E-Paper
Advertisement

20 ఏళ్లు వర్సెస్ 5 ఏళ్లు.. ఇరాన్, యూఎస్ చర్చలు నిలిచిపోవడానికి కారణం ఇదేనా?

20 ఏళ్లు వర్సెస్ 5 ఏళ్లు.. ఇరాన్, యూఎస్ చర్చలు నిలిచిపోవడానికి కారణం ఇదేనా?
Advertisement

Iran US Talks: ఇటీవల పాకిస్థాన్‌లో ఇరాన్, అమెరికాల మధ్య జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. చర్చలు విఫలమవ్వడానికి అసలు కారణం టెహ్రాన్ అణు కార్యకలాపాలుగా తెలుస్తోంది. అమెరికా తన ప్రతిపాదనలో ఇరాన్ 20 ఏళ్ల పాటు యురేనియం శుద్ధిని నిలిపివేయాలని డిమాండ్ చేస్తుంది. కానీ ఇరాన్ మాత్రం కేవలం ఐదేళ్లు మాత్రమే యురేనియం శుద్ధిని నిలిపివేస్తామని టెహ్రాన్ తెలిపినట్లు ది న్యూయార్క్ టైమ్స్ నివేదికలో తెలుస్తోంది. ఇస్లామాబాద్ లో జరిగిన చర్చల సందర్భంగా ఇరాన్ అణు కార్యకలాపాలను నిలిపివేసేందుకు అమెరికా ప్రతిపాదనలు చేసింది. కానీ ఒప్పందం కాలపరిమితి విషయంలో ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం.

యురేనియం శుద్ధిని ఐదేళ్ల వరకు నిలిపివేస్తామని టెహ్రాన్ ప్రతిపాదించింది. ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. 20 ఏళ్ల పాటు యురేనియం శుద్ధిని నిలిపివేయాలని అమెరికా పట్టుబడుతుంది. గతంలో టెహ్రాన్ అణు శుద్ధిని శాశ్వతంగా నిలిపివేయాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. తాజాగా ట్రంప్ తీరులో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. పన్నెండున్నర సంవత్సరాల పాటు నిలిపివేసే ఒప్పందాన్ని అమెరికా, ఇరాన్‌లు ఖరారు చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అణు కార్యక్రమంపై చర్చలు విఫలం

Advertisement

అమెరికా, ఇరాన్‌ల మధ్య ఇటీవల జరిగిన సమావేశం.. దశాబ్దానికి పైగా కాలంలో వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య జరిగిన డైరెక్ట్ మీటింగ్ అని విశ్లేషకులు చెబుతున్నారు. 1979 నాటి ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత జరిగిన అత్యున్నత స్థాయి చర్చలు ఇవేనని అంటున్నారు. టెహ్రాన్ అణు కార్యకలాపాలపై ఇరు దేశాలు ఒక కొలిక్కి రాకపోవడంతో చర్చలు నిలిచిపోయాయి. కానీ చర్చల మార్గం తెరిచే ఉందని ఇరు దేశాల ప్రతినిధులు చెబుతున్నారు. శాంతి ఒప్పందానికి మరో మార్గం ఉండవచ్చని అధికారులు తెలిపారు. అయితే ఇటీవల కుదిరిన కాల్పుల విరమణకు బ్రేక్ పడే అవకాశం ఉందని తెలుస్తోంది. సోమవారం అమెరికా సైన్యం ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించడం మొదలుపెట్టింది.

ఇస్లామాబాద్‌లో ఏం జరిగింది?

ఇస్లామాబాద్ లో… టెహ్రాన్ యురేనియం శుద్ధి కార్యక్రమం, చమురు నౌకలకు ప్రధాన రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయడం, టెహ్రాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లోని విలాసవంతమైన సెరీనా హోటల్‌లో ఈ చర్చలు రెండు వేర్వేరు విభాగాల్లో జరిగాయి. హోటల్ లో ఒకటి ఏరియాను అమెరికా ప్రతినిధులకు, మరొకటి ఇరాన్ ప్రతినిధులకు, ఇంకొకటి పాకిస్తానీ మధ్యవర్తులకు కేటాయించారు. ప్రధాన చర్చలు జరిగే గదిలోకి ఎవరూ ఫోన్‌లు తీసుకెళ్లడానికి అనుమతి లేదు. దీంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖాలిబాఫ్‌తో సహా ప్రతినిధులు బ్రేక్ సమయంలో మాత్రమే తమ ప్రాంతాలకు సందేశాలు పంపడానికి బయటకు వెళ్లవలసి వచ్చింది.

Advertisement

Also Read:  అమెరికాకు ఇరాన్ మరొక హెచ్చరిక.. ముప్పు వాటిల్లితే, ఏ పోర్టు సేఫ్‌గా ఉండదంటూ..

20 గంటలకు పైగా చర్చలు

ఈ చర్చలు 20 గంటలకు పైగా సాగినట్లు తెలుస్తోంది. చర్చల సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కాస్త తీవ్రంగానే మాట్లాడరని ఇరాన్ వర్గాలు తెలిపాయి. గత జెనీవా చర్చలు కొనసాగుతున్న తరుణంలోనే అమెరికా దాడికి పాల్పడిందని, ఇలాయితే ఎలా నమ్మగలం? అని ఆయన అన్నట్లు ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి. జెనీవాలో ఇరుపక్షాలు చర్చలు జరిపిన రెండు రోజుల తర్వాత ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి ప్రారంభించాయి. హర్మూజ్, ఆంక్షలు, ఇతర అంశాలపై ఇరు ఇరుపక్షాలు ఏకీభవించలేదని తెలుస్తోంది. వాషింగ్టన్ యురేనియం శుద్ధి, హర్మూజ్‌పై దృష్టి సారించగా, టెహ్రాన్ మాత్రం పలు అంశాలను అమెరికా ముందు ఉంచిందని విశ్లేషకులు చెబుతున్నారు.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×