E-Paper
Advertisement

కోటి కొట్టేసి బెట్టింగ్లో… కట్ చేస్తే కుర్చీ దెయ్యానికి బానిసగా… 2 ఓటీటీలలో స్ట్రీమింగ్

కోటి కొట్టేసి బెట్టింగ్లో… కట్ చేస్తే కుర్చీ దెయ్యానికి బానిసగా… 2 ఓటీటీలలో స్ట్రీమింగ్
Advertisement

Horror Mystery Thriller: కొంతమందికి బెట్టింగ్ అంటే పిచ్చి పీక్స్ లో ఉంటుంది. కానీ ఆ పిచ్చి మరింత ముదిరి ఓ చైర్ కి బానిసను చేస్తే ? ఏకంగా తనను ఆపదలో ఆదుకున్న ప్రియురాలిని బలిచ్చే స్టేజ్ కి వెళ్తే ఎలా ఉంటుందో తెలియాలంటే ‘ది డెవిల్స్ చైర్’ (The Devil’s Chair) అనే ఈ మూవీపై ఒకసారి లుక్కేయాల్సిందే. 2025లో విడుదలైన ఈ తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సినిమాలో ప్రధాన పాత్రలు విక్రమ్ (జబర్దస్త్ అదిరే అభి), అతని ప్రియురాలు రుధిర (స్వాతి మందల్). స్టోరీ అంతా వీళ్లిద్దరి చుట్టూనే తిరుగుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తుంటారు. ప్రైవేట్ కంపెనీలో పని చేసే విక్రమ్‌ కు బెట్టింగ్‌లు అంటే పిచ్చి. ఆ వ్యసనంతో కంపెనీకి చెందిన కోటి రూపాయలను కొట్టేస్తాడు. వాటిని బెట్టింగ్‌ లో పెట్టి ఓడిపోతాడు. దీంతో ఉన్న ఉద్యోగం పోతుంది, అంతేకాదు లీగల్ కేసు సమస్యలు వచ్చి పడతాయి. ఇలాంటి కష్ట సమయంలో ఎయిర్ హోస్టెస్ అయిన రుధిర అతనికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది.

Advertisement

ఇక్కడిదాకా కథ నార్మల్ గానే ఉంటుంది. కానీ వీళ్ళ ఇంటికి ఓ కుర్చీ రావడంతో కథ అడ్డం తిరుగుతుంది. ఒకరోజు రుధిర తన అభిరుచి మేరకు ఒక పాతకాలపు యాంటిక్ కుర్చీని కొని ఇంటికి తెస్తుంది. అది దెయ్యం కుర్చీ. దానిని ‘పుండాక్ష’ అనే ఒక శతాబ్దాల నాటి మాంత్రికుడి దెయ్యం ఆవహించి ఉంటుంది. అలాంటి భయంకరమైన కుర్చీతో హీరో ప్రమాదకరమైన ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ కుర్చీలో ఉన్న దెయ్యం విక్రమ్‌ కు మాత్రమే కన్పిస్తుంది. రక్తం రుచి చూపిస్తే చాలు అడిగింది ఇచ్చేస్తుంది. అంతేకాదు అతను డబ్బు కావాలని కోరుకున్న ప్రతిసారీ కావలసినంత డబ్బు ఇస్తుంది.

ఆ తర్వాతే దాని అసలు రంగు బయట పెడుతుంది. విక్రమ్‌ కు 5 కోట్ల భారీ మొత్తాన్ని ఇస్తానని ఆఫర్ చేస్తుంది. కానీ దానికి ప్రతిఫలంగా అతని ప్రేయసి రుధిరను ప్రాణాలతో బలి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది ఆ కుర్చీ. దీంతో విక్రమ్ అయోమయంలో పడతాడు. ధన శోధనలో పడిన హీరో ప్రేయసిని ఆ దెయ్యానికి బలి ఇచ్చాడా ? ఆ కుర్చీ దెయ్యం బారి నుండి ఎలా తప్పించుకున్నాడు ? మనోజవ అనే మెంటలిస్ట్ హీరోకి చేసిన సాయం ఏంటి ? అన్నదే ఈ సినిమా కథ.

Advertisement

ఈ సినిమా Aha ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో విడుదలైంది. అలాగే ఈ మూవీని ఫ్రీగా చూడాలనుకునే వారు YouTubeలో కూడా వీక్షించవచ్చు. తెలుగు మూవీనే కాబట్టి ఆడియో కూడా తెలుగులోనే ఉంది. ఇక ఈ సినిమాలో అదిరే అభి, స్వాతి మందల్, ఛత్రపతి శేఖర్ కీలక పాత్రల్లో నటించగా, గంగా సప్తశిఖర దర్శకత్వం వహించారు.

Read Also: మోస్ట్ కాంట్రవర్షియల్ మలయాళం మూవీ ఓటీటీలోకి… స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ ?

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×