E-Paper
Advertisement

BSNL మరో సూపర్ ప్లాన్.. ఈసారి 84 రోజులు.. 252 GB డేటా, అపరిమిత కాల్స్!

BSNL మరో సూపర్ ప్లాన్.. ఈసారి 84 రోజులు.. 252 GB డేటా, అపరిమిత కాల్స్!
Advertisement

BSNL Plan: ప్రభుత్వ రంగం టెలికాం సంస్థ బీఎస్‌ఎన్ఎల్ (BSNL) అతి తక్కువ ధరలోనే అద్భుతమైన ప్లాన్స్ అందిస్తుంటుంది. ప్రైవేటు టెలికాం కంపెనీలైన ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్ ఐడియాతో పోలిస్తే.. చీపెస్ట్ ప్లాన్స్ ఆఫర్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. అయితే బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.599 ప్లాన్ అత్యంత ప్రజాధరణ కలిగి ఉంది. ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో అధిక డేటాను కోరుకునేవారికి ఈ ప్లాన్ ఓ వరంలాగా మారిపోయింది.

రూ. 599 రీఛార్జ్ ప్లాన్

బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన అత్యుత్తమ ఆల్ రౌండ్ ప్లాన్ గా దీనిని చెబుతుంటారు. 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ప్రతీ రోజూ 3GB హై స్పీడ్ డేటాను పొందవచ్చు. అంటే ప్లాన్ పూర్తయ్యే సరికి 252 GB యూజర్ కు లభిస్తుంది. ఒకవేళ రోజూవారీ డేటా కోటా అయిపోతే 40kbps వేగంతో అపరిమితంగా డేటా వాడుకోవచ్చు. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా చేసుకోవచ్చు.

అదనపు లాభాలు..

Advertisement

బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ కింద మరికొన్ని అదనపు ప్రయోజనాలను సైతం తన యూజర్లకు అందిస్తోంది. జింగ్ (Zing), హార్డీ గేమ్స్, ఆస్ట్రోటెల్ వంటి అదనపు సబ్‌స్క్రిప్షన్లు కూడా ఈ ప్లాన్‌తో పాటు అందుబాటులో ఉంటాయని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఎవరికి లాభం?

ఈ ప్లాన్ అన్ని వర్గాల యూజర్లకు ప్రయోజనకరంగా ఉండనుంది. ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థులకు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు, యూట్యూబ్ – ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వీడియోలు ఎక్కువగా (రోజూ 3GB డేటా) చూసే వారికి బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. సెకండరీ సిమ్ వాడుతున్న వారికి సైతం రూ.599 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా లబ్ది పొందవచ్చు.

Advertisement

Also Read: AC Mistakes: ఇంట్లో ఏసీ ఉందా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే ఏ క్షణమైనా..!

ఎలా రీఛార్జ్ చేయాలంటే?

ఈ ప్లాన్ 4 రకాల పద్దతుల్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. మెుదటి పద్దతిలో ‘BSNL Selfcare’ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ నంబర్ నమోదు చేసి నేరుగా రీఛార్జ్ చేయవచ్చు. లేదంటే బీఎస్‌ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ portal.bsnl.inలో ‘క్విక్ రీఛార్జ్’ ఆప్షన్ ద్వారా మీ మొబైల్ నంబర్ ఇచ్చి రీఛార్జ్ చేసుకోవచ్చు. అలా కుదరని పక్షంలో థర్డ్ పార్టీ యాప్స్ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పేలోకి వెళ్లి ఈ ప్లాన్ సొంతం చేసుకోవచ్చు.

Also Read: Airtel IPL Plans: ఎయిర్‌టెల్ ధమాకా ప్లాన్స్.. ఫ్రీ హాట్‌స్టార్, నాన్ స్టాప్ 5G డేటా.. ఐపీఎల్ లవర్స్‌కు మాస్ జాతరే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×