E-Paper
Advertisement

లవ్ ఫెయిల్యూర్ డిప్రెషన్ లో ఎక్స్ ప్రెస్ హరి..రోడ్ల పై పిచ్చోడిలా తిరిగా అంటూ!

లవ్ ఫెయిల్యూర్ డిప్రెషన్ లో ఎక్స్ ప్రెస్ హరి..రోడ్ల పై పిచ్చోడిలా తిరిగా అంటూ!
Advertisement

Express Hari: ఎక్స్ ప్రెస్ హరి పరిచయం అవసరం లేని పేరు. స్టాండప్ కమెడియన్ గా పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్న హరి పటాస్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు .ఈ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన బుల్లితెరపై పలు కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. హరి తన అద్భుతమైన కామెడీతో పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం హరి ఆదివారం విత స్టార్ మా పరివార్ కార్యక్రమంలో శ్రీముఖి అవినాష్ తో పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. బుల్లితెర కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హరి ఒకానొక సమయంలో ఆశు రెడ్డితో ప్రేమలో ఉన్నారు అంటూ అప్పట్లో వార్తలు బయటకు వచ్చాయి. అయితే అవన్నీ నిజం కాదని తెలుస్తోంది.

సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్న హరి..

ఇదిలా ఉండగా ఇటీవల ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన లవ్ బ్రేకప్ గురించి హరి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నానని అయితే తను నన్ను మోసం చేసిందని తెలిపారు. ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను సూసైడ్ కూడా చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని హరి తెలిపారు. ప్రేమకు ఎంత పవర్ ఉందో నాకు అప్పుడే తెలిసింది ఒకరోజు అమ్మాయి నాతో మాట్లాడకపోతే తట్టుకోలేకపోయాను.

రోడ్లపై పిచ్చోడిలా తిరిగాను..

Advertisement

ఒకరోజు తనకు 96 మిస్డ్ కాల్స్ ఇచ్చానని 97వ సారి ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అంటూ మాట్లాడిందని హరి తెలిపారు. ఓసారి వైజాగ్ వస్తాను నన్ను కలవమని చెప్పింది. తను చెప్పిన ప్లేస్ కి వెళ్లాను తనకోసం గంటల తరబడి ఎదురుచూసిన రాలేదు ఫోన్ చేస్తే నేను అక్కడ లేను అంటూ మాట్లాడింది. ఇలా తనకోసం పిచ్చోడిలా రోడ్లపై తిరిగానని, ఆ క్షణం నేనెందుకు ఇలా తనకోసం ఎర్రి పప్పులా తిరుగుతున్నాను అనిపించింది ఆ సమయంలో నేరుగా నేను గుడికి వెళ్లి అక్కడ కాసేపు కూర్చొని బాగ ఏడ్చేసానని ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోయానని హరి తెలిపారు.

ప్రతి ఒక్క సంఘటన గుణపాఠమే..

Advertisement

ఇలా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సంఘటన మనకు ఒక గుణపాఠం లాంటిదే అంటూ హరి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన మాత్రం తన బ్రేకప్ గురించి చెప్పినప్పటికీ ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. ఇలా హరి లవ్ బ్రేకప్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక హరి కెరియర్ విషయానికి వస్తే పటాస్ జబర్దస్త్ వంటి కార్యక్రమాలు ఈయనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చాయి. ముఖ్యంగా అశు రెడ్డితో లవ్ ట్రాక్ కారణంగా వార్తల్లో నిలిచారు. ఏకంగా ఆమె పేరును టాటూగా తన గుండెలపై వేసుకోవడం, ఆశు రెడ్డి బైక్ గిఫ్ట్ గా ఇవ్వడం వంటివి చూసి నిజంగానే వీరిద్దరూ లవ్ లో ఉన్నారా అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ అదంతా నిజం కాదని, షో కోసమే అలా చేశారని స్పష్టం అయ్యింది.

Also Read: వామ్మో శ్రీముఖి తెరపై కనపడాలంటే లక్షలు ఇవ్వాల్సిందేనా.. భారీగా సంపాదిస్తున్న రాములమ్మ?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×