E-Paper
Advertisement

Karthika Deepam 2 : ‘ కార్తీక దీపం2’ వంటలక్క ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?

Karthika Deepam 2 : ‘ కార్తీక దీపం2’ వంటలక్క ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?
Advertisement

Karthika Deepam 2 : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న టాప్ రేటింగ్ సీరియల్ కార్తీకదీపం 2. గతంలో వచ్చిన కార్తీకదీపం సీరియల్ కి ఈ సీరియల్ గా వచ్చింది.. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. సీరియల్లో రోజుకోటి విష్టుతో జనాలను ఆకట్టుకుంటూ అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇందులో దీప అలియాస్ వంటలక్క పాత్ర హైలెట్ గా నిలిచింది. మరి ఈ పాత్రలో నటిస్తున్న అమ్మడు పేరు ప్రేమి విశ్వనాథ్. ఈమె కేరళ కుట్టి. మలయాళం లో సినిమాలు సీరియల్స్ చేసి బిజీగా మారిన ఈమె, కార్తీకదీపం సీరియల్ తో తెలుగులోకి అడుగుపెట్టి ఇక్కడ మంచి క్రేజ్ సంపాదించుకుంది. వంటలక్క బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు చాలా మంది నెటిజన్లు తెగ వెతికేవారు.. అయితే ఇప్పుడు ఈ వంటలకు గురించి సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది. అదేంటంటే ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరి ఇండస్ట్రీలోకి రాకముందు వంటలక్క ఏం చేసిందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం

ఇండస్ట్రీలోకి రాకముందు దీప ఏం చేసింది..?

ప్రేమి విశ్వనాథ్ కేరళ కు చెందిన నటి. ఈమె 1991లో జన్మించింది. కేరళ రాష్ట్రం ఎర్నాకులంలోని ఎడప్పల్లిలో జన్మించింది. న్యాయవాద కోర్సు చేసింది… కొచ్చిలోని ఒక ప్రైవేట్ సంస్థకి లీగల్ అడ్వైజర్ గా కూడా పనిచేస్తుంది. అప్పట్లో ఆమె తన లాయర్ వృద్ధిని ఎక్కడ దుర్వినియోగం చేయకుండా చేసింది అని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇక ఈమె కేవలం లాయర్ మాత్రమే కాదు. ఫోటోగ్రాఫర్ గా కూడా వ్యవహరించింది. చిన్నప్పటినుంచి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం ఉండడంతో కొన్ని పెళ్లిళ్లకి ఫంక్షన్లకి ఈమె ఫోటోగ్రాఫర్ గా వెళ్లేదని తెలుస్తుంది.. ఆ తర్వాత అనుకోకుండా కొన్ని స్క్రీన్ మీద కనిపించే అవకాశాలు రావడంతో ఒప్పుకుంది. మలయాళం లో పలు సీరియల్స్, సినిమాలు చేసి బిజీగా మారింది. ఇక తెలుగులో కార్తీకదీపం సీరియల్ ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు పోలీస్ స్టేషన్ లో అవమానం.. అరుణ్ కు మైండ్ బ్లాక్.. మీనాకు ఝలక్..

ప్రేమీ విశ్వనాథ్ సీరియల్స్ విషయానికొస్తే..

ఒకవైపు లాయర్ గా పని చేస్తూనే.. మరోవైపు మోడలింగ్ పై దృష్టి పెట్టింది. 2013లో ఏసియానెట్ మలయాళం టెలివిజన్‌లో వచ్చిన కరతముత్తు ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. అలా ఒక్కో సీరియల్ తో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. 2017 లో కార్తీకదీపం సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించిన వంటలక్క ఇప్పుడు కార్తీకదీపం 2 లో కూడా నటిస్తుంది. ఏది ఏమైనా కూడా ఈమె ఆస్తులు కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తన లేటెస్ట్ ఫోటోలను ఫ్యామిలీ ఫోటోలను కూడా షేర్ చేస్తూ వస్తుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×