గతంలో భిన్న విభిన్నమైన గెటప్స్ తో ప్రేక్షకులను అలరించిన సుడిగాలి సుదీర్, ఆటో రామ్ ప్రసాద్ లతో కలిసి వందలాది స్కిట్స్ చేసి ప్రేక్షకులను మెప్పించారు.

జబర్దస్త్ కి రుణపడి ఉంటాను – గెటప్ శ్రీను

ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ అటు పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న గెటప్ శ్రీను ఉన్నట్టుండి జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గెటప్ శ్రీను మాట్లాడుతూ..”నేను కూడా సినిమాలోకి రావాలని మొదట ప్రయత్నించాను. అయితే నా వయసు చిన్నది కారణంగా అవకాశాలు లభించలేదు. ఆర్థిక ఇబ్బందులతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఇక తర్వాతే మల్లెమాల సంస్థ నాకు జీవితాన్ని ఇచ్చింది.. నాకు రెండవ జన్మస్థలం అయింది. ముఖ్యంగా నాకు లైఫ్ తో పాటు ఇల్లు, కారు, ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చింది జబర్దస్త్ మాత్రమే. అందుకే నేను ఎప్పటికీ జబర్దస్త్ కి రుణపడి ఉంటాను అంటూ తెలిపారు..

Advertisement

also read:టీవీల్లోకి జన నాయగన్.. యజమాని అరెస్ట్!

అందుకే జబర్దస్త్ కి దూరం – గెటప్ శ్రీను

ఇకపోతే ఇంత ఇస్తున్నప్పుడు మనం కూడా తిరిగి ఇవ్వాలి అనే బాధ్యతతో అక్కడ కొనసాగాను. కానీ రంగస్థలం వంటి సినిమాలు చేస్తున్నప్పుడు టీవీ షెడ్యూల్స్ కారణంగా సినీ దర్శకులు నాకు డేట్లు ఇవ్వడానికి వెనుకాడరు. అందుకే నాన్నకు ప్రేమతో వంటి మంచి సినిమా అవకాశం కోల్పోయాను. టీవీలో బిజీగా ఉన్నావు కదా.. డేట్స్ సమస్య అవుతాయని చెప్పేవారు. సుమారు 9, 10 వ సంవత్సరంలోనే నా సినీ కెరియర్ కు మరింత సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నాను. ఇక నా నిర్ణయాన్ని మల్లెమాల సంస్థ శ్యామ్ అర్థం చేసుకొని.. ఆల్ ది వెరీ బెస్ట్ శ్రీను.. నీకోసం మల్లెమాల ఎప్పుడూ గేట్లు తెరిచే ఉంటుంది అని చెప్పడంతో నాలో గౌరవాన్ని మరింత పెంచారు. మల్లెమాల సంస్థ నా జీవితానికి ఎంతగానో సహాయపడింది. నా ఇంటి తలుపు పై కూడా ఆ సంస్థ పేరు ఉంటుంది. ఇకపోతే జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీ చాలా అద్భుతమైనది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు నన్ను జబర్దస్త్ శ్రీను అనే సంబోధిస్తున్నారు. కానీ ఇప్పుడు సినిమాలలో బిజీగా మారడం వల్ల జబర్దస్త్ కి దూరంగా ఉన్నాను అంటూ అసలు విషయాన్ని చెప్పేశారు గెటప్ శ్రీను.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×