E-Paper
Advertisement

అవినీతి మరకలేని వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్.. అందుకే అరెస్ట్ చేయలేకపోయారు- మాధురి

అవినీతి మరకలేని వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్.. అందుకే అరెస్ట్ చేయలేకపోయారు- మాధురి
Advertisement

Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో దువ్వాడ మాధురి (Dhuvvada Madhuri) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె దువ్వాడ శ్రీనివాస్ గొప్పతనం ఏంటో చెప్పారు. ఎటువంటి అవినీతి మరకలేని వ్యక్తి కాబట్టే, ఇప్పుడున్న ప్రభుత్వం అరెస్ట్ చేయలేకపోతుందని తెలిపారు. ఇంకా ఆమె ఈ ఇంటర్వ్యూలో ఏమేం చెప్పారంటే..

అలాంటి రోజు ఎప్పుడొస్తుందో..

డబ్బులు తీసుకొని ఓట్లేసే వాళ్ళు ఇష్టమా.. డబ్బులు తీసుకోకుండా జెన్యూన్ గా ఓట్లేసే ప్రజలంటే ఇష్టమా? అని దువ్వాడ మాధురిని అడిగితే.. ‘‘నాకు రాజకీయం డబ్బుతో ముడిపెట్టడం అసలు ఇష్టం ఉండదు. రాజకీయం అనేది ప్రజల కోసం చేయాలనే ఆలోచన ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి. సో.. డబ్బు అనే ఆలోచన ఉంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు, వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. మనుషులు కూడా ఎలా ఉంటున్నారంటే.. ఆ టైంలో ఎలక్షన్ టైంలో డబ్బులు తీసుకుని ఎవరికో ఒకరికి ఓటేసే ఆలోచనలో ఉన్నారు, తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ని మర్చిపోతున్నారు. సో డబ్బు కోసం ఆలోచించకుండా ఓటేసే సిట్యుయేషన్ ఇంకెప్పుడు ఇండియాలో వస్తుందో నాకైతే తెలీదు’’ అని అన్నారు దువ్వాడ మాధురి.

Advertisement

Also Read- అత్యాశకు పోతున్న ‘పెద్ది’ నిర్మాత.. అసలుకే మోసం వస్తుందేమో!

రిగ్గింగ్, రౌడీయిజమే కారణం

మీ వెనుక ఎప్పుడూ అంత మంది ఉంటారు కదా.. మరి దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికలలో ఎందుకు ఓడిపోయారు? అని అడిగితే.. ‘‘ఆయనంటే ప్రజల్లో చాలా అభిమానం ఉంది. ఇప్పటికీ నేను చూస్తూనే ఉన్నాను పబ్లిక్ లోకి వెళ్తూ ఉంటే.. ప్రజలు చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు. కానీ అక్కడ అపోనెంట్ అచ్చెన్నాయుడు.. వాళ్ళు ఎక్కువగా రిగ్గింగ్‌లు చేయడం, రౌడీయిజం చేయడం చాలా ఎక్కువ. మా ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు మూడు వేల ఓట్లతో ఓడిపోయారు. అవి కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అప్పుడు లెక్కపెట్టమంటే లెక్కపెట్టకుండా చాలా రచ్చ చేశారు అక్కడ, లేకపోతే అప్పుడు అతను ఎంపీ అయ్యి ఉండేవారు. చాలా తక్కువ ఓట్లతో ఓడిపోతారు ఆయన ఎందుకంటే.. రౌడీయిజం, ఇలాంటి దొంగ రాజకీయాలు, ఇలాంటి డబ్బు వీటివల్లే.. ఎప్పుడూ ఓడిపోతూ ఉంటారు. వ్యాపారంగా కూడా చాలా కోల్పోయారు.. మైన్స్ కోల్పోయాం. మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో మేము ఫిఫ్టీ క్రోర్స్ మైన్స్ లో లాస్ అయ్యాం, ఇంకొక మైన్ ఆపేశారు, కోర్టులో బిల్స్ ఆపేశారు. మమ్మల్ని చాలా నాశనం చేశారు రాజకీయంగా. అయినా సరే, ఆయన ఇంకా ప్రజలే అంటారు, ప్రజలతోనే ఉంటారు. నీతిగా రాజకీయం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, అది దువ్వాడ శ్రీనివాస్ మాత్రమే. ఆయన మీద ఒక్క మచ్చ కూడా ఉండదు’’ అని మాధురి పేర్కొన్నారు.

Advertisement

Also Read- మనీకా? రిలేషన్స్‌కా? దేనికి వేల్యూ ఇస్తారంటే? దువ్వాడ మాధురి ఆన్సర్ ఇదే!

తప్పు చేయలేదు కాబట్టే..

మీరు ఇంటర్వ్యూస్ అప్పుడు అంతా ఫటాఫట్ ఇచ్చేస్తారు కదా! మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా మిమ్మల్ని ఎటాక్ చేయడం గానీ, మిమ్మల్ని ఏదైనా చేయాలని ట్రై చేయడం గానీ అట్లా ఏదైనా జరిగిందా? అంటే.. ‘‘అంత సీన్ ఎవరికీ లేదు. మా మీద ఎవరూ ఏమి చేయకపోవడానికి రీజన్ ఒకటే, ఎందుకంటే ఆయన మీద అవినీతి మరకలు లేవు కాబట్టి. అలా ఉన్నవాడు ఎప్పుడైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటాడు. తప్పు చేసినవాడు వాళ్ళ కాళ్ళు, వీళ్ళ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుకొని ఉంటాడు. శ్రీనివాస్ అనే వాడు ఎప్పుడూ కూడా ఏ అవినీతి చేయలేదు, పదవీ దుర్వినియోగం చేయలేదు, ఎక్కడా భూ కబ్జాలు చేయలేదు, ఎక్కడా ఒక్క రూపాయి లంచం తీసుకోలేదు. సో.. దేనికి భయపడాలి? అందుకే స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్వశ్చన్ చేస్తారు, అన్యాయం జరిగితే కుండ బద్దలు కొట్టి మరీ అడుగుతారంటే.. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం.. తప్పు చేయలేదు కాబట్టి వచ్చిన ధైర్యం అది.

చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు

అందుకే ఇంతవరకు స్టేట్‌లో అంతమంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు, శ్రీనివాస్‌ని ఏమీ చేయలేకపోయారు ఎందుకంటే అవినీతి మరక లేదు కాబట్టి. మమ్మల్ని ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయగలరు? ఇలాంటి తిరుపతిలో చిన్న చిన్న ఇష్యూస్ చేస్తారు, అంతకు మించి ఏం చేయలేరు కదా! కేక్ కట్ చేశారని ఒక ఇష్యూ కేసు పెట్టడం, రీల్స్ చేయకుండా రీల్స్ చేశారని చెప్పి కేసు పెట్టడం వంటి చీప్ ట్రిక్స్ చేస్తారు తప్పితే ఇంకెవరూ మమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం కూడా వాళ్ళకి లేదు’’ అని చెప్పుకొచ్చారు మాధురి.

Also Read- తిరుమల కేక్ వివాదంపై మాధురి క్లారిటీ.. నేనెవరికీ క్షమాపణ చెప్పలేదు.. చెప్పనంటూ..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×