E-Paper
Advertisement

అనాథాశ్రమం అమ్మాయిలను బలిచ్చే వార్డెన్… తినేటప్పుడు మాత్రం ఈ మూవీని అస్సలు చూడొద్దు

అనాథాశ్రమం అమ్మాయిలను బలిచ్చే వార్డెన్… తినేటప్పుడు మాత్రం ఈ మూవీని అస్సలు చూడొద్దు
Advertisement

Horror Movie on OTT: అనాథ ఆశ్రమం అంటే ఎలా ఉంటుంది ? అమ్మానాన్నలు లేని పిల్లలు అంతా ఒకే చోట ఉంటారు. వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి వార్డెన్ లు ఉంటారు. తల్లిదండ్రి, దైవం అన్నీ వార్డెన్ అనే అనుకుంటారు ఆ అనాథ పిల్లలు. కానీ అదే వార్డెన్ దెయ్యం అయితే, వాళ్ళ పాలిట శాపమైతే, ఏకంగా వాళ్ళను బలిచ్చే ఆలోచనలో ఉంటే… పాత అనాథాశ్రమంలో మరణించిన వారి ఆత్మలు ఇంకా తిరుగుతున్నట్టు ఉండే భయంకరమైన వాతావరణంలో నడిచే సినిమానే ఈరోజు మన మూవీ సజెషన్. ఇక్కడ ఒక చిన్న తప్పు 20 ఏళ్ల తర్వాత భయంకరమైన ప్రతీకారంగా మారుతుంది. ఆ మూవీ పేరే ‘The Queen of Black Magic’. మరి ఈ హర్రర్ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

హనీఫ్ అతని భార్య నదియా, ముగ్గురు పిల్లలతో కలిసి తన చిన్ననాటి అనాథాశ్రమానికి వెళ్తాడు. ఆ ఆశ్రమాన్ని నడిపిన వృద్ధుడు బండి తీవ్ర అనారోగ్యంతో మరణశయ్యపై ఉన్నాడు. హనీఫ్ చిన్నప్పటి స్నేహితులు ఆంటో, జెఫ్రీ కూడా తమ కుటుంబాలతో అక్కడికి వస్తారు. 20 ఏళ్ల తర్వాత అందరూ కలుసుకున్నందుకు మొదట్లో సంతోషం, గత జ్ఞాపకాలు, నవ్వులు… అంతా బాగానే ఉంటుంది. కానీ రాత్రి పడగానే ఆ ఆశ్రమం భయంకరమైన స్థలంగా మారిపోతుంది. అక్కడ ఒక్కొక్కరికి అక్కడ ఎదురయ్యే భయంకరమైన సంఘటనలతో వణుకు పుడుతుంది.

Advertisement

వింత శబ్దాలు, నీడలు, అకస్మాత్తుగా కనిపించే భయంకరమైన దృశ్యాలు… ఒకరి తర్వాత మరొకరికి కనిపిస్తాయి. శరీరాల్లో పురుగులు తిరగడం, చర్మం చీలడం, స్వయంగా తమని తాము గాయపరచుకోవడం లాంటి ఎక్స్‌ట్రీమ్ బాడీ హారర్ సీన్స్ సినిమా అంతా ఉంటాయి. నదియా క్రమంగా ఈ భయానక సంఘటనల వెనుక చేతబడి ఉందని గ్రహిస్తుంది. గతంలో ఆ అనాథాశ్రమంలో జరిగిన ఒక ఘోరమైన సంఘటన బయట పడుతుంది.

గతంలో అక్కడ ఉన్న అనాథ అమ్మాయి మిరాను హనీఫ్, అతని స్నేహితులు, కేర్‌టేకర్లు కలిసి అత్యంత క్రూరంగా హింసించి చంపేశారు. ఆమెను ఒక గదిలో బంధించి, శారీరకంగా, మానసికంగా భయంకరంగా హింసిస్తారు. మిరా చనిపోయే ముందు ఆ ఆశ్రమం వెనుక ఉన్న దట్టమైన అడవిలోకి వెళ్లి, బ్లాక్ మ్యాజిక్ విద్యలను నేర్చుకుంటుంది. చనిపోయిన తర్వాత ఆమె “ది క్వీన్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్”గా అవతరిస్తుంది. తనను హింసించిన వారందరినీ ఒక్కొక్కరిని భయంకరమైన రీతిలో శిక్షించడం మొదలు పెడుతుంది. ఆమె ప్రతీకారం చాలా క్రూరంగా ఉంటుంది. హనీఫ్ తన భార్య, పిల్లలను రక్షించుకోవడానికి ప్రాణాలు పణంగా పెట్టి ఎలా పోరాడాడు ? ఆ భయంకరమైన శక్తిని ఎలా ఎదుర్కొన్నారు? చివరికి ఏమైంది ? అనేదే ఉత్కంఠభరితమైన క్లైమాక్స్.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

Advertisement

ఇండోనేషియన్ సినిమాల్లో ఉండే రా, ఎక్స్‌ట్రీమ్ విజువల్స్ ఇందులో కూడా ఉంటాయి. చేతబడి, ప్రతీకారం కలిపి ఉన్న ఈ సినిమా Netflix, Amazon Primeలో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు కాబట్టి ఇంగ్షీషు సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు. ఇండోనేషియా నుంచి వచ్చిన ఈ ఎక్స్‌ట్రీమ్ బాడీ హారర్ థ్రిల్లర్ ను గుండె గట్టిగా ఉన్నవాళ్లు మాత్రమే చూడాలని గుర్తు పెట్టుకోండి.

Read Also: మినిస్టర్ కొడుకు కిడ్నాప్… పోలీస్, యంగ్ హ్యాకర్ ల పాట్లు చూస్తే కితకితలె

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×