E-Paper
Advertisement

Smartphone comparison: Oppo A6s 5G vs iQOO Z11x vs Lava Blaze Duo 3: బడ్జెట్ 5G రేసులో ఏది బెస్ట్?

Smartphone comparison: Oppo A6s 5G vs iQOO Z11x vs Lava Blaze Duo 3: బడ్జెట్ 5G రేసులో ఏది బెస్ట్?
Advertisement

Oppo A6s 5G vs iQOO Z11x vs Lava Blaze Duo 3 Smartphone comparison: ఈ వారం భారత మార్కెట్లోకి Oppo A6s 5G అడుగుపెట్టింది.దీంతో  బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ల మధ్య పోటీ మరింత ముదిరింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న iQOO Z11x 5G, Lava Blaze Duo 3 ఫోన్లకు ఇది గట్టి పోటీనిస్తోంది. పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ కోరుకునే వారి కోసం ఈ మూడు ఫోన్లలో ఏది బెటర్ ఆప్షనో ఇప్పుడు చూద్దాం.

ధరల వివరాలు:

Oppo A6s 5G:  4GB + 128GB వేరియంట్ లో వస్తున్న దీని  ధర ₹18,999, అలాగే 6GB + 128GB వేరియంట్ లో వస్తున్న  మోడల్ ధర రూ.20,999.

Advertisement

iQOO Z11x 5G:  6GB + 128GB బేస్ వేరియంట్‌తో ₹18,999 కే లభిస్తుండగా దీని టాప్ ఎండ్ 8GB + 256GB మోడల్ ధర రూ.22,999 లో దొరుకుతుంది.

Lava Blaze Duo 3: ఇది కేవలం రూ.16,999 (6GB + 128GB) కే లభిస్తూ అన్నింటి  కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

డిస్‌ప్లే మరియు సాఫ్ట్‌వేర్

Advertisement

డిస్‌ప్లే విషయానికొస్తే, iQOO Z11x 6.76-అంగుళాల భారీ స్క్రీన్‌తో వస్తోంది. అయితే, మన దేశీ బ్రాండ్ Lava Blaze Duo 3 ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తుంది, ఎందుకంటే ఇందులో మెయిన్ డిస్‌ప్లేతో పాటు వెనుక వైపు 1.6-అంగుళాల సెకండరీ AMOLED స్క్రీన్ కూడా ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా iQOO ఫోన్ లేటెస్ట్ Android 16 ఆధారిత OriginOS 6 తో వస్తుండటం ఇక్కడ  విశేషం.

పెర్ఫార్మెన్స్ మరియు బ్యాటరీ

Oppo A6s 5G: ఇందులో MediaTek Dimensity 6300 చిప్‌సెట్ తో వస్తున్న ఈ ఫోన్  6,500mAh బ్యాటరీ సపోర్ట్ తో వస్తుంది.

iQOO Z11x 5G:  Dimensity 7400 Turbo పవర్‌ఫుల్‌ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్  బ్యాటరీ ఏకంగా 7,200mAh ఉండటం విశేషం,  మూడింటిలోనూ  ఇదే అతిపెద్దదండోయ్ .

Lava Blaze Duo 3:ఇందులో Dimensity 7060 ప్రాసెసర్ మరియు 5,000mAh బ్యాటరీ ఉన్నాయి.

also read:Relationship Secrets: అత్తింట్లో అడుగుపెడుతున్నారా? ‘క్వీన్’ లా ఉండాలంటే ఈ 5 స్మార్ట్ టిప్స్ మీకోసమే!

కెమెరాలు:

ఇక మూడు ఫోన్లలోనూ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాలు ఉన్నప్పటికీ, సెల్ఫీ విషయానికొస్తే iQOO Z11x 5G (32MP ఫ్రంట్ కెమెరా) మిగిలిన రెండింటి కంటే చాలా ముందుండటం విశేషం . ఇక లావా మరియు ఒప్పో ఫోన్లలో వరుసగా 8MP మరియు 5MP సెల్ఫీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి.

ఏది కొనాలి?

Oppo A6s 5G: మీకు మంచి బ్యాటరీ లైఫ్ మరియు స్మార్ట్ AI ఫీచర్స్ కావాలనుకుంటే మాత్రం  ఇది మంచి ఛాయిస్ అని చెప్పకతప్పదు.

iQOO Z11x 5G: మీకు తిరుగులేని పెర్ఫార్మెన్స్ మరియు  భారీ బ్యాటరీ (7200mAh), మరియు వాటర్ రెసిస్టెన్స్ (IP68/69) కావాలంటే మాత్రం  దీనికే ఓటు వేయండి.

Lava Blaze Duo 3:ఇక తక్కువ ధరలో యూనిక్ డిజైన్ (డ్యూయల్ డిస్‌ప్లే) మరియు క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవం కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

also read :Xiaomi 17T Pro: స్మార్ట్‌ఫోన్ హిస్టరీని తిరగరాయడానికి వస్తున్న ‘మోన్స్టర్’.. 8500mAh బ్యాటరీతో మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×