E-Paper
Advertisement

Kissik Talks: ఎంతమంది చేసుకోలేదు.. నేనొక్కదాన్నే రెండేసి పెళ్లిళ్లు చేసుకున్నానా? – దువ్వాడ మాధురి

Kissik Talks: ఎంతమంది చేసుకోలేదు.. నేనొక్కదాన్నే రెండేసి పెళ్లిళ్లు చేసుకున్నానా? – దువ్వాడ మాధురి
Advertisement

Kissik Talks: తన భర్త దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) కోసం పెద్ద యుద్ధమే చేశానని చెప్పిన దువ్వాడ మాధురి (Duvvada Madhuri).. నేనొక్కదాన్నే రెండేసి పెళ్లిళ్లు చేసుకున్నానా? దేశంలో ఎంత మంది చేసుకోలేదు? అంటూ ప్రశ్నించారు. తాజాగా ఆమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Kissik Talks) పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో మహిళలు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుంది? తన రెండో పెళ్లి సందర్భంగా ఎలాంటి నెగిటివ్‌ని ఫేస్ చేసింది? రాజకీయాలతో ఏమేం కోల్పోయింది? వివరంగా చెప్పారు. అంతేకాదు, ఈసారి జరిగే ఎన్నికలలో కచ్చితంగా తన భర్త దువ్వాడ గెలుస్తారని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..

Also Read- Kissik Talks: ప్రతి నెలా రూ. 50 లక్షల గోల్డ్ కొంటా.. వర్కర్స్‌కి శాలరీ ఎంత ఇస్తానంటే – మాధురి

ఎంతమంది రెండేసి పెళ్లిళ్లు చేసుకోలేదు

Advertisement

‘‘ఇక్కడందరికీ ఒకటి చెప్పాలి.. ఒక మహిళ రాజకీయాల్లోకి వచ్చిందంటే.. ఎంత బురద చల్లాలో అంత చల్లుతారు. ఎంతమంది రెండేసి పెళ్లిళ్లు చేసుకోలేదు.. నేనొక్కదాన్నే రెండేసి పెళ్లిళ్లు చేసుకున్నానా? పొలిటికల్‌గా ఉన్నాను కాబట్టే, ఈ విషయంలో నన్ను ఇంత నెగిటివ్ చేశారు. ‘దేవుడికి ఏదైనా చెప్పుకోవాలి’ అనుకుంటే మాత్రం.. నా ఫస్ట్ భర్తే దువ్వాడ శ్రీనివాస్ అయితే బాగుండేదని చెబుతా. ‘దేవుడు ఏం కావాలి?’ అని అడిగితే.. ‘మా ఆయన ఈసారి ఎమ్మెల్యే అయితే చాలు’ అని కోరుకుంటా. ఎందుకంటే, అది మా ఆయన కోరిక. ఆయనకు ప్రజల్లో చాలా ఫాలోయింగ్ ఉంది. చాలా అభిమానం ఉంది. కానీ, అక్కడ అపోనెంట్ అచ్చెన్నాయుడు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్లు ఎక్కువగా రిగ్గింగ్‌లు చేయడం, రౌడీయిజం చేయడం ఎక్కువైపోయింది. అందుకే మా ఆయన వాళ్లకి వార్నింగ్ ఇచ్చారు.

Also Read- Harish Shankar: నీకు నచ్చినట్టు తీస్తే మాకు ఎందుకు చూపించావ్? డైరెక్టర్ హరీష్ శంకర్ పై ట్రోల్స్!

మమ్మల్ని నాశనం చేశారు

Advertisement

ఆ వార్నింగ్ ఇవ్వడానికి కారణం, అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) మనిషి ఒకరు కాల్ చేసి, ‘నిమ్మాడ జంక్షన్ దగ్గర మీ ఇద్దరిపై దాడి చేస్తారంట..’ అని చెప్పాడు. దానికి మా ఆయన ‘మీరేంట్రా దాడి చేసేది. నేనే వచ్చాను జంక్షన్‌కు.. ఎవడు వస్తాడో రండి?’ అని సవాల్ విసిరారు. ఈ రాజకీయాల కారణంగా వ్యాపారాల పరంగా కూడా చాలా కోల్పోయాం. రూ. 50 కోట్లు మైన్స్‌లో లాస్ అయ్యాం. ఇంకో మైన్ ఆపేశారు. పోర్ట్‌లో బిల్స్ ఆపేశారు. ఈ రాజకీయాలను అడ్డం పెట్టుకుని, మమ్మల్ని చాలా నాశనం చేశారు’’ అని దువ్వాడ మాధురి తమ జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చెప్పుకొచ్చారు. అయినా సరే, నిలబడతామని, ఈసారి కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Also Read- Duvvada Madhuri: ప్రపంచంతోనే ఫైట్ చేశా.. చాలా బాధగా ఉండేది!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×