E-Paper
Advertisement

Chamanthi Serial : ‘చామంతి’ హీరోయిన్ ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?

Chamanthi Serial : ‘చామంతి’ హీరోయిన్ ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?
Advertisement

Chamanthi Serial : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో చామంతి సీరియల్ ఒకటి.. ఈ సీరియల్ డిఫరెంట్ స్టోరీ తో వచ్చింది.. హీరోయిన్ పాత్రలో మేఘన లోకేష్ నటిస్తున్నారు.. రోజురోజుకి ఈ సీరియల్కు క్రేజీ పెరిగిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. ప్రముఖ తెలుగు ఛానల్ జీ తెలుగులో ఈ సీరియల్ ప్రసారమవుతుంది.. అయితే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న మేఘన లోకేష్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. గతంలో ఈమె అనేక సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది.. ఇక ఈమె గురించి ఈరోజు ఒక వార్తా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈమె ఏం చదువుకుంది అన్నది సస్పెన్స్ గా మారింది. మరి మేఘన లోకేష్ ఏం చదువుకుంది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

‘చామంతి’ హీరోయిన్ ఏం చేసేదో తెలుసా..?

బుల్లితెరపై ప్రస్తుతం హీరోయిన్లుగా రాణిస్తున్న చాలామంది ముద్దుగుమ్మలు బాగానే చదువుకున్నారు. అయితే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు కొత్త సీరియల్స్లలో కనిపిస్తున్నారు. అలాగే మేఘన లోకేష్ కూడా నటనపై ఇంట్రెస్ట్ ఉండడంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినట్లు గతంలో అనేక ఇంటర్వ్యూలలో బయటపెట్టింది.. కర్ణాటకలోని మైసూర్ లో పుట్టిపెరిగిన ఈమె తన చదువుని కూడా పూర్తి చేసింది. అది 8వ యాట ఉన్నప్పుడే ఆమెకి నాటక రంగంలో అవకాశాలు రావడంతో ఒకవైపు చదువు పాడవకుండా నాటకాలు చేసుకునేది.. ఏదోలాగా డిగ్రీ వరకు ఆమె చదివింది.. అప్పట్లోనే ఆమె దాదాపు 270 కి పైగా స్టేజ్ షోలు ఇచ్చినట్లు తెలుస్తుంది.. ఆ తర్వాత కన్నడ టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి వరసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది.. పలు సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా సీరియల్స్ చేస్తూ తన నటనతో మెప్పిస్తూ బిజీగా మారిపోయింది.

Advertisement

Also Read : ‘గుండెనిండా గుడిగంటలు ‘ రాజేష్ రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్..?

మేఘన లోకేష్ సీరియల్స్…

మేఘన లోకేష్ మొదటగా కన్నడ ఇండస్ట్రీలోనే తన కెరియర్ ని స్టార్ట్ చేసింది.. ముందుగా దేవి అనే సీరియల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో ఆమె సపోర్టింగ్ రోల్ లో నటించి తన నటనతో మంత్రముగ్ధుల్ని చేసింది.. స్టార్ మాలో ప్రసారం అయిన శశిరేఖా పరిణయం సీరియల్ మంచి క్రేజ్ ను అందించింది. అదే విధంగా ఇకపోతే జీ తెలుగు కల్యాణ వైభోగమే సీరియల్‌లో ‘మంగ’, ‘నిత్య’ అనే రెండు విభిన్నమైన డ్యూయల్ రోల్ చేసి ఆకట్టుకుంది.. ఒకవైపు వరుసగా సీరియల్స్ చేస్తూనే మరోవైపు తన ప్రేమలో మునిగిపోయింది. స్వరూప్ భరద్వాజ్ తో ప్రేమలో పడిన ఈమె ఇంట్లో వాళ్ళని అతి కష్టం మీద ఒప్పించి పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది.. ప్రస్తుతం ఒక వైపు ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూనే మరోవైపు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది ఇప్పుడు ఈమె జీ తెలుగులో ప్రసారం చామంతి సీరియల్ హీరోయిన్ గా నటిస్తుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×